జూన్ , 2009 నెల టపాలు
మాయావి
Posted in కవిత్వం on జూన్ 27, 2009 | 2 వ్యాఖ్యానాలు »
సత్యనారాయణపురం రైల్వే గేటు
Posted in కవిత్వం on జూన్ 18, 2009 | 16 వ్యాఖ్యానాలు »
ఎప్పటిదో ఒక రైలు ప్రయాణపు జ్ఞాపకం
చెట్లు, చేమలు, వూళ్ళు,నీళ్ళు వెనక్కు వెళ్ళిపోతూ
ఎప్పుడు అంతే
జ్ఞాపకం ఒక దాటలేని వంతెన!
ముందూ వెనకల పరిభ్రమణాల మధ్య
చిక్కుకున్న కాల నది
ప్రతి స్మతి ఒక మజీలీనే!
ఈ రైలు ఇప్పుడే ఇక్కడే
ఏదో ఒక మజిలీలోనే ఆగిపోవాలి
వెనక్కు పరుగెత్తుకుంటూ
మాటలు రాని పసితనం
ఓనమాలు దిద్దని చిటికినవ్రేళ్ళలా
అమ్మ వొడిలోకి పరుగెత్తాలి
నాన్నతో కలిసి క్రిష్ణ వొడ్డున నడవాలి
అన్నయ్యలతో తగాదాలాడాలి
అక్కయ్యతో రహస్యాలు చెప్పుకోవాలి
చెల్లెలిపై అజమాయిషి చేయాలి
నా ముద్దుల తమ్ముడిని చిటికిన వేలు పట్టుకుని
స్కూల్ దగ్గర దించాలి
పిచ్చి కలలే కాని
ఇంకా పచ్చి పచ్చిగా
కాలీ కాలని [...]