![]()
![]()
ఆ వానచుక్కల అడుగుల చప్పుడు
కళ్ళకు వినిపిస్తునే వుంది
ఆ గాలి కిటికీ మూతపడుతున్న శబ్దం
చెవులకు కనిపిస్తునే వుంది
ఆత్మీయ అశాంతి
చెక్కిలిని ముద్దాడుతునే వుంది
తడి సంతకం
సముద్రం తలుపు తడుతూనే వుంది
ఇప్పుడక్కడ ఎవరూ ఎవరితోనూ కలవరు
ఏది ఎవరికి మిగలనివ్వని రహస్య జడివాన
యవ్వనాన్ని స్కలిస్తోంది
కాంక్షల్ని ఎగరేస్తోంది
వదిలిపెట్టలేని ఏకాంతాన్ని
దగ్గరవ్వలేని శరీరాన్ని
అగ్గిలా తడిపి ఆరేసే వానని
కొంచెం ఒడిసిపట్టుకుందాం, ఇటు రండి
కల్పన గారు : కళ్ళకు వినిపిస్తునే వుంది … చెవులకు కనిపిస్తునే వుంది … ఇది అప్పు తచ్చా … లేక ఏదైనా వింత/కొత్త పద ప్రయోగమా !?
Adi kotta prayogam. mee email id ki detailed mesg iste return vachhindi.
Kalpana
ఆ కొత్త పద ప్రయోగమేదో మాకూ విపులంగా మెయిల్ పంపగలరా?
kara_svas@yahoo.com
ఈ కవిత శీర్షిక పేరే రహస్య వాన. అది మాములుగ బయట మనకు కనిపించే వాన గురించి రాసినది కాదు. కొన్ని కాంక్షలు, లేదా కొన్ని ప్రత్యేక అనుభూతులప్పుదు మనలొ కలిగే స్పందనల్ని నేను వానతొ పోలుస్తూ చెప్పాను. కవిత్వంలో శిల్ప చమత్కారలు, శబ్ద చమత్కారాలు వుంటాయి. ఇది శబ్ద చమత్కారం. ఆ రహస్య వానను అనుభవించతానికి, లెద అనుభూతించతానికి మములు ఇంద్రియాలు ఎలా పనిచెస్తాయో ఒక శబ్ద చమత్కారంగా చెప్పాను. ఇంతకన్నా ఇంకా వివరించి చెప్పుకుంటూ పోతే ఆ కవిత అందమంతా పోతుందనుకుంటాను. ఇప్పటికింతే.
బాగుంది కవిత. బహుశా నేను కూడా అచ్చు తప్పు అనే అనుకునేదాన్నేమో వివరణ చూడకముందయితే. చూసినతరవాత, అందులో అందం అర్థమయింది. ఇంగ్లీషు అనువాదం కూడా చూసేను. ఆయనే అన్నట్టు చివరి నాలుగు పాదాలు సాన పట్టాలనిపించింది.
అభినందనలు.