చాలా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా బ్లాగులో ఈ టపా రాస్తున్నాను. నా కుడిచేయి యే
పని చేయనివ్వకపొవడమే టపాలు రాయకపోవడానికి కారణం.రెగ్యులర్ గా కాకపోయినప్పటికి అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన టపాలు చదువుతూనే వున్నాను.
కొన్ని టపాలకు స్పందించాలని అనిపించినప్పటికి ఒక అరగంట కంప్యూటర్ మీద పని చేయడం వల్ల తర్వాత వచ్చే నొప్పికి భయపడి వూరుకున్నాను. ఆ నొప్పిని కూడా పక్కన పెట్టించి నా చేత ఈ టపా రాయిస్తున్న ముఖ్యమైన అంశాలు ఏమిటంటె…
బ్లాగులోకంలో చాలా మంది అభిమానాల్ని సంపాదించుకున్న ‘మనసులోని మాట ‘సుజాత రాసిన జర్నలిస్టు ఉద్యోగం టపాలు, ఆ టపాలకు వచ్చిన కామెంట్స్ లోని అభిప్రాయాలు నన్ను ఎక్కువగ అలోచింపచేసాయి. నా చేత మళ్ళీ ఈ టపా రాసేలా చేసాయి.
అసలు బ్లాగు అంటే ఏమిటి?దాని ఉద్దేశం, టపాలు, వాటిలోని డెమొక్రసీ, వాడవలసిన భాష, సమాధానాలు చెప్పాల్సిన పద్ధతి వీటన్నింటిమీద నాకు బోలెడన్ని సందేహాలు వచ్చాయి.
అవి పంచుకోవడమే ఈ టపా వుద్దేశము.నా సందేహాలకు తోటి బ్లాగర్ల నుండి వారి వారి అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ చర్చ సంచలనాల కోసమో, ఎవరినో దుమ్మెత్తిపోయాడానికో మాత్రం కాదని దయచేసి అర్ధం చేసుకోండి. ప్రజాస్వామ్యయుతమైన చర్చలకు బ్లాగుల్ని ఒక వేదికగా చేసుకుందాము వీలైతే.
బ్లాగు అనేది ఒక పర్సనల్ డైరీ లాగానో, ఒక జర్నల్ లాగానో మొదలైనప్పటికి అది కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దాని వుద్దేశం, పరిధి మరింత విశాలమయ్యాయి.ఇప్పుడు అది ఒక సొంత పత్రిక లాగా తయారైంది. ఇది శుభ పరిణామమేనని నేను అనుకుంటున్నాను.
అయితే సొంత పత్రిక అయినంతమాత్రాన మనిస్టమొచ్చినవి మనం రాసుకోవచ్చా? బూతులు, శ్రుంగారం లాంటివి ఏవైనా సరే.కూడలి లో స్థానం కల్పించరు కాబట్టి అలాంటివి రాయడం మానుకోవాలా? లేక అది మన వ్యక్తిగత సంస్కారం కూడా అయి వుండాలా?
అసలు బ్లాగరిజం అంటే ఏమిటి? వాటికి నియమ నిబంధనలు వున్నాయా? భాష విషయంలోనైనా, భావం విషయంలోనైనా? వుంటే అవి ఏమిటి?
మన భావాలు, అభిప్రాయాలు అందర్ని వొప్పించేవిగా, మెప్పించేవిగా వుండనక్కరలేదని తెలుసు కాని అవి వాస్తవాలైనా అయి వుండాలా? అక్కర్లేదా?
ఉదాహరణకి ఒక మతం మీద రాస్తున్న రాతలు చూద్దాము. ఒక మతం గురించి ఒక బ్లాగరు రాస్తున్న రాతలు , విషయాలు అసత్యాలు, అసంబద్దమని మనకు తెలుసు కాబట్టి ఒకసారి ఆ బ్లాగుకి వెళ్ళి మనం ఏమనుకుంటున్నామో చెపుతాము. వినకపోతే, అర్దం చేసుకోకపోతే మర్యాదగ పక్కకు తప్పుకుంటాము. మనకిస్టం లేని బ్లాగులకు వెళ్ళకపోవడమే పరిష్కరమా? ఇంకా ఏమైనా పద్దతి వుందా? ఒక బ్లాగులో రాసినవి వాస్తవాలు కాకపోతె, మనకు నచ్చకపోతే కామెంట్స్ రాయాల? వద్దా? రాస్తే వాళ్ళు వేయకపోతే మనం ఏమైన చేయగలమా? అసలు ఏమైన చేయలా? మిన్నకుండాల? వాస్తవాలు మనకు తెలిస్తె చాలా? అందరికి చెప్పాలా? ఇలంటి పరిస్థితుల్లొ బ్లగెర్ కి వున్న హక్కులు ఏమిటి? వ్యాఖ్యాతలకున్న హక్కులు ఏమిటి?
ఇదొక ఉదాహరణ మాత్రమే. ‘మనసులోని మాట ‘ సుజాత రాసిన ‘ నా జర్నలిస్టు ఉద్యోగం -మూడు భాగాలు ‘ టపాలు చదివాక నాకు అభ్యంతరకరం అనిపించినవి నా కామెంటుగా నా పేరుతోనే జూలై 17 లేదా 18 పంపాను. నా కామెంట్ ప్రచురితం కాలేదు. పైగా మూడో భాగం టపా మాయమైంది. ఎందుకో వివరణ లేదు. తర్వాత సెలవులు అనే టపా రాసింది. నా పాత కామెంట్ ఏమైందని అక్కడ కూడా ఒక కామెంట్ పెట్టాను. నా కామెంట్లు రావడం లేదు కాని మిగత వారి కామెంట్స్ వస్తున్నాయి అని. ఆశ్చర్యంగా అది కూడా ప్రచురితం కాలేదు.
మూడో భాగం టపా ఎందుకు తీసెసారు? నా కామెంటు ఎందుకు వేయలెదు అని అడిగే హక్కు నాకు వుంటుందా? వుండదా? బ్లాగుల్లొ పొలిటికల్లి కరెక్ట్ భాష వాడక్కరలెదు అన్నది కొందరి బ్లాగర్ల అభిప్రాయమా? లేక తెలుగు బ్లాగుల లక్షణమా?
తెలుగు బ్లాగులు చేస్తున్న సేవ గురించి పత్రికల్లో ముఖచిత్ర కధనాలు వస్తె తెగ మురిసిపోయిన అభిమానిగా నాకొచ్హిన ఈ సందేహాల్ని ఎవరైనా తీరిస్తే వారికి ధన్యవాదాలు. నన్ను నేను సరిదిద్దుకుంటాను.
కొంతకాలం క్రితం శృంగారం మీద వ్యాసాలతో ఒక బ్లాగ్ ప్రారంభిస్తే నీలి సైట్స్ కి లింకులున్నాయని కూడలి నుండి ఎత్తేసారు. కూడలి లో వస్తుందని అప్పట్లో వళ్ళు కాస్త దగ్గర పెట్టుకొని రాసేవాడిని. ఇప్పుడు దాంట్లో రావడం లేదు కాబట్టి ఎంచక్కా నాకు నచ్చిన రీతిలో రాసుకుంటున్నాను. శౄంగార అభిమానులకు కొదవలేదు కాబట్టి హిట్స్ కీ కొదవలేదు. శృంగారాన్ని తప్పు, పొరపాటు అనుకోను నేను. అలాంటివాటికీ కూడలి లాంటి వాటిల్లో చోటు వుండాలి. వీవెన్ నా అభిప్రాయంతో ఏకీభవించినా పాఠకుల ‘మనో భావాలు ‘ (?!) ఇబ్బంది పడతాయని వద్దన్నారు. అలాంటి వ్యాసాలు పత్రికలలో రావడమే కాకుండా ప్రముఖ తెలుగు పోర్టల్ లలో కూడా రావడం ప్రారంభమయ్యింది. వాటికి లేని అభ్యంతరం కూడలి కి వుంది. కూడలి లొ వున్న సమస్య ఏమిటంటే చాదస్తుల అభిప్రాయాలకు విలువ నివ్వడం. ఇలా పరిస్తితి వున్నంతకాలం వైవిధ్యానికి, యువత సంబధించిన వాటికి చోటు వుండదు. ఓల్డ్ ఏజ్ కు సంధించిన దానిలా అవుతుంది. వీవెన్ ని తమ పాలసీని మరో సారి సమీక్షించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మీ ఆరోగ్యం త్వరలోనే బాగుపడాలని ఆశిస్తాను. ఇంత శ్రమ తీసుకొని మీరు ఈ ప్రశ్నలు రేకెత్తించడం అభినందనీయం.
కల్పన గారు,
నా టపా మాయం కాలేదు. దాంట్లో నేను కొన్ని అచ్చ్చుతప్పులు సవరించడం వల్ల అది కూడలిలో నాలుగోసారి ప్రత్యక్షం కాబోయే పరిస్థితి వచ్చింది. (అది నా సెలవుల బ్లాగులో రాసానే!) అందువల్ల దాన్ని draftగా save చేసి ఉంచాను. ఎందుకంటే మళ్ళి మళ్ళీ ఇదే పొరపాటు జరిగితే కూడలి లోంచి నా బ్లాగుని బ్లాక్ చేసే అవకాశం ఉందని నేను భయపడ్డాను. ఇవాళ నేను గుంటూర్లో ఉండడం మంచిదే అయింది. మీ టపా చూసి వెంటనే స్పందించగలుగుతున్నాను. నా సెలవులు ప్రకటించాక నా బ్లాగులో కామెంట్స్ చూడమని నా మేనకోడలికి అప్పగించాను. అది ఉద్యోగంలో బిజీగా ఉండి అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ ని పబ్లిష్ చేసింది. ‘వివాదాస్పదంగా ఉన్న వాటిని ఏం చేయాలి? “అనడిగింది. నేను చూస్తాను వదిలేయమన్నాను. నిన్న మధ్యాహ్నమే గుంటూర్లో నా బ్లాగు సెలవుల టపాకి ఉన్న కామెంట్స్ అన్నింటినీ చూసాను. వాటితోపాటే మీదికూడా! ఇక నాకు అభ్యంతరకరంగా ఉన్న కామెంట్స్ ని reject చేయడం నా హక్కు అనుకుంటున్నాను. ఇదివరలో నా కామెంట్స్ కి కూడా కొన్ని సర్లు ఈ గతి పట్టింది.అందునా నాకు ‘సుభాషితాలు ‘ వినే అలవాటు లేదు. చెప్పడం అంటే ఇంకా చిరాకు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే సులభం అదే కదా!
నేను ఆ హిమబిందు కిచ్చిన సమాధానంలోనే చెప్పాను ‘ ఇవి నేను పని చేసిన కాలంలో నాకెదురైన అనుభవాలే నని ‘వ్యంగ్య ధోరణి, హాస్యం నా అభిమాన విషయాలని నా బ్లాగులు చదివే వారందరికీ తెలుసు. ఇది కూడా చెప్పాను.
నేను ఎంత కాలం పని చేసానన్నది అప్రస్తుతం! దశాబ్దాల కాలం పని చేస్తేనే అనుభవాలు రాయాలని నాకు తెలీదు. అంతకాలం పని చేస్తే ఏకంగా పుస్తకమే రాయొచ్చు! నేను సడన్ గా అమెరికా వెళ్లవలసి రావడంతో ఉద్యోగం వదలాల్సి వచ్చింది. అక్కడికెళ్ళాక కూడా కొన్నాళ్ళు రాశాను, ఆ వివరాలు నేను హైదరాబాదు వచ్చాక చివరి భాగంలో రాస్తాను.
“కొంచెం ఇటుతిరిగి ఏడవండి ” కొడుకుని పోగుట్టుకుని కుములుతున్న తల్లితో టీవీ చానల్ తాలూకు కెమెరామన్ అంటే పర్వాలేదు.
ఒక ప్రముఖ వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే అందరికంటే ముందే వార్తను ప్రసారం చేయాలన్న దురదతో ఆయన పోయాడని (ఎలాగూ పోతాడుగా అని) న్యూసులో చెప్తే పర్వాలేదు.
ఒక వ్యాపారవేత్త మీద అసత్య అవినీతి వార్తను ప్రసారం చేసి, అది అబద్ధం అని సాక్ష్యాలతో సహా వివరణ రాగానే, కేవలం ‘స్క్రోలింగ్ ‘ మాత్రం ఆపేస్తే..ఓకే!
కానీ..
“ఆడపేజీ” అని రాయకూడదు. ఈ సారి రంగనాయకమ్మ గారినడగాలి అలాంటి వంటింటి చిట్కాల పేజీలని ఏమని పిలవాలో! ఆవిడైతే కరెక్టుగా చెప్పగలరు.
తొమ్మిదేళ్ళ నాటి జర్నలిజానికి, ఇవాల్టి జర్నలిజానికి తేడా ఉందన్నారు. నిజమే! సాక్షి, ఈనాడు పేపర్ల ప్రత్యేక పేజీలు చాలా బాగుంటున్నాయి. మరి నేను తొమ్మిదేళ్ల సంగతులు రాస్తున్నానని చెప్పే రాస్తున్నానుగా!
కలం అమ్ముకుంటున్నారని అన్నది నేను కాదు. నా టపాకి కామెంట్స్ రాసినవాళ్ళెవరో వివరాలతో సహా అన్నారు.
మానవీయ కోణం అంటే నా బుర్రకి అర్థం కాలేదు. కొంచెం వివరించగలరు. ఈ సారి జాగ్రత్తగా ఆవిష్కరిస్తాను.
చివరగా….
ఆడపేజీ అంటే మనల్ని మనమే అవమానించుకున్నట్టు అని భావించారు. కనీస పరిచయం కూడా లేకుండా ‘రాసింది ‘ ‘చేసింది ‘ అని సరాసరి ఏకవచనం వాడేస్తున్నారు…. (నేను నాకంటే చిన్న వారిని కూడా ‘నువ్వు ‘ అనడానికి అనుమతి అడిగుతాను) ఇదేనా మీరు ఆడవాళ్లకు అదేలెండి, స్త్రీలకిచ్చే గౌరవం?
(నిజానికి నేను ఒక ఇంజెక్షన్ కోసం(for my mother who is ICU now) గుంటూరు వచ్చి అది ఇవాళ దొరుకుతుందనడంతో ఆగి, కూడలి తెరిచి చూశాను. ఇక మీ బ్లాగులో దీని గురించి జరిగే చర్చను ఎప్పుడు చూస్తానో మరి!)
బ్లాగు అనేది అక్షర రూపంలో ఒకరి వ్యక్తిత్వం/మనస్తత్వం. అది ఎలా ఉండాలి అని మరొకరు నిర్వచించడం పూర్తిగా అనవసరం, అసంబద్దం. మనం కామెంటు రాస్తే అది ప్రచురించడమా లేదా అన్నది అవతలి బ్లాగరి ఇష్టం – అందులో లేకి గొప్పలు లేవు. ఆ మాత్రం స్వాతంత్రం లేకపోతే అది సొంత బ్లాగు కానే కాదు.
ఒకరు నారాయణా అంటే మరొకరికి అది బూతు లాగా అనిపించవచ్చు, ఏమీ చెయ్యలేం. ఒక్కొక్క బ్లాగులో ఒక్కక్క నీతి ఉంటుంది, ఎవరిష్టం వారిది! మనిష్టం మనది!!
బ్లాగులో ఇది రాయాలి, అది రాయాలి అని నిర్వచించే హక్కు ఎవ్వరికీ లేదు. పత్రిక అంటే సమాజానికి జవాబు దారి, అంతే కాని బ్లాగు కాదు. బ్లాగులో ఏమి రాయాలి అనేది అది రాసేవారి విజ్ఞతని బట్టి ఆధారపడిఉంటుంది. చదవడం, చదవకపోవడం అనేది మీ ఇష్టం. కామెంట్ల విషయం అంటారా రాయడం, రాయకపోవడం మీ ఇష్టం, కామెంట్ పబ్లిష్ చెయ్యాలా వద్దా అనేది బ్లాగర్ ఇష్టం.
మీ దారి మీది కూడలి దారి కూడలిది. మీ బ్లాగు మీ ఇష్టం..కూడలి కూడలి నిర్వాహకుల ఇష్టం. మధ్యలో మనోభావాలు తొక్కలు ఎందుకు. నాగరాజా వారి మాటే నామాటనూ
మీరు సుజాత గారికి చెప్పిన అభ్యంతరకరమైన ఆ ‘సుభాషితాలు ‘ ఏమిటి?
రెంటాల కల్పనగారి లాంటి సీనియర్ రచయిత కూడా బ్లాగరి సుజాతగారి రాతల్లోని వ్యంగ్య వైభవాన్ని అపార్థం చేసుకుంటే ఎలా? నిజానికి ఆవిడ ఎదురుగా నిలుచుని మాట్లాడినట్టే అనిపించే ఆమె రాతలకు మనం ఏ విధంగానూ దురుద్దేశాలు అంటగట్టలేం. కల్పనగారూ, దయచేసి మరోసారి మళ్లీ ఆ మూడు భాగాలను మరోసారి చదవండి. మీ కుడుచేతి నొప్పి వేగం తగ్గిపోవాలని కోరుకుంటున్నాను. మీలాంటి సీనియర్ అనువాదకుల వలన మాకెంతో ప్రయోజనం. నమస్తే.
అలాగేం. మరి ఎవరి వ్యాఖ్య వారి ఇష్టం అనుకోలేదేం. మధ్యలో తొక్కలు ఎందుకో మరి.
Kalpana Gaaru
Sujatha gaari paina Meeru vaadina bashe abyantaram ga undi. Sujjatha gaari kathalu, aavida abiprayalu raasaru. Meeku adi correct anipisthe artha chesukondi, tappu anipisthe vadilleyandi.
Ante gaani, blogs lo kooda ila rayandi alaga rayaddandi ante …meere cheppandi idi kudurutunda.
Comments pettadam, pettaka povadam tanishtam endukante aa abhiprayalu tanavi kabatti
Meeru tondaraga kolukovalani aa devunni prarthisthu…..
Sujatha Garu
Meeru ekkuvua emotional ayyaranukonta
Mother problem valla ayyindochu. Vimarsani enjoy cheyyadam nerchukondi.. (Meeru rasindi correct ga unnaa sare)
Mee mother Tondaraga kolukoani aa Devunni Prarthisthu….
–Madhu Janjur
Andariki :: Naaku correct anipinchindi cheppanu.. Anyadha bavinchakandi. Naagaraj, Pratap, Ravi tote neeooo…
నిజానికి ఈ జాబు రాయడం తోటే మీకు తెలిసిపోయింది.. ఏం చెయ్యాలో!
(అయినా, చెప్పాలన్న దురద కొద్దీ చెబుతున్నా… ఏ బ్లాగులోనైనా మీకు నచ్చని సంగతులు కనిపిస్తే అక్కడికక్కడే వ్యాఖ్యల్లో చెప్పెయ్యొచ్చు. మీ వ్యాఖ్యను అక్కడ అంగీకరించకపోయినా, లేక అక్కడ వ్యాఖ్య రాయాలని మీకే అనిపించకపోయినా.., మీ బ్లాగు ఎలానూ ఉండనే ఉంది.)
హల్లో కల్పన గారు,
బ్లాగర్ల హక్కులు-బాధ్యతలు అంటూ మంచి ప్రశ్నలు లేవనెత్తారు. సీనియర్ బ్లాగర్లు, బ్లాగులోకానికి నాయకులకు ఎవరికి రైట్ పాయింట్ మాట్లాడే ధైర్యం లేదు అనుకుంటాను.
ఇక్కడ బ్లాగులోకంలో ఎవరి గ్రూపు వారిది. మీకు ఒక గ్రూపు వుంటే మీ దాంట్లో కూడా మిమ్మల్ని పొగుడుతూ కామెంట్స్ వస్తాయి. సుజాత గారి బ్లాగులో కామెంట్స్ రాసిన వాళ్ళెవరు మీ వెర్షన్ వినాలని అనుకోవడం లేదని మీకు అర్ధమయ్యే వుంటుంది.
మీ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అన్నది నాకు తెలియదు. మీ వెర్షన్ చెప్పటానికి మీరు సిద్ధంగా వున్నా మీరు చెప్పే నిజాలు అందరికి తెలియడానికి సుజాత గారు సిద్దంగా లేరు. ఆమె రచనల్ని తెగ పొగిడిన జనాలకు ఇప్పుడు ఇది కొరుకుడు పడదు. ఈ విషయాల్ని ఇంతటితో వదిలేసి మీ ఆరోగ్యం చూసుకుంటే మీకే మంచిది.
అనానిమస్
@అనానిమస్ గారు
మీ సలహాకు ధన్యవాదాలు.
@చదువరి గారు
అర్ధమైంది.
@ మధు గారు,
నేను సుజాత గారి రచనలపై పెట్టిన కామెంట్స్ పబ్లిష్ కాకుండానే నేను వాడిన భాష అభ్యంతరకరంగా వుందని ఎలా తెలిసింది?సుజాత గారు నా పోస్ట్ కి రాసిన కామెంట్స్ కూడా ఆమె అభిప్రాయాలే. నా వ్యాఖ్యలు కావు. అలాగే బ్లాగుల్లో ఎవరు ఎలా రాయాలో నేను చెప్పలేదు. చెప్పను కూడా.సుజాత గారి రచనలపై నా అభిప్రాయలు చెప్పాను. ఆమెకు అవి నచ్చలేదేమొ ప్రచురించలేదు.
@రవికుమార్ గారు,
నావి దురుద్దేశాలు కాదు. వుద్దేశాలు. అవతల వారి అభిప్రాయాల్ని (పక్కవారికి ఏమి రావన్న)ఖండించాను. మూడో భాగం సుజాత గారు యథాతథంగా (ఇంతకు ముందు వున్నట్టే ఏలాంటి మార్పు లేకుందా)బ్లాగ్‌లో పెడితే చాలా మంది చదివి తెల్సుకోగలరు.
నాలాటి సీనియర్ల కామెంట్స్ ప్రచురణకే నోచుకోనప్పుదు నా వల్ల పెద్ద ప్రయోజనం వుంటుందని నేను అనుకోను.
@పారదర్శి గారు,
ఆ సుభాషితాలు 1. విద్యకు వినయం తోడైతే అదనపు ఆభరణం. 2. చేసిన దానం చెప్పుకుంటే ఫలితం వుండదు.
@రవివైజాసత్య గారు,
మనోభావల తొక్కల గురించి కాదు నేను మాట్లాడింది. హక్కులు-బాధ్యతలు, విశ్వసనీయత గురించి.
@ప్రతాప్ గారు,
బ్లాగులో ఏమి రాయలి, ఏలా రాయలి అని నేను నిర్వచించలేదండి. . ఒక పదం వాడవచ్చా, లేదా అన్నదాని గురించి నేను నా అభిప్రాయం చెప్పాను. విజ్ఞత లేని రాతలు అనిపించాయి కాబట్టే నా కామెంట్స్ పెట్టాను. కాని ప్రచురణకు గురవకపోవడంతో నాకొచ్చిన సందేహాలు పోస్త్ చేసాను.
@ నాగరాజా గారు,
కామెంట్ ప్రచురించడంలో లేకి గొప్పలేమిటొ నాకు సరిగ్గ అర్ధం కాలేదు. కామెంట్స్ అంతే పొగడ్తలే అని అర్దమైంది.
@శరత్ గారు,
మీ సంఘీభావానికి థాంక్స్.
@సుజాత గారికి,
మీకు సమాధానం వేరే పోస్ట్ ఇవ్వాలి.
డియర్ అనోనీమస్సమ్మ గారు ,
స్త్రీ సహజమైన లక్షణాలుగా చెప్పబడే అసూయ మొదలగు వాటికి మీరు అతీతులు కారని అర్థమైంది. బ్లాగర్ గా నా వయసు కేవలం నాలుగు నెలలు! ఈ లోపునే గ్రూపులు కట్టేంత రాజకీయ చాతుర్యం నాకు లేదు. ‘ఆమె గారి రచనలను తెగ పొగిడిన వాళ్ళు ‘…ఎవరండీ తెగ పొగిడిన వాళ్ళు? ఎవరి రచనలు నచ్చితే వారిని అభినందిస్తారంతే ఎవరైనా! మిమ్మల్నైనా అంతే! ఈ గ్రూపులు,భుజాలు తడుముకునేట్టు మాట్లాడ్డాలు, ఎత్తి పొడవడాలు వగైరా విషయాలకు స్వభావరీత్యా కూడా నేను వ్యతిరేకిని! నిజానికి ఇలా సంజాయిషీలివ్వడానికి కూడా!
కల్పన గారు,
నేను మిమ్మల్ని ప్రశ్నలు వేయలేదు, మీరు ఇంకో టపా రాసి నాకు సమాధానం ఇవ్వడానికి! మీ చేయి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
హాయ్ కల్పన.
ముందుగా నువ్వు త్వరగా కోలుకుని మరిన్ని రచనలు చెయాలని కోరుకుంటున్నాను. ఇక నీవు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా నా అభిప్రాయాలు.
1. మనిష్టమొచ్చినవి మనం రాసుకోవచ్చా? బూతులు, శ్రుంగారం లాంటివి ఏవైనా సరే.కూడలి లో స్థానం కల్పించరు కాబట్టి అలాంటివి రాయడం మానుకోవాలా? లేక అది మన వ్యక్తిగత సంస్కారం కూడా అయి వుండాలా?
ఇంగ్లీషు బ్లాగులలో ఇలా జరుగుతుందేమో కాని మన తెలుగు బ్లాగులలో అది మంచిది కాదు అనిపిస్తుంది.ఎందుకంటే ఇక్కడ మనమందరం ఈ బ్లాగు టపాల ద్వారా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాము. ఒక కుటుంబంలా ఆడా మగా అని అనుకోకుండా ఫ్రీగా ఉంటున్నాము. కాని, బూతులు , శృంగారం లాంటి బ్లాగులు కూడా ఉండాలి అంటే మిగతావారు తమ బ్లాగులను మూసుకోవాల్సి వస్తుంది. ఎవరైనా బురదలో ఉండాలనుకోరు కదా.
2. అసలు బ్లాగరిజం అంటే ఏమిటి? వాటికి నియమ నిబంధనలు వున్నాయా? భాష విషయంలోనైనా, భావం విషయంలోనైనా? వుంటే అవి ఏమిటి?
మన భావాలు, అభిప్రాయాలు అందర్ని వొప్పించేవిగా, మెప్పించేవిగా వుండనక్కరలేదని తెలుసు కాని అవి వాస్తవాలైనా అయి వుండాలా? అక్కర్లేదా?
బ్లాగులు అంటే మనకు ఇష్టమైన ఆలోచనలు, సంఘటనలు, అనుభూతులు, రచనలు మిగతావారితో పంచుకోవాలనుకుంటామో అవి రాసి పెట్టుకునే పత్రికలు అనుకోవచ్చు. ఎవరి బ్లాగు వారిష్టం. వారికి నచ్చింది రాసుకోవచ్చు. అవి వాస్తవాలా కాదా అని ఎవరూ పట్టించుకోరు, అడగరు.
ఉదాహరణకి ఒక మతం మీద రాస్తున్న రాతలు చూద్దాము. ఒక మతం గురించి ఒక బ్లాగరు రాస్తున్న రాతలు , విషయాలు అసత్యాలు, అసంబద్దమని మనకు తెలుసు కాబట్టి ఒకసారి ఆ బ్లాగుకి వెళ్ళి మనం ఏమనుకుంటున్నామో చెపుతాము. వినకపోతే, అర్దం చేసుకోకపోతే మర్యాదగ పక్కకు తప్పుకుంటాము. మనకిస్టం లేని బ్లాగులకు వెళ్ళకపోవడమే పరిష్కరమా? ఇంకా ఏమైనా పద్దతి వుందా? ఒక బ్లాగులో రాసినవి వాస్తవాలు కాకపోతె, మనకు నచ్చకపోతే కామెంట్స్ రాయాల? వద్దా? రాస్తే వాళ్ళు వేయకపోతే మనం ఏమైన చేయగలమా? అసలు ఏమైన చేయలా? మిన్నకుండాల? వాస్తవాలు మనకు తెలిస్తె చాలా? అందరికి చెప్పాలా? ఇలంటి పరిస్థితుల్లొ బ్లగెర్ కి వున్న హక్కులు ఏమిటి? వ్యాఖ్యాతలకున్న హక్కులు ఏమిటి?
ఇక్కడ తమ బ్లాగు కాక వేరే బ్లాగుల మీద ఎవ్వరికీ నియంత్రణ లేదు. మనకు ఇష్టమైన బ్లాగులు చదువుకోవచ్చు. కామెంట్స్ రాయొచ్చు. ఇష్టం లేకుంటే వెళ్ళకపోవడమే పరిష్కారం. అన్నీ మనకు నచ్చాలని లేదుగా. ఒకవేల అది వాస్తవం కాదు అని మనకు అనిపించినపుడు , సౌమ్యంగా ఆ విషయం ఆ బ్లాగరుకు చెప్పాలి. అది వినడం , వినకపోవడం అతని ఇష్టం. అంతకంటే ఎక్కువ చొరవ తీసుకోకూడదు. మర్యాదగా తప్పుకుని మన పని మనం చేసుకోవాలి. ఇక్కడ హక్కులు, గట్రా ఏమీ లేవు? ఎవరూ చెప్పలేదు అవి పాటించమని. ప్రతి బ్లాగరు అది తమ కర్తవ్యం గా అనుకుంటే తప్ప. మనం రాసిన కామెంట్స్ ప్రచురించడం , ప్రచురించకపోవడం ఆ బ్లాగరు ఇష్టం. దానిని మనం ఏమీ చేయలేమి. తెలుసుకుని ఊరుకోవాలి. ఇలా నాకు జరిగింది. అప్పటినుంది ఉచిత సలహాలు ఇవ్వడం మానుకున్నా.
ఇక సుజాత గారు నీ వ్యాఖ్య నచ్చక ప్రచురించలెదు. దానికి ఇంతగా ఫీల్ అవ్వాల్సిన పని లెదు. లైట్ తీసుకో. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నీ రచనలు కొనసాగించు . ఒకె..
ఇవన్నీ రెండేళ్ళుగా ఈ బ్లాగ్ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న నా స్వంత అభిప్రాయాలు. నువ్వు కూడా ఇలా ఉండు . అంతే . ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యం. మిగతావాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు. కాని ఎప్పుడైనా ఉద్రిక్త పరిస్థితి మొదలైనప్పుడు అందరు బ్లాగర్లు కామెంట్ల యుద్ధం చేయకుండా , మిన్నకుండడం చాలా మంచిది. దానివలన మన మనశ్శాంతిని కోల్పోవడం, మన సమయం వృధా కావడం తప్ప ఒరిగేదేమీ లేదు.?
శరత్ గారు
మీరు చెప్పిన రచనలు కూడలిలో ఉండడానికి నేను కూడా ఒప్పుకోను. పత్రికలలో , దినపత్రికలలో వస్తున్నాయంటే అవి కుటుంబ సభ్యులు, మిత్రులందరితో మధ్య కూర్చుని చదవరు కదా ఎవ్వరైనా. కూడలి అలాగే. మీరు రాయొద్దు అనడంలేదే. రాసుకోండి, ఆ లింకు మీ బ్లాగులో పెట్టుకోండి. కాని ఈ బ్లాగులు వద్దన్నవారిని చాందసవాదులు అనడం సమంజసం కాదేమో..
హలో అనామకులుగారు,
అస్సలు మీకు ఈ విమర్శ చేయడానికి పేరు చెప్పే ధైర్యం కూడా లేదు. ఎందుకు అసలు సంగతి తెలియకుండా సీనియర్లు అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీ బ్లాగు ఉందా. మిమ్మల్ని ఎవ్వరూ పొగడలేదా. అందుకేనా ఈ కుళ్ళు. ఇక్కడ మీరు అనుకున్నట్టు ఏ గుంపులు లేవు. కొత్తవాళ్ళైనా, పాతవాళ్ళైనా వారి రచనను బట్టి పొగిడేది, తైగిడేది. బహుశా ఆ విషయం మీకు అర్ధం కాలేదేమొ. సుజాత గారు వచ్చి నాలుగు నెలలు ఐంది. ఆవిడ పేరు తప్ప మాకు తెలిసింది లేదు. ఆవిడ బ్లాగు రచనల ద్వారానే పరిచయం అంత మాత్రాన్నే అవిడని కొండెక్కించామా . అలా అంటే ఇంకా ఎందరో కొత్తవాళ్ళ బ్లాగుల్లొ కూడా ఇలాగే పొగుడుతున్నారు. అనవసరంగా లేని పోని ఆలోచనలు పెట్టుకోకండి. హాయిగా బ్లాగులు చదవండి. నచ్చితే కామెంటండి. లేకుంటే జై హింద్..
♦మూడో భాగం టపా ఎందుకు తీసెసారు? నా కామెంటు ఎందుకు వేయలెదు అని అడిగే హక్కు నాకు వుంటుందా? వుండదా?
జ. వుండదు
♦ బ్లాగుల్లొ పొలిటికల్లి కరెక్ట్ భాష వాడక్కరలెదు అన్నది కొందరి బ్లాగర్ల అభిప్రాయమా? లేక తెలుగు బ్లాగుల లక్షణమా?
జ . ఎవరికి నచ్చినట్టు వాల్లు వ్రాసుకో వచ్చు .
నా ప్రశ్న ♥ పొలిటికల్లి కరెక్ట్ భాష అంటే ఏమిటో సో్దాహరణంగా వివరింపుము…
♥ హక్కుల గురించి
మీకు హక్కులు ఏమైనా ఉంటే అవి మీ బ్లాగ్ వరకూ మాత్రమే పరిమితం . ఇతర బ్లాగులపై మీకేమీ హక్కులుండవు
ఈ చెత్తంతా మీ బ్లాగ్ లో ఎందుకు పోగేస్తున్నారు కల్పన గారు. मेने మన పెద్దవాళ్ళెప్పుడో చెప్పారు….వాదానికి కూడా సమ ఉజ్జీలు ఉండాలని. అసలు ప్రశ్న అంటేను….అర్ధవంతమైన చర్చ పై గౌరవం లేని చోట, పెద్ద నేర్చుకునేది ఎమీ ఉండదు.
వాస్తవానికి నేనూ ఒక మిస్టేక్ చేశాననుకోండి, నా మిత్రులు అలాగే సాటి వారిపై సుజాతగారి “వ్యంగ్య రచనకు” రెస్పాండవటం తప్పేననుకుంటున్నాను. మనసులోంచి వొచ్చే మాటలకి వాల్యూ ఉంటుందని పొరపడ్డాను…..టైమ్ పాస్ కోసం, అవతలి వారు హర్టవుతారేమోననే కాన్షస్ లేకుండా నడిపే “చేతి వాటం” రాతలు మాత్రమేనని కొంతమంది అభిప్రాయాలు వింటున్నప్పుడు అర్ధం అయ్యింది…. ఈ జ్నానం నాకు కలిగించిన వారందరికీ వందనాలు. అన్నట్టు నేను కూడా రెండు వాక్యాలతో, “ అనువాదం రాని వారు జర్నలిస్టులు కాకూడదా? మహిళా పేజీ మీ దృష్టిలో ఎలా ఉండాలో వివరించమని” సుజాత గారి బ్లగ్లో కామెంట్ పెట్టాను…….కానీ అది వెలుగు చూడలేదు….ఈ లోపల నా కళ్ళు తెరుచుకున్నాయి…
Anyway, I am feeling glad that I am not a regular reader of most of the Telugu blogs, except a few of good “standard”.
“ఆ హిమబిందు”
“కూడలి లొ వున్న సమస్య ఏమిటంటే చాదస్తుల అభిప్రాయాలకు విలువ నివ్వడం.”
ఇది ఖండించదగ్గ అభిప్రాయం. శృంగారానికి బాహాటత్వం పనికిరాదని నమ్మేవారందరూ చాదస్తులు కారు. కొందఱికి కూడలి మీద పై అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఉందని గమనించండి. కూడలి నిర్వాహకులు తిరుగుబాటు ధోరణులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని ఇక దేనికీ ఇవ్వరని ఒక బ్లాగరి నాతో ఒకసారి అనడం జరిగింది. ఏది నిజం ? ఎవరి దృక్పథం నుంచి వారు కూడలిని చూస్తున్నారనుకోవాలి. అంతే !
ఇప్పటిదాకా తెలుగు బ్లాగావరణం 90 శాతం ఆరోగ్యంగానే ఉంది. బహుకొద్ది సంఖ్యలో తలనొప్పి తత్త్వాలున్నప్పటికీ !
Madam ! Don’t feel hurt. Be optimistic. This is only a passing incident. We were all through such episodes.
Long live ‘Freedom of Expression’
Why do I get the feeling that our blog-world would have been better off ’small’ ?
Is it only me?? Why am I seeing only politics these days??
Whats this fuss about seniors and juniors ??
If your post is worthy, you’ll get hits and comments, Otherwise it’ll be flushed away… Its as simple as that….
Just Live and let live guys…
@జ్యోతి గారు,
బూతులు, శ్రుంగారం లాగే అవాస్తవాలైన రాతలు కూడా వ్యక్తిగత సంస్కారమే అనుకుంటాను. అలాంటి రాతల్ని ప్రస్తావించాలా, లేదా వాళ్ళ అజ్ఞానం అని వూరుకోవాల అని సందేహం వచ్చి అడిగాను. ఎవరో ఒక బ్లాగరు సుజాత గారి పోస్టులకు స్పందిస్తూ ‘ఇవి జర్నలిజం పై అపోహలు కలిగిస్తాయనీ చెప్పారు. అది మాత్రం నిజం. సుజాతా గారు నా కామెంట్స్ వేసుకోకపోవదం వల్ల నేను తెగబాధపడిపోయి మంచం మీద పడుకోని ఏడుస్తు కూర్చోలేదండి.
నేను కూడా బ్లాగులోకానికి కొత్తే కాబట్టి ఇక్కడ ఇలాంటివి ‘ ఇలాగే ‘ జరుగుతుంటాయని తెలియదు. సో ఒక పోస్ట్ ద్వారా అందరి అభిప్రాయాలు అడిగాను. కళ్ళు తెరిపించినందుకు ధన్యవాదాలు.
@సుజాత గారు,
మీరు నన్ను ప్రశ్నలు వేయలేదు. నా కామెంట్ మీరు వేయనప్పుడు నా కామెంట్ లో నేనేమి రాశానో, ఎలా రాశానో పాఠకులకు తెలియకుండా మళ్ళీ మీ ‘ధోరణీలో నా పోస్ట్‌లో సమాధానం ఇవ్వడం ఎందుకు? ఆ కామెంట్ అక్కడే పెట్టి అక్కడే సమధానం ఇస్తే మర్యాదగా వుండేది. మీ పోస్ట్ లాగానే మీ సమధానం కూడా మళ్ళి అపోహలతోనే వుంది. నా ఆరోగ్యం పట్ల మీ శ్రద్దకు ధన్యవాదాలు. మీ అమ్మగారు కూడా తొందరగ కోలుకోవాలని కోరుకుంటున్నాను.
@బిందు గారు,
మీరు అన్నది నిజం. సలహాలు ఇవ్వడం, పాటించడం రెండూ నేను చెస్తను. మీరు, ఇంకా చాల మంది సూచించినట్టు ఈ కంపు నాకెందుకు (పైగ నా బ్లాగులో ),నేను ఇంతకన్న ముఖ్యమైన విషయాల పత్ల శ్రద్ద వహిస్తాను. నేను చెప్పల్సింది అయిపోయింది.
నేను వ్రాసింది మీ గురించి కాదండి.. ఆ శరత్ అనే ఆయన వ్యాఖ్యకు ప్రతివ్యాఖ్య చేశాను
[...] సమస్య పరిష్కారమైంది. దీనికి తోడు బ్లాగర్ల హక్కులేమిటి అంటూ కల్పనా రెంటాల రాసిన జాబులో కూడా [...]