“నువ్వు ఎంత మంచివాడవైనా కానీ, నీతో సమానంగా చూడాలని నీ మనస్సులొ ఎంతైనా వుండనీ, ఏదో ఒక సందర్భంలో లిప్తకాలం పాటైన నేను నల్లవాడినని నీకు అనిపిస్తుంది. అదే నేను భరించలేను” అంటాడు మాల్కోం యెక్స్
ఇవాళ స్వదేశంలోనైనా, విదేశం లోనైనా తుపాకిదే రాజ్యం. తుపాకీకి రక్తం రంగు తప్ప జాతిరంగులు పట్టవు. మనం ఖండించాల్సింది ఆ రక్త పిపాసని తప్ప నల్ల రంగును కాదు, నల్ల జాతిని కాదు.
అమెరికా లోని భారతీయులకు భద్రత వుందా? ఇక్కడ భారతీయులు వివక్షకు గురవుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఇటీవల చర్చకు వస్తున్నాయి.ఈ రకమైన అనుమానాలకు తావిచ్చిన విషాద సంఘటన lousiana state university campus లొ జరిగిన ఇద్దరు తెలుగు విద్యార్దుల హత్యోదంతం. lousiana దురాగతం సందర్భంగాచర్చకు వచ్చిన అంశం జాతివివక్ష గురించి. ఇందులో నిందితుల్ని నల్లవాళ్ళుగా గుర్తించారు. చంపినది నల్లవాళ్ళు కాబట్టి ఇది hatecrime అని, జాతి వివక్షతోనే హత్య చేసి వుండవచ్చని తెలుగు మీడియా అభిప్రాయపడింది.
అమెరికా లొ racism పూర్వాపరాల గురించి మట్లాడాలంటే అది చాల పెద్ద చర్చ. అయితే ఈ సందర్భంగా మనం గుర్తించాల్సిన ఒకే ఒక్క అంశం ఏమిటంటే అమెరికాలొ జరిగిన hatecrimes అన్నింటిలో కూడా నేరస్తులు తెల్లవాళ్ళే కాని Afro-Americans కాదు.Afro-Americans చేసిన crimes ఎక్కువగా దొంగతనాలే.దానివెనుక వున్న మూలకారణం ఆకలిది, దరిద్రానిది..ఈ రెందు కారణాలు కూడా ఎక్కడైనా, ఎవరినైనా criminalsగా మార్చగలిగే శక్తివంతమైనవి.
అల్లం కిరణ్, చంద్రశేఖర్ ల హత్యలు జాతివివక్షతో చేసినవా? కావా? కావాలని చంపారా? పొరపాటు పడి చంపారా? డబ్బు కోసం చంపారా, పాత కక్షలున్నాయా? లాంటి చర్చల్ని కాసేపు పక్కనపెడదాము.ఎందుకంటే ఈ హత్యలు ఎందుకు జరిగాయో తేల్చి చెప్పటానికి మనదగ్గర ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవు కాబట్టి .
అమెరికాలో భారతీయులు జాతి వివక్షకు గురవుతున్నారంటూ వచ్చిన చర్చ గురించి మాట్లాడేముందు యే జాతికి యే జాతి అంటే వివక్ష వుండవచ్చో తరచి చూసుకుందాము.భారతీయులంటే నల్లజాతి వాళ్ళకు ద్వేషం, అసహనం. ఎందుకంటే వారి అవకాశాల్ని మనం లాక్కుంటున్నాము. మన వల్ల వళ్ళ ఉనికికి అభద్రత కలుగుతోంది. వారికంటే మనం ఉన్నతమైన హోదాలో వున్నందువల్ల వారికి మన మీద అసూయ,ద్వేషం, అసహనం లాంటివెవొఓవున్నాయన్నవి కొందరి అభిప్రాయము.
ఇది వాస్తవమా?
అసలు నల్లజాతివాళ్ళకు మనమీదే ఎందుకు కోపం? అమెరికాలో భారతీయులదే అగ్రస్థానమా? ఆర్ధికంగా, సాంస్క్రుతికంగా, సామాజికంగా మనదే ఆధిపత్యమా? గణంక లెక్కల ప్రకారం చూస్తే ఈ వాదన నిలబడదు. ఎందుకంటే jewish వాళ్ళతో పోలిస్తే అమెరికా సమాజంలో భారతీయులది ఏ స్థానం? అలాగే అమెరికాకు వలస వచ్చిన జాతుల జనాభ లెక్కలు తీసుకున్నా కూడ భారతీయుల స్థానం ఎన్నవదో అందరికి తెలిసిన విషయమే. మరి ఏ రకంగా చూసినా మనపై ఎవరికి జాతి వివక్ష వుంటుంది? కేవలం జాతి వివక్ష రంగుటద్దాలు పెట్టుకొనిచూస్తే లోకమంతా నల్లరంగుగానే కనిపిస్తుంది.
సెప్టెంబర్ 11 తర్వాత అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన దాడులు భారతీయులపై జరిగిన దాడులుగా కాకుండా ముస్లిం వర్గాలుగా భావించి జరిగిన దాడులుగానే చూడాలన్న విషయం అందరూ అంగీకరించే విషయమే. మన దేశంలో ఇందిరాగాంధీ హత్య తర్వాత సిక్కులపై జరిగిన దాడులు ఏ వివక్షకు సంబంధించినవి? గుజరాత్లోని గోద్రాలో జరిగిన అల్లర్లు, ముస్లింల ఊచకోత ఇవన్నీ దేనికి పరాకాష్ట? ఇప్పటికీ పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్య వున్నది కేవలం కాస్మీర్ సరిహద్దు సమస్యేనా?
నల్లవారికి మనపై జాతి వివక్ష వుందో లేదో కానీ మనలో చాలామందికి వారిపై లోపల్లోపల జాతివివక్ష వుందనే చెప్పాలి. తుపాకీతో ఏ భారతీయుడు ఏ నల్లవాడిపై దాడి చేసి వుండకపోవచ్చు.వారిని చూడగానే దొంగలో, క్రిమినల్స్ అనో మనం చూసే అనుమానపు చూపుల మాటేమిటి? నల్లవాళ్ళు వున్న ప్రాంతాల్లో నివసించాలన్నా , వాళ్ళ పిల్లలు ఎక్కువ మంది వున్న schoolsలో మన పిల్లల్ని చేర్పించాలన్నా మనవాళ్ళు ముందుకురారన్నది అంగీకరించినా, లేకపోయినా వాస్తవమేనని చెప్పక తప్పదు. దళితులని, పంచములని, స్త్రీలని, ముస్లింలని కులాలుగా, జాతులుగా వెలి వేయడం, వివక్ష చూపడం, ద్వేషించడం బహుశా మన రక్తంలో నరనరాన ఇంకిపోయివుంటుంది. అది అంత తొందరగ ఒక పట్టనా వదిలే లక్షణం కాదనుకుంటాను.
“మనలో చాలామందికి వారిపై లోపల్లోపల జాతివివక్ష వుందనే చెప్పాలి.వారిని చూడగానే దొంగలో, క్రిమినల్స్ అనో మనం చూసే అనుమానపు చూపుల మాటేమిటి?” 100% true.