రాలిపడ్డ జ్ఞాపకాలు
జనవరి 24, 2008 ద్వారా kalpanarentala
స్నానం
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులు![]()
![]()
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది
నువ్ చేసిన గాయస్రావం రాత్రి
నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో
నా నడుంగీత మీంచి
నువ్వలా నడిచివస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును కదా
అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు
ప్రాణమా
ఎదురుగ వుంది
దేహమా
ఇక్కడే వుంది
మరి కలయిక….
నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు
“అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు”అచ్చుతప్పులాగుందండి.
మీ కవిత చాలా బాగుంది.