కొత్త సరిహద్దుల్లో స్త్రీవాద కధ అన్న వ్యాసం పై కత్తి మహేష్ కుమార్ గారు ఒక రెండు వ్యాఖ్యలు నా బ్లాగ్‌లో రాసారు. మళ్ళి ఆ వ్యాఖ్యలను తన బ్లాగ్‌లో కూడా పెట్టుకున్నారు. ఇక్కడా, అక్కడా మహేష్ గారి వ్యాఖ్యలకు సమాధానాలు మరో టపాగా మారాయి. అదే ఇది.
స్త్రీవాదం అంటే ఏమిటొ నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే బ్లాగ్లోకంలో అలనాటి రంగనాయకమ్మ దగ్గరనుంచి నేటి కుప్పిలి పద్మ దాక ఫెమినిస్ట్ రచనలని అవపోసన పట్టిన అతిరధమహారధుల ముందు నేను ‘ కొత్త ‘ పిల్ల కాకిని.
మహేష్ కుమార్ గారు, మీరన్నది నిజమే. ”స్త్రీవాద భావజాలం యొక్క సైద్ధాంతిక స్వరూపం అస్తవ్యస్తంగా వుందీ’ అన్న మీ వ్యాఖ్య నాకు అర్ధమై కూడా వివరణ ఎందుకు అడిగానంటే స్త్రీవాదం అంటే మీకున్న అవగాహన తెలుసుకోవడం కోసమే. మీరిచ్చిన సమాధానమే మీ వ్యాఖ్యకు కూడా సమాధానం అనుకుంటున్నాను.
” స్త్రీవాద సాహిత్యం మీద నేను చేసిన సాధన చాలా పరిమితం.70,80వ దశకాలలో ఉన్న సాహిత్యంతో నాకెటువంటి పేచీ లేదు. వాటిల్లోకూడా కొన్ని reinforcing the dominant paradigm తరహాలోవున్నా,నాకెటువంటి అభ్యంతరం కలుగలేదు.నా పరిథి సిమితమైనదే అయినా, 90ల తర్వాత నేను చదివిన కథలు చాలావరకూ స్త్రీవాదం ముద్రను ఉపయోగించుకుని రాసిన “కన్నీటి కథలు” గానే అనిపించాయి.మీకిప్పుడు ఉదాహరణలు చూపాలంటే ఎప్పుడో చదివిన పత్రికలూ,పుస్తకాలూ వెతుక్కోవాలి. చాలా వరకూ సాధ్యమయ్యే విషయంకూడా కాదు.ఇక నా అభాండాలు “అందరు స్త్రీవాద రచయిత/త్రుల” మీద కాదు. కేవలం ముద్రను ఉపయోగించి తమ సాహిత్యానికి సలేబిలిత్య్ని తెచ్చుకుంటున్న “చాలా మంది” గురించి మాత్రమే. నేను చదివినంతవరకూ దాదాపు 80% కథలు ఈ కోవకిచెందడం నా దురదృష్టం. పైగా నాకు నచ్చిన కొందరు స్త్రీవాద రచయిత/త్రులు అస్సలు స్త్రీవాదానికీ మాకూ సంబంధం లేదంటున్నారు.దీన్నిబట్టి నా అభాండాల్లో కొన్ని కొంతైనా నిజలున్నాయేమోననే భ్రమకలిగింది.ఏదిఏమైనా సిద్ధాంతాలలో గందరగోళం,అవగాహనారాహిత్యం మధ్యన మీరు చదివిన కొన్ని మంచి రచనలు ఎక్కడున్నాయో (90లవి)చెబితే నేనూ చదివి నా అభిప్రాయాల్ని మార్చుకుంటాను.మన చర్చ నిజంగా తెలుగులో విమర్శకుల అవసరాన్ని ఎత్తిచూపుతోంది.ప్రస్తుతం చాలామంది మార్కెట్లో ఈ వాదం నడుస్తుంది కాబట్టి రాయటం మొదలయ్యిందిగనకనే credibility ఒక సమస్యగా మారింది. ఇక పాఠకులంటారా, వారిని తప్పుబడితే నేను అంగీకరించను. Readers have every right to interpret the text as they wish . కాకపోతే విమర్శకులుకూడా సాధారణ పాఠకుల్లాగా భావజాలం రంగుటద్దాలతో a work of art ని కొలవడం నేను అంగీకరించలేని విషయం.”
మీరు చదివినది స్వల్పమని మీరే చెప్పుకుంటున్నారు. 70,80 దశకాల్లో వచ్చిన సాహిత్యంతో పేచి లేదని మీరే వొప్పుకున్నారు. ‘90ల తర్వాత కధలు కొన్ని ‘కన్నీటి కధలు ‘ గా మీకు అనిపించాయి. అది కేవలం మీరు చదివిన కధల వల్ల, అవి మీకు అర్ధమైన తీరు వల్ల మీకు స్త్రీవాదం పట్ల కొన్ని అభిప్రాయాలు కలిగాయి. మీ objections లేదా మీ అభాండాలు స్త్రీవాదులందరి మీదా కాదు అన్నరు. ముద్రనుపయోగించి తమ సాహిత్యానికి saleability తెచ్చుకుంటున్న ఆ ” చాలామంది ” ఎవరో, ఆ రచనలు ఎమిటో మీరు స్పస్టం చేస్తే మనం వాటి గురించి సహేతుకమైన సద్విమర్శ చేసుకోవచ్చు. మీరు చదివిన 80% కధలు ఆ కోవలోవే కావటం మీ/మా దురదౄస్టం. అలాగే మీకు నచ్చిన ఆ స్త్రీవాద రచయత/త్రులు ( స్త్రీవాదం రాస్తూ దానితొ మాకు సంబంధం లేదన్న వారు) ఎవరో మాకు చెపితే మేము కూడా అలాంటి ద్వందవైఖరులున్న రచయతలేవరో తెలుసుకొని జాగ్రత్త పడతాము.మార్కెట్ లో ఈ వాదం నడుస్తోంది కబట్టి ఆ రకంగా ఒక ఫెమినిస్ట్ రైటర్ రాసిన ఒక కధ చూపించి మీ అభ్యంతరం చెప్పండి.అయినా అలాంటి చౌకబారు రచనల్ని పత్తించుకోవడం ఎందుకు మీలాంటి మేధావులు? వారికోసం మీలోని అసలు సిసలు స్త్రీవాద సానుభూతిని చంపుకోనక్కరలేదు కదా. లేదు అసలు మీకు మొత్తం స్త్రీవాదం పట్ల అభ్యంతరాలు వుంటే అదే వొప్పుకోండి. నేను పక్కా స్త్రీవాదినంటారు మళ్ళి గందరగోళం అంటారు.
తెలుగులో విమర్శకుల అవసరం ఎంతైనా వుంది అన్నది మాత్రం నేను కూడా నూటికి నూరు శాతం అంగీకరిస్తాను. ఇదె విషయం తాజా వ్యాసంలోను, ఇతర వ్యాసాల్లో కూడ నేను ప్రస్తావించాను. స్త్రీవాద సాహిత్యంలో మీరనుకుంటున్న గందరగోళం, అవగాహనారాహిత్యం లాంటివి చాలామందికి కలగటానికి ప్రధానమైన కారణం స్త్రీవాద సాహిత్యానికి తగినట్టుగా సాహిత్యవిమర్శ లేకపోవడమే. మీరు కాస్త నిదానంగా ఈ వ్యాసం చదివితే నెను ఆ వ్యాసం మొత్తం చెప్పిన ప్రధానమైన విషయం అదే అని అర్ధమవుతుంది.స్త్రీవాద సాహిత్యానికి వున్న పరిమితుల్ని నేను నా తాజా వ్యాసంలో ప్రస్తావించాను. స్త్రీవాద రచయత/త్రులు అత్మపరీశీలన చేసుకోవాల్శిన అవసరముందన్న సంగతి కూడా నేను నొక్కి వక్కాణించాను. స్త్రీల సాహిత్య కృషిని సాహిత్య చరిత్రలో సరిగ్గా గుర్తించలేదన్నది ఉదహరణలతో చెప్పడం ఈ వ్యాసం ప్రధాన వుద్దేశం. అలాగే విమర్సకులు, పాటకులు ఎలాంటి రంగుకళ్ళద్దలు ధరించి రచనల్ని చూసి తప్పు అభిప్రాయాలు యెర్పర్చుకుంటారొ చెప్పడం ఇంకో వుద్దేశం. నిర్మలరాణి గారు ఎక్కడా తాను స్త్రీవాదినని కాని, కాదు అని కాని చెప్పుకోలేదు.అత్యాచారం అన్న అంశాన్ని ఆవిడ తన కధలో చర్చించారు. దాని విమర్శకుడు స్త్రీవాద కధ అన్న లేబుల్‌తో చూసి చర్చించారు. దీనివల్ల జరిగిన నస్టం ఏమిటి అని ఆలోచిస్తే…మహేష్ గారు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం తెలిసిపోతుంది. కోడూరి శ్రీరామూర్తి గారి సమీక్ష, ఆ సమీక్ష ని ప్రచురించిన పుస్తకం చదివిన పాఠకుడు కూడా ఆ కధని అదే ద్రుక్కొణంతో చూసే ప్రమాదం వుంటుంది. కధని కధగా చూసె ప్రక్రియ ఇక్కడ జరగలేదన్నది స్పస్తం.
ఇక ఒకోసారి పాఠకులు తమకు తెలిసి గాని, తెలియకుండానో గాని రంగుకళ్ళాద్దలు పెట్టుకొని ఎలా చూస్తారో చూద్దాము.ఉదహరణకు శారద గారి ‘ ఆదది కోరుకునే వరం’ కధ తీసుకుందాము. శారద గారు ఎక్కడైనా తాను స్త్రీవాదినని గాని, కాను అని కాని చెప్పుకున్నర?ఆ కధని మీరు అంధ్రజ్యొతిలోనో, వార్తలోనొ చదివిన దానికి, భూమిక పత్రికలో చదివిన దానికి ఏమైనా తేడా వుంటుందా? మహేష్ గారు ఆ కధ భూమిక అనే ‘మహత్తర స్త్రీ వాద పత్రిక ‘ లో చదవటం వల్ల అది స్త్రీవాద కధ అనుకొని ఒక fixed frame లో నుంచి చూసారు. అంటే ఇక్కడ మహేష్ గారు తనకు తెలిశొ, తెలియకుండానో ఒక రంగుకళ్ళద్దలు పెట్టుకున్నరన్న మాట. వాటిల్లో నుంచి ఆ కధని విష్లెషించే ప్రయత్నం చేసారు. ‘ మానం కన్న ప్రాణం ముఖ్యమ, కాద ‘ అన్న point కన్న ఆ కధలో రైటర్ చాల ముఖ్యమైన విషయాలు చర్చించారు. ఈ చర్చ ముందు అవి చర్చకురాకుందా మరుగునపడిపోయాయి. దీనివల్ల రైటర్ కి కాని, ఆ రచన కి కాని ఎమైనా అన్యాయం కాని జరిగిందా అంటే కధని కధగా అర్దం చేసుకోలెకపోవదానికి దారితీసిన కారణాలు ఎమిటి అంటే ఒక lable. స్త్రీవాదం అనేది ఒక బ్రహ్మపదార్ధం కాదు.అర్దం కాకపోవడానికి. స్త్రీల పట్ల, స్త్రీ సమస్యల పట్ల concern తో మాట్లాడటమే స్త్రీవాదం నా దృస్టిలో. అసలు ఆ పదం అంటేనె అసహ్యం , ఏవగింపు అనే వాళ్ళకు ఎవరైనా ఏమి చెప్పగలరు చెప్పండి? ఇవాళ మేము feminisTulam కాము, మాకు feminism అంటే గిట్టదు అని చెప్పుకోవడం ఒక fashion statement అయిపోయింది. . స్త్రీల పట్ల , వారి జీవితాల పత్ల, వారి సమస్యల పట్ల సానుభూతి, సహానుభూతి వున్నవారికి అదొక అనివార్యత.
స్త్రీవాదం పట్టణలకే పరిమితం కాలేదండి. కళ్ళుపెట్టి చూస్తే పూరిగుడిసెల్లో నాకు అసలు సిసలు స్త్రీవాదం కనపడుతుందండి ఒక్కోసారి. పేదమహిళలు మొగుడు తాగి వచ్చి చావబాదితే నలుగురిలో పెట్టి నిలదీస్తారు. ఆ ధైర్యం ఈ పట్టణ మధ్యతరగతి ఆడవాళ్ళకు రాలేదండి. ముక్కలు, ముక్కలుగ నరకబడుతున్న ఆడవాళ్ళు, అయిదేళ్ళ పసిమొగ్గల నుండి అరవైఏళ్ళ వ్రుద్ద మహిళల వరకూ ఇంటా, బయటా అత్యాచారానికి గురవుతున్న ఆడవాళ్ళు, ప్రవాసంలో కూడా తప్పని కట్నపు బాధలు ఇవన్ని పేపర్లల్లో crime news గా చదివి పక్కనపెట్టేసి నా కడుపులో చల్ల కదలకుండా సరదగా ఎవో నాలుగు రాతలు రాసుకునే గుండె ధైర్యం నాకు లేదండి. వీటన్నింటికి స్త్రీవాదం పరిష్కారం కాదు అని తెలిసినా కూద ఏదో ఒక ఆశ. ఇవాళ కొందరు మగవాళ్ళు అయినా ఇంటి పనుల్లో, వంటపనుల్లో స్త్రీలకు సహయపడుతున్నారు, స్త్రీలను జీవనయాత్రలొ సమవుజ్జీలుగా చూడగలుగుతున్నారంటే అందుకు ఏంతో కొంత స్త్రీవాద ప్రభవం వుందని నేను నమ్ముతాను. అందుకే అందులోని లోపాల్ని నేను ఎత్తిచూపిస్తాను. పెడధోరణులు అనుకున్న దాన్ని ఖండిస్తాను అవసరమైతె. నాకు సంబందించినంతవరకు అది కేవలం పిడివాదం కాదు.
‘…ప్రవాసంలో కూడా తప్పని కట్న బాధలు మొదలైన వాటిని క్రైం న్యూస్ గా చదివి పక్కన పెట్టేసి, సరదాగా నాలుగు రాతలు రాసుకునే ధైర్యం నాకు లేదండి..” అభినందనలు! రాతలదేముంది, కడుపులో చల్ల కదలకుండా రాయడమేగా(మీరన్నమాటే) ఎవరైనా రాస్తారు! చేతల సంగతి చెప్పండి. ఇన్ని రాతలు రాసేవారు చేతల్లోకి ఎందుకు దిగరూ? కేవలం రాతల వల్ల స్త్రీలు చైతన్యవంతులైతే అన్ని సమస్యలూ పరిష్కారమైనట్టే! స్త్రీల సమస్యలను నలుగురిలోకీ తీసుకురావడంతోనే మీ బాధ్యత తీరిపోతుందా? ప్రాక్టికల్ గా స్త్రీలకు ఏమీ చేయలేని వారు, కనీసం ఒక్క స్త్రీకైనా సహాయపడలేని వారు స్త్రీ వాదం గురించి మాట్లాడి ప్రయోజనం ఏముంది? అందరు చేసే పనే మీరూ చేస్తున్నారు! మిమ్మల్ని భిన్నంగా నిలబెట్టగల కోణం గురించి చెప్పండి.మగాళ్ళు ఇలా ప్రశ్నిస్తే మమ్మల్ని పందులతో పోలుస్తారు.
కల్పనగారు, నాకు “మొత్తం స్త్రీవాదం” పట్ల అభ్యంతరాలు లేవు. అందులో విస్తరిస్తున్న పెడధోరణులతోనే విభేధం అంతా. మీరు నన్ను పరీక్షించాలనుకున్నారు కాబట్టే నేను ఇంత విస్తృతంగా వ్యాఖ్యానించాల్సివచ్చింది. అదీ నా సొంత అభిప్రాయాలు మాత్రమే. దీని ఆధారంగా నేనోక సామాజిక నిర్ణయం చేయదలచలేదు కూడా. కాకుంటే, నేను నమ్మేది ‘మానవత్వాధారిత స్త్రీవాదం’, ప్రస్తుతం వేళ్ళూనుకొంటున్నది ‘వివక్షాధారిత స్త్రీవాదం’. సమస్య అక్కడే వస్తోంది.
ఇక స్త్రీవాదం రాస్తూ, ఆకోవకు చెందమనుకునే రచయిత/త్రులలో ద్వంద్వవైఖరికన్నా, వారిలో నాకు మరింత విశాలత్వం కనబడింది . Human rights based approach to feminism వాళ్ళ పంధా. తమ కథల్లో వారు మానవసమస్యని ముందుకు తీసుకొస్తారు. అందులోవున్న ప్రముఖపాత్రధారిణి మహిళైవుండచ్చు అంతే. ఆ వచ్చిన సమస్య, పాత్ర కేవలం మహిళకావడం వచ్చిందనో, లేక పురషాహంకారం మితిమీరిన కారణంగా వచ్చిందనో `మధ్యలో కల్పించుకుని’ మరీ చెప్పరు. They let the story state the problem. ఆ detachment, purposefulness వీరి రచనల్లో వుంటాయి.
ఒక సమస్య పుట్టగానే (లేక లేని సమస్యని సృష్టించి మరీ) వాదాల రంగులు పులిమీ, భావజాలానికి పదునుపెట్టి విరుచుకుపడిపోవడం ఉండవు. చాలావరకూ(నేను చదివిన) స్త్రీవాదం లేబిల్ తగిలించుకున్న కథలు అలాచెయ్యడం,నా అభిప్రాయాన్ని స్థిరం చేసింది. అంతమాత్రానా నేను స్త్రీవాద సాహిత్యానికున్న విలువని త్యజించడం లేదు. అలా చేసేవాణ్ణయితే, “వీళ్ళ ఖర్మ” అనుకుని అసలు చర్చ మొదలుపెట్టేవాడినే కాదు. నేను ఆశించేది, నా అభిప్రాయం సరైనదే అయితే, మార్పు అత్యంత ఆవశ్యకం అని గ్రహించడం మాత్రమే. నా అభిపాయాలు తప్పయితే “వీడి ఖర్మ” అనుకుని చర్చ ముగించడమే!
‘ఆడది కోరుకునే వరం’ కథ గురించి నేను రాసిన వ్యాసాన్ని ప్రస్తావించారు. దానికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఎప్పుడైనా ఒక “ముద్రపడిన” కథ చదివేటప్పుడు పాఠకుడు (నేను విమర్శకుడ్ని కాను) ఆ ముద్రయొక్క రూపాల్ని కథలో వెతుకుతాడు. అవి కనపడకపోతేనో లేక వక్రీకరించబడితేనో ఒక రకమైన నిరాశ కలుగుతుంది. అక్కడ జరిగింది అదే. దాన్ని మీరు రంగుటద్దం అంటే సరే. కానీ, ఆ రంగుటద్దం నా చేతికి “స్త్రీవాద పత్రిక” అనే reflected value ద్వారా అందించబడింది. బహుశా అందుకే కొందరు ఈ “బ్రాండ్” కు దూరంగా ఉండాలనుకుంటున్నారేమో!
ఉదాహరణకు ఇ.వి.వి.సత్యనారాయణ తీసిన ‘ఆమె’ సినిమా చూసి, చెత్త సినిమా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే రాష్ట్రప్రభుత్వం ఆ చిత్రానికి “ఉత్తమ సామాజిక చిత్రం”, అని నంది అవార్డు ప్రకటించారో అప్పుడు అదొక “పెడసరి స్త్రీవాద సినిమా” గా భావించాను. అంటే social context ని బట్టి నా కొలమానం,భాష రెండూ మారాయన్నమాట. మొదటిది, సినిమా మీద నా అభిప్రాయమైతే, రెండవది ఆ సినిమాలో చూపిన సామాజిక కోణం మీద నా judgment.
నేను స్త్రీవాదం పట్టణాలకే పరిమితమైందని చెప్పలేదు. అది కేవలం స్త్రీవాద సాహిత్యానికి వర్తిస్తుంది. అసలు సిసలు స్త్రీవాదం నిజానికి పల్లెల్లోనే వుంది. అక్కడ నిజమైన human struggle ఉంది, ఇక్కడ ఎక్కువగా cosmetic ideology మాత్రమే ఉంది. మీరు చెప్పిన సమస్యలకి స్త్రీవాదం లేక దాని సాహిత్యం సమాధానం చెప్పలేవు. వాటికి వ్యతిరేకంగా పోరాడటానికి కావలసిన దారి లేక సైద్ధాంతిక రూపం ఇవ్వడం వీటి ప్రధాన కర్తవ్యం. కానీ ,అసలు సమస్యల్నే అర్థం చేసుకోకుండా కేవలం భావజాలపోరాటాలు జరపడమే నేను లేవనెత్తిన సమస్య. సమస్యలు సామాజిక మూస యొక్క మూలాల్లోవుంటే వాటిని విస్మరించి male bashing ని ఏకైక అజెండాగా ఎంచుకోవడాన్ని మాత్రమే నేను విభేధించింది. అక్కడే ఈ గందరగోళమంతా మొదలయ్యిందని నా ఫీలింగ్.
చివరిగా, మీరు చెప్పిన వాటితో నాకు విభేధం లేకపోయినా, మన ధృక్పధాల్లో కొంత తేడా వుందనేని సుస్పష్టం. మీరు retrospective గా చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు. నేను future prospectus ని దృష్టిలో పెట్టుకుని నిరసిస్తున్నాను.
ఓరి నాయనో. ఏంటిదీ. చింతబరికెలతో కొట్టినట్టు ఈ చర్చలేమిటి ? టైం పాసయితలేదా
“కధని కధగా అర్దం చేసుకోలెకపోవదానికి దారితీసిన కారణాలు ఎమిటి అంటే ఒక lable.”
భలే చెప్పారు. ఇదే పాయింటు ఇంతకుముందే మాలతి గారి కథల నేపథ్యంలో మహేష్ గారే లేవనెత్తిన కథ ముందా, దాని వెనకున్న కథ ముందా అనే సందిగ్ధానికీ మంచి ఉదాహరణ అయింది.
కథ (text as it exists, without applying any imagined intentions to the writer) ఏంచెబుతోందో ముందు పూర్తిగా చూసుకోకుండానే దానికి ఏవో తిలకాలు దిద్దేసి హారతులిచ్చేస్తే ఇలాగే ఉంటుంది.
సమస్యల్ని గురించి వ్యాసాలు రాసుకోక వాటిల్ని కథలుగా రాయడం ఎందుకూ అనేది వేరే విషయం అనుకోండి.
మహేష్ గారు,
అసలు ఆమె సినిమా ఒక 100 శాతం చెత్త లేక చెత్తన్నర సినిమా! పక్కా సి క్లాసు సినిమా! ఆ సినిమాకు ఉత్తమ సామాజిక చిత్రంగా ప్రభుత్వం అవార్డ్ ఇవ్వడం వెనక రాజకీయాలో మరోటో ఉండొచ్చు! దాన్ని బట్టి అది ‘పెడసరి స్త్రీవాద చిత్రం” అని ముద్ర వేస్తే ఎలా? అసలు ఆ సినిమాలో ఏ ఇజమూ లేదు, అభ్యుదయం అంతకంటే లేదు. ఆ సినిమాకీ స్త్రీవాదానికీ సంబంధం లేదు.అదొక ఫక్తు చెత్త సినిమా! అంతే! మీరు ఇంతకు ముందొకసారి కూడా ఈ సినిమా గురించి ఎక్కడో ప్రస్తావించినట్టు గుర్తు! దర్శకుడు స్త్రీలకు, ఏదో సందేశం ఇచ్చానని అనుకుంటే ఆయన అజ్ఞానం స్థాయి అది. ఆ సినిమాలో చూపిన సామాజిక కోణం నిజజీవితంలో కనీసం ఒక్క సారైనా చూశారా మీరు ? జీవితాన్ని ప్రతిబింబించలేని సినిమాకు ఉత్తం చిత్రం అవార్డు రావడం మన దౌర్భాగ్యం!
అవునండి మహేష్ కుమార్,
మీరు ఆమె సినిమాని(పెడసరి) స్త్రీవాద సినిమా గా పేర్కొనడం నాకు విచారంగానే ఉంది! అదొక చెత్త డబ్బా!అందులోని స్త్రీ పాత్రలు చూస్తే స్త్రీలందరి మీదా అసహ్యం కలుగుతుంది.
బాలుగారు & సుజాత గారు: నేను ‘ఆమె’ సినిమాని ధృక్కోణంలో మార్పు జరిగితేవాడే కొలమానం, పదజాలంలో వచ్చే తేదాలకు ఒక ఉదాహరణగా మాత్రమే వుపయోగించాను.
కాకపోతే ఆ సినిమాకి అవార్డు ఇచ్చేప్పుడు ఈ వాదం గురించే చెప్పారు. ఎంతైన state అంగీకరించిన తరువాత మనం ఇప్పుకోవాలిగా! మన ఖర్మంతే.
Kalpana gaaru,
mee blog chaalaa aasaktikaramgaa undi. yekkadaa telugu patrikallo kanipinchakundaaney,meeru saaitya krishi chestunnaaru. mee aalochanalu telusukovadam aanandamgaa undi. dayachesi, ee blogni konasaaginchandi.
meeku naa abhinandanalu.
– anjaan K.
kalpanagaru,
mee rachanalaki abhinandanalu.
paina konni vyakhyalu raasina baalu gari id telupagalara?
abhinandanalatho,
pramila.
>>>
స్త్రీవాదం పట్టణలకే పరిమితం కాలేదండి. కళ్ళుపెట్టి చూస్తే పూరిగుడిసెల్లో నాకు అసలు సిసలు స్త్రీవాదం కనపడుతుందండి ఒక్కోసారి. పేదమహిళలు మొగుడు తాగి వచ్చి చావబాదితే నలుగురిలో పెట్టి నిలదీస్తారు. ఆ ధైర్యం ఈ పట్టణ మధ్యతరగతి ఆడవాళ్ళకు రాలేదండి.
>>>
మధ్యతరగతి వాళ్ళు వ్యక్తిగత పరువు ప్రతిష్టలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ తరగతి స్త్రీలు కూడా అంతే, పరువు ప్రతిష్టల భావంలో ఇరుక్కుపోతారు తప్ప తమ హక్కులు తెలుసుకోరు. ఇంటి గుట్టు వీధిలోకి తెస్తే ఇంటి పరువు పోతుందని భయపడతారు. వేధింపుల భర్తలని వీధిలోకే కాదు, పోలీస్ స్టేషన్ దాకా లాగే ధైర్యం ప్రతి మహిళకి ఉండాలి.
ఈ లింక్ కూడా వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=134