ఈ రంగు పేరు ఫ్రిదా
జనవరి 12, 2008 ద్వారా kalpanarentala
Her Story Begins:
*
మెలకువలో జననం
స్వప్నంలో మరణం
నడుమ నెత్తుటిని పులుముకున్న రంగుల ప్రపంచం
ఆ గోడలు ఆమె బాధల్ని పలవరించాయి
ఆమె కన్నీటిని తుడిచాయి
ఆమె కుంచెల్ని హత్తుకున్నాయి
ఆమె దుఃఖానికి రంగులద్దాయి
సరిహద్దుల్లేని ఆ నీలపు గోడలు
ఇప్పుడామె కలవరింతల కథల్ని
మనకి చెబుతాయి
ఆ గోడలు ఆమె వేదనకు
ఎర్రరంగునద్ది విసిరేశాయి
ఆమె దుఃఖాన్ని కలబోసుకున్న కుంచెలన్నీ
తన బొమ్మలై రంగులరాట్నమాడాయి
ఆమె గాయాల ముందు మోనాలీసా
నవ్వు చిన్నబోయింది
మూడు ముక్కలైన వెన్నుపూస
నడిరోడ్డుపై పోగొట్టుకున్న వెజీనా
32 శస్త్రచికిత్సలు
రెండు గర్భ విచ్ఛిత్తులు
రెండొందల చిత్రాలు
ఇదీ నాలుగుమాటల్లో ఆమె జీవితం
తనువు నిండా కత్తిగాట్లు
తలవెనుక మృత్యనీడల సహజీవనం
అరణ్యంలోకి పరుగెత్తిన
గాయపడ్డ లేడి
సింహాన్ని చంపి ఇప్పుడు అడవికి రాణి
ఆమె మరణం కొత్తచూపు
ఆమె గాయం కొత్తపాఠం
కొందరంతే ఏటికి ఎదురీది మరణిస్తారు
మరణంతో గెలిచి బతుకు అర్థం చెపుతారు
Viva la Frida ( Long live Frida)
(వేదనకు కొత్తచూపునిచ్చిన మెక్సికన్ చిత్రకారిణి ఫ్రిదా కహ్లో కోసం …)
కల్పనా రెంటాల
అంధ్రజ్యోతి ఆదివారం (డిసెంబర్ 23,07)అనుబంధం
maa chettu meediki kotta koilalennoo vacchi vaalutunnai ..
naakentha santoshamgaa undoo :))
chakradhar
http://www.chakradhar.net
can u tell some details /links about her . i didn’t find any relative content.
ఫ్రిడా కాలో వికీ
2002 లో ఈమె జీవితం పై ఫ్రిడా అనే సినిమా వచ్చింది. ప్రఖ్యాత మెక్సికన్ హాలీవుడ్ నటీ సల్మా హాయెక్ ఆమె పాత్రని పోషించింది.