ఏమిటి ఈ స్లీపింగ్ పిల్ కథ? ఇందులో ఏమి చెప్పాను? ఎలా చెప్పాను? ఎందుకు చెప్పాను? అన్న వివరణల్లోకి వెళ్ళే ముందు …..
నిజానికి ఓ రచయిత తన అభిప్రాయాలేమిటో పూర్తిగా కథలోనే చెప్పగలగాలి. అప్పుడే కథా రచన టెక్నిక్కు అలవడినట్టు. వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే రచయిత తన అభిప్రాయాన్ని కథలో సరిగ్గ చెప్పి వుండకపోవడం లేదా చెప్పలేకపోవడం ఒక కారణం.రచయిత చెప్పినది పాఠకులకు అర్ధం కాకపోవడం వెనుక పాఠకుడి అవగాహనా లోపం కూడా కొంత వుంటుంది అని [...]
ఫిబ్రవరి, 2008 నెల టపాలు
ఏమిటి ఈ స్లీపింగ్ పిల్ కథ?
Posted in కథ, స్పందన, అఁటిఁచబడినది కథ, స్పందన, kadha, spandana on ఫిబ్రవరి 24, 2008 | 3 వ్యాఖ్యానాలు »
స్లీపింగ్ పిల్
Posted in కథ, అఁటిఁచబడినది కథ, kadha on ఫిబ్రవరి 16, 2008 | 12 వ్యాఖ్యానాలు »
ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా.
”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య.