ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా.
”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య.
ఫిబ్రవరి 16th, 2008 నాటి టపాలు
స్లీపింగ్ పిల్
Posted in కథ, అఁటిఁచబడినది కథ, kadha on ఫిబ్రవరి 16, 2008 | 12 వ్యాఖ్యానాలు »
నిషిధ్దాక్షరి
Posted in కవిత్వం, అఁటిఁచబడినది కవిత్వం, kavitvam on ఫిబ్రవరి 16, 2008 | Leave a Comment »
మాట ఎప్పుడూ అంతే
చెప్పిన మాట వినదు
మాట కత్తిరిస్తుంది
బంధాల్ని, బంధనాల్ని
మాట కలుపుతుంది
మనుష్యుల్ని, మనసుల్ని
మరణానికి ముందో, వెనుకో
ఓ మాట మాట్లాడవూ?
ఫ్రేమకు ముందో, మోసం తర్వాతో
ఓ మాట మాట్లాడవూ?
వర్ణక్షరాలతో కాదు
వొంటి మీద గాయాలతో
నెత్తురోడుతున్న మనసుతో
మాట్లాడవా
రక్తస్రావం గురించో
మనస్తాపం గురించొ
మాట్లాడవా?
***
దాక్కుంటున్నవా? దాచుకుంటున్నవా?
ఏదో ఒకటి చెప్పు
ఎగతాళైన తాళి గురించో
ఓడిపోయిన అమ్మతనం గురించో
మూసిన బాధల గుప్పెట్లొంచి
రంగురంగుల సీతకోకచిలుకల్ని
ఇక ఎగరేయి