అయిదో గోడ
నా కధ అయిదో గోడ వంగూరి ఫౌండేషన్ పోటీల్లో ప్రధమ బహుమతి పొందిది. కౌముదిలొ ప్రచురితమైన ఆ కధ తాలుకూ లింక్ ఇది.
http://www.koumudi.net/Monthly/2009/june/june_2009_kadhakoumudi_3.pdf
http://www.koumudi.net/Monthly/2009/june/june_2009_kadhakoumudi_3.pdf
చాలా రోజులు తరువాత మళ్ళీ కనిపించారు.
కథ ఫరవాలేదు. ఈ కథ మొదటి బహుమతి పొందిందంటే పోటీలో ఉన్న మిగతా కథలు ఎంత నాసిరకమయినవో అర్థమవుతున్నది!!
babu jeedipappu anta katuvuga cheppala.improve chesuko ani chebite sripotundemo kada…….
congratulations.
చాలా బాగుంది కల్పన మీ కథ. ఆ కథ రాయటానికి… బాగుంది అనటానికి కూడా ధైర్యం కావాలేమో… నేను చాలా సేపు ఆలోచించాను మీరు చెప్పిన కోణం నుంచి… మన సమాజం లో చాలా ధైర్యం కావాలి మీరు చెప్పిన ఐదో గోడ దాటాలి అంటే… హిపోక్రసి లేకుండా ఆ గోడ వుంది అని ఒప్పుకునే రోజు ఐనా తొందరలో రావాలని ఆ దిశ గా అందరం ఆలోచిస్తామని ఆశిస్తున్నా.
పాత్రతో “అంతర్మధనం” జోడించి కథకు మరింత లోతును తీసుకొచ్చారు. ఒక స్టీరియో టైప్ ను వ్యతిరేకిస్తూ మరో స్టీరియో టైప్ ని సృష్టించే పోకడలమీద సునిశితమైన వ్యంగ్యం ఈ కథ. ఒక హద్దు చెరుపుతున్నాననే అహం కోసం, తెలియకుండా అదే హద్దుని తన పాత్రపై మోపిన రచయిత్రి గిల్టీ ప్రయాణం ఈ కథ. మంచి కథ.
కథలోని మోరల్ డైలమా గురించి, మనలో జీర్ణించుకుపోయిన విలువల హిపోక్రసీ గురించీ ఎంత చర్చించుకున్నా తక్కువే. కావాల్సిన/ రావలసిన “మార్పు” కూడా అదే హిపోక్రిటికల్ కోణం నుంచే ఇజాల రూపంలో ఆపాదించబడటం మరో షాకింగ్ నిజం. ఆ నిజానికి అద్ధం పట్టే ప్రయత్నం బాగా చేశారు. కానీ రచయిత్రికి కథ రాసిన తరువాత కలిగిన వెలితి మీ పూర్తి కథ చదివిన తరువాత నాకు కలిగింది. “ఇంకా ఏదో ఉండాలి” అనిపించింది.
కథ చదువుతుంటే ఎందుకో వోల్గా ‘మానవి’ గుర్తొచ్చింది.
http://parnashaala.blogspot.com/2008/11/blog-post_10.html
babu jeedipappu gaaru mee blog lo post lanu office lo choodanu room lo chaduvutha ..mee comments kudaa intlone chaduvutha ikanundi keka chepparu
మనందరిలో అయిదో గోడ వున్నమాట నిజం. కథని శారద కూతురిని నమ్మించడంతో సరిపెట్టేయక, ఆపాత్రచేతే ఆ *ముగింపు*లో అసహజతని ఎత్తిచూపడం మంచి మలుపు.
ప్రథమబహుమతి పోందినందుకు అభినందనలు. ఇంకా ఇంకా మంచి కథలు వస్తాయని ఆశిస్తూ ..
మాలతి
ప్చ్. అసహజత కాదేమో … కథ కోసం కథ ముగింపు అన్న వాదం అనొచ్చునేమో … మహేష్ చెప్పినట్టు మోరల్ డైలమాకి సంబంధించిన వాస్తవం అనుకుంటాను.
అభినందనలు
వినాయక చక్రవర్తి గారూ, కొత్తగా కథ వ్రాసినవారికయితే సున్నితంగా చెప్పాలి కానీ పేరున్న రచయితలకు పొగడ్తలకంటే కటువయిన విమర్శలే ఇష్టమని మరచిపోయారా? ఇంకోసారి కథ చదివి మీరే ఆలోచించండి, ఈ కథ “మొదటి బహుమతి” పొందే స్థాయిలో ఉన్నదా అని.
@జీడిపప్పు గారూ, మామూలుగా నేనిలాటి చర్చల్లోకి దిగను కానీ మీరు నాబ్లాగులో కూడా వ్యాఖ్యలు పెడుతుంటారు కనక నాఅభిప్రాయం చెప్పాలనిపిస్తోంది.
రచయితలు కొత్తవారా, పాతవారా అని కాక, కథలో ఏ అంశాలు బాగులేవో, ఎందుకు బాగులేవో చెప్తే, చిన్నా, పెద్దా అని కాక, ఏ రచయిత అయినా తిరిగి చూసుకోడానికి ఆస్కారం వుంటుంది.
మీరు *కథ ఫరవాలేదు* అంటే సరే మిమ్మల్ని ఈకథ ఆకట్టుకోలేదు అన్నవిషయం అర్థమవుతోంది. *మిగతా కథలు ఎంత నాసిరకమయినవో అర్థమవుతున్నది!!*లాటి వ్యాఖ్య ఇక్కడ అసందర్భమే.
మాలతి గారూ, అన్యదా భావించకండి. కథ గురించి మాత్రమే అయితే మామూలుగానే చెప్పేవాడిని కానీ “పరవాలేని కథకు” “మొదటి బహుమతి” వచ్చిందంటే అలా అనక తప్పలేదు!
జీడిపప్పు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన విషయాన్ని వివరంగా చెప్పాలంటే ..
ఈ కధలో పెద్ద లొసుగు – తల్లి గురించి కూతురికి ఏమీ తెలియకపోవటం! తన కుటుంబం, నలుగురు అక్కా చెల్లెళ్లు, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా జరిగిపోయిన పెళ్లి, రూమ్మేట్లా భర్తతో సహవాసం .. etc, etc, శారద చెబితేకానీ ఆర్తికి తెలీకపోవటం వింత. కాఫీ తాగుతూ అరగంటలో తన మనసు కూతురికి అర్ధమయేలా విప్పి చెప్పగలిగిన చాతుర్యమున్న తల్లి, అంతకు ముందు పాతికేళ్లలో ఆ పని చెయ్యలేకపోవటం నమ్మశక్యంగా లేదు. ఆర్తికి చెప్పే వంకతో శారద గతం, వ్యక్తిత్వం, ఆలోచనల గురించి పాఠకులకి చెప్పటం రచయిత్రి ప్రయత్నం కావచ్చు, అయితే అది కృతకంగా ఉంది.
రెండోది – కధలో చెప్పదల్చుకున్న ప్రధాన విషయం మొదటి పేజీలోనే పాఠకులకి అర్ధమైపోతుంది. ఆ తర్వాతివన్నీ అదెందుకు తప్పు లేదా ఒప్పు అనేదాని గురించిన చర్చోపచర్చలు. మధ్యలో పుణ్యవతి లాంటి అనవసర ఉదాహరణలు, పోలికలు. చర్చలు ఎలా సాగినా, చివరికి జరగబోయేదేమిటో ముందే తెలిసిపోయినప్పుడు ఆసక్తెలా ఉంటుంది?
ఉపసంహారం(?) లో శ్రీవిద్య, శశి పాత్రల ద్వారా రచయిత్రి చెప్పదలచుకుందేమిటి? నాకైతే, విమర్శకుల ప్రశ్నలకి కధలోనే సమాధానమిచ్చే ప్రయత్నమది అనిపించింది.
మొత్తమ్మీద – కధా వస్తువు బాగుంది. కధనమే ఆకట్టుకోలేదు. మన సమాజం అంగీకరించని ఓ విషయాన్ని పాఠకులకి చెప్పి ఎలాగైనా ఒప్పించాలనే తాపత్రయమే ఎక్కువ కనపడింది కానీ, పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న విషయం పక్కన పెట్టి కధనమ్మీద దృష్టి కేంద్రీకరిస్తే మరింత బాగా వచ్చుండేది కధ. పాత్రలతో పాఠకులు మమేకమై, ఆ సందర్భంలో ఆ పాత్ర అలా చెయ్యటమే సహజం, న్యాయం అనుకుంటేనే ఏ కధైనా రక్తి కడుతుంది. ఇక్కడదే లోపించింది.
ఒక సరిహద్దునుండి ఇంకో సరిహద్దుకు పంపడం కాదు కథలోని లోపం. కథలో పాత్ర చేత నిజజీవితంలో మాట్లాడించినంత మాత్రాన ఆ పాత్ర సజీవమైపోదని తెలియకపోవడం కథలోని లోపం. కేవలం తన ఆలోచనలని మాత్రమే ఉన్నవున్నట్టు పాత్రల రూపంలో బయట పెడితే అది మంచి కథ కాదని రచయిత్రి చివరికీ తెలుసుకోలేకపోడం విచారకరం.
కథ చివర్న పాత్ర రచయిత్రిని నిలదియ్యడమనే ఒకే ఒక్క పాయింటు మీద యీ కథకి బహుమతి ఇచ్చారని అనిపిస్తోంది. పొటీకి వచ్చిన కథలు, కథనంలో ఇంతకన్నా కొత్తదనం గొప్పదనం చూపించకపోవడం దురదృష్టకరం.
@అబ్రకదబ్ర: మంచి విశ్లేషణ.
మీ విశ్లేషణ జీడిపప్పుగారి ఎత్తిపొడుపు నుంచీ ఆరంభమవడం కొంత ఆశ్చర్యంగా ఉంది. కథావస్తువు,కథనం,లోటుపాట్ల గురించి చెప్పకపోయినా, ఒక వ్యక్తిగత అభిప్రాయంలాగా “కథ ఫరవాలేదు”తో జీడిపప్పుగారు తన వ్యాఖ్య ముగించి ఉంటే దానికి సాధికారత వచ్చుండేది. కానీ మిగతా కథల నాణ్యతపై ప్రశ్న చిహ్నాలు రేపి, పేరున్న రచయిత కాబట్టి “కటువైన విమర్శలూ” చెయ్యాలని సమాధానమిచ్చి తన స్పందనను కృతకం చేసుకున్నారు.
కథ గురించి కాక అది పొందిన మొదటి బహుమతి మీద చర్చ ఉండటం అర్థం చేసుకోదగ్గ పరిణామమే అయినా, నిరాశాజనకంగానే ఉంది.
@కామేశ్వర రావు: ఐడియాలజీ వ్యాసాలు ఉటంకించే పాత్ర సంభాషణలు కథాశైలి కాదు అనటం మనకై మనం పోసుకున్న కథా మూసకున్న సమస్యేకానీ, ఇలాంటి కథ ఉండకూడదంటే ఎలా?“అభిప్రాయ సాహిత్యం” కూడా విలువైనదే అని మనం గ్రహించనంత వరకూ అవి కథన లోపాలుగానే గుర్తింపబడతాయి తప్ప దాన్నొక “శైలి” గా గుర్తించలేము. తెలుగు కథను మళ్ళీ మనకోసం పునర్నిర్వచించుకోవలసిన సమయం వచ్చిందేమో అనిపిస్తోంది.
@మహేష్:
కధ చదివినప్పుడు నాకనిపించిన భావాలవి. జీడిపప్పుకీ అలాగే అనిపించిందేమో అన్న ఊహే నా వ్యాఖ్య అలా మొదలయేలా చేసింది
@అబ్రకదబ్ర: మంచి విశ్లేషణ కాని “ఈ కధలో పెద్ద లొసుగు – తల్లి గురించి కూతురికి ఏమీ తెలియకపోవటం! తన కుటుంబం, నలుగురు అక్కా చెల్లెళ్లు, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా జరిగిపోయిన పెళ్లి, రూమ్మేట్లా భర్తతో సహవాసం .. ఎత్చ్, ఎత్చ్, శారద చెబితేకానీ ఆర్తికి తెలీకపోవటం వింత”
నేను ఒప్పుకోను ఈ మాట తో.. ఎలా తెలుస్తుంది మనసులో మాట.. .. పిల్లలకు అంత విశ్లేషించే మనసు తీరిక వుంటాయా? వుంటాయేమో కాని అందరికి వుండనవసరం లేదు కదా.. అది వున్న అమ్మాయి గా చూపించ లేదు కదా ఆర్తి ని మొదటి లో.. ఆ అమ్మయి కి బయటి వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన తప్ప వేరేది లేనట్లు అర్ధం అవుతుంది కదా ఆమె ఆలోచనా సరళి చూస్తే. శారద ను మొదటే చెప్పే ధైర్యం వున్న వ్యక్తి గా చూపిస్తే అప్పుడు ఈ ప్రశ్న రావొచ్చు . “ఆమె కు ఆ జీవన విధానం పై అంత విరక్తి వచ్చి కలిసి బతకటం అనే వినూత్న (అక్కడి సమాజానికి ) ఆలోచన ఆ వయసులో వచ్చినప్పుడు భర్త బతికి వుండగానే విడాకులు ఇచ్చి తనకు నచ్చిన దారిలో వెళ్ళ వచ్చు కదా ఆయన చనిపోయే వరకు వేచి చూసిందా అంటే ఆయన చనిపోవాలని ఎదురు చూస్తూ వుందా???? అని”. ఆమెను రచయత్రి మొదటి నుంచి వున్న దానితో తనకు నచ్చినట్లు బతికే వ్యక్తి గా చిత్రించి ఆఖరి లో when she get a chance then she thought of utilizing it, that decision came from the long time struggle that she went through” అన్నట్లు చూపించారు కదా, అందరు పుట్టుక తోనే అబ్రకదబ్ర లు మహేష్ లు జీడిపప్పు గారే వుండరు కదండి సమాజం లో శారదలు కూడా వుంటారు మరి (ధైర్యం గా మనసు లో మాట వ్యక్త పరిచే sense లో అన్నా) పరిస్తితులు నేర్పిన అనుభవాలు వాళ్ళను అలా తయారు చేస్తాయి తరువాత. అదే చూపించారనిపించింది నాకు కల్పన గారు. ఒక సారి ఆ ధైర్యం వచ్చాక ఇంక ఎవరికి, ఎటువంటి పరిస్తితి కి లొంగనవసరం లేని ధైర్యం ఆమె లో చూపించారు. ముందంతా ఆ భయం అసహాయతే ఆమె ను పిల్లలకు కూడా పంచుకోనివ్వలేదేమో తన భావాలను … అరగంట లో ఆర్తి కి అర్ధం అయ్యేట్లు చెప్పగలగటం కొంచం కష్టమేమో కాని ఎమో తల్లి ని అమ్మాయి తొందర గానే అర్ధం చేసుకుని ఒప్పుకుంటుందేమో ఒక్క సారి పరిస్తితి అర్ధం అయ్యక. నాకు బాగా నచ్చిన విషయమే ఆఖరు లో శారద రచయత్రి ని ప్రశ్నించటం.. నిజమే కదా మనం ఎంత అభ్యుదయ వాదులమని చెప్పుకున్నా ఇంకా వాటికి కూడా కొన్ని విలువలను (సమాజాన్ని ఒప్పించాలనే విలువలు) ఇవ్వాలని ప్రయత్నిస్తాము. నాకైతే రచయత్రి కధనం నచ్చింది… ఈ రకమైన ఆలోచన కొత్తది కాబట్టి ఎలా రాసినా కధనం బలం గా లేదు అనిపిస్తుందేమో.. ఆలోచించండి..
@భావన: సమకాలీన సాహిత్యంతో వచ్చిన సమస్యనంతా ఒక్క వ్యాఖ్యలో చెప్పేసావ్.
రచయిత రాయాలనుకున్నది రాసేస్తే చదవాలనుకున్న పాఠకుడు అదే అర్థంతోనో లేక ఇంచుమించు intended interpretation తోనో చదివేస్తాడు. ఆ పాఠకులు పదిమందైనా, వందమందైనా, కోట్ల మందైనా జరిగేది ఇదే. కానీ ఎప్పుడైతే రచయిత ఉద్దేశం ‘తాను చెప్పలనుకున్నది’ కాక ‘పాఠకులకు తెలియజెప్పాలనుకున్నది’ అవుతుందో లేక సంపాదకులకు ‘ఏది నచ్చుతుంది’ అవుతుందో అప్పుడొస్తుంది తంటా. ప్రస్తుతం వస్తున్న కథా సాహిత్యం మొత్తం ఈ ప్రాధమిక సమస్య చుట్టూనే అల్లుకుంటున్నాయి.
ఇందులో ఆరితేరిన విమర్శకుల పాత్ర మరీ ఆసక్తికరం (హాస్యాస్పదం అందామనుకున్నాను). ఎలాంటి కథ ఉండాలో, దాని శైలి, శిల్పం, వస్తువు,కథనం ఎలా ఉండాలో నిర్ణయించేస్తారు. ఆ నిర్ణయాధికారం భూ(బూ)తజ్ఞానంతో తెచ్చుకుని, వర్తమానాన్ని నిర్దేశించి భవిష్యత్తు లేకుండా చెయ్యడంలో వీరు దిట్ట. ఒక మూసను మీరితే అది “కథ కాదు”, “మంచి కథ కాదు”, “గొప్ప కథ కాదు” అంటూ తీర్మానాలు చేసేస్తారు.
అందుకే మనలాంటి సాధారణ పాఠకులు సాహిత్యాన్ని సాధించే దిశగా అడుగులు వెయ్యాలి. అప్పుడు గానీ సంపాదకులు,విమర్శకులు శాసించే సాహిత్యం కాకుండా పాఠకులు ఆశించే సాహిత్యం వస్తుందేమో. ప్రజాస్వామ్యంలో భేధాభిప్రాయాలు తప్పవు. కానీ సాహితీ డిక్టేటర్షిప్ నుంచీ బయటపడటం మాత్రం అత్యంత అవసరం.
@మహేష్:
జీడిపప్పు ‘ఐదో గోడ’లో లోటుపాట్లని విమర్శించకుండా దానికొచ్చిన బహుమతి, ఇతర కధల నాణ్యత వగైరా గురించి మాట్లాడారని మీ విమర్శ. అతను చెయ్యని పని నేను చేసి చూపిస్తే తీరా ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి? (భావన చేసినట్లు) కల్పన గారి కధలో మీకు నచ్చినవుంటే చెప్పాలికానీ, విమర్శకుల గురించీ వాళ్ల విమర్శల గురించీ ప్రతివిమర్శలు చేస్తే విషయం పక్కదారి పట్టదా?
అన్నట్టు – నేనూ మీలాంటి సాధారణ పాఠకుడినే. ఇది నా మొదటి సాహితీ విమర్శ (నా వ్యాఖ్యకి ఆ స్థాయి ఉందో లేదో కూడా అనుమానమే). నిజానికి, నాది విమర్శకన్నా పరిశీలన అనొచ్చేమో. ఓ పాఠకుడిగా నేనాశించే సాహిత్యం కోసమే నా ఈ ప్రయత్నం అని ఎందుకనుకోకూడదు?
మహేష్ గారు,
ఈ కథలోని విషయమ్మీదే మీరు మీ అభిప్రాయాలు నేరుగా మీదైన శైలిలో ఒక టపాగా మీ బ్లాగులో పెట్టి “ఇది కథ కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తా” అని అంటే నేను మాట్లడగలిగేది ఏమీ ఉండదు
మీ టపా నచ్చనివాళ్ళ విమర్శ మీరు స్వీకరించడం స్వీకరించకపోవడం మీ సొంత విషయం.
ఇక్కడ కల్పనగారి కథ మీద మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. నా అభిప్రాయాన్ని నేను చెప్పాను. మీ అభిప్రాయాన్ని గురించి నేనొక్క ముక్కకూడా రాయలేదు. కొన్ని కారణాలవల్ల మీకా కథ నచ్చింది. కొన్ని కారణాలవల్ల నాకది నచ్చలేదు. మన అభిప్రాయాలని స్వీకరించడం స్వీకరించకపోవడం కల్పనగారి ఇష్టం. అయితే, నేను చేసిన విమర్శ గురించి (నేను చేసిన విమర్శలాంటి ఇతర విమర్శల గురించి) – “తీర్మానించడం”, “డిక్టేటర్షిప్” మొదలైన టాగులు తగిలించడం సమంజసం కాదు. పైగా ఏ ఆధారంతో ఈ విమర్శలు చేస్తామో మీరే ఊహించేసి అది సదరు విమర్శలు చేసేవాళ్ళ మీద రుద్దడమూ ఔచిత్యం అనిపించుకోదు. ఇది సంకుచితత్వమే అవుతుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పి ఊరుకోడమే సమంజసం మన మన అభిప్రాయాలగురించి మనం వాదులాడుకోడం ప్రయోజన రహితం.
ఒక కథ చదివాక అది నాకొక అనుభూతిని మిగల్చాలి, లేదా మనసులో ఒక సంఘర్షణని కలిగించాలి. పాత్రలలో రచయిత్రి నేరుగా కనిపిస్తూ, తన అభిప్రాయాలనీ భావాలనీ నాకు చెప్పుకుంటే అది నాకు మంచి కథ అనిపించదు. ఈ కథలో అది జరిగింది కాబట్టి నాకిది మంచి కథ అనిపించలేదు. ఒక పాఠకునిగా అది రచయిత్రికి నేను నా వ్యాఖ్యద్వారా చెప్పాను. అంతే. నేను చెప్పింది మీకు నచ్చకపోయినంత మాత్రాన నన్ను పాఠకుడిగా కాక “విమర్శకుడిగా” జమకట్టేసి, మిమ్మల్ని మీరు “సాధారణ పాఠకుల”లో కలిపేసుకొని అందరు “సాధారణ పాఠకులు” మీకున్నలాంటి అభిప్రాయాలే కలిగి ఉంటారని generalize చెసెయ్యడం మీ తెలివికి నిదర్శనం తప్పిస్తే అది నిజమూ కాదు, సమంజసమూ కాదు.
@అబ్రకదబ్ర: మిమ్మల్ని విమర్శకుల కోవలోకి వేసానని ఎందుకనిపించింది? మీరూ నాలాంటి సాధారణ పాఠకుడే అని నాకు తెలీదా! I am all for reader’s rights as critics. నా సమస్యంతా self professed critics తోనే. ఇక్కడ చర్చ నా “గోడు” ద్వారా పక్కదారి పట్టినందుకు క్షంతవ్యుడిని. కానీ కథకు సంబంధం లేకుండా ఇది అవసరమైన చర్చ అనుకుంటే నాకదొక concession.
@కామేశ్వర రావు గారు, టపా నచ్చని వాళ్ళ విమర్శ స్వీకరించడంలో నాకు అస్సలు సమస్య లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇక నేను మిమ్మల్ని సంబోధిస్తూ రాసింది మిమ్మల్ని ఉద్దేశించిన వ్యాఖ్య. భావనని సంబోధిస్తూ చెప్పింది నా కంఠశోష. ఈ మధ్యకాలంలో నాలో ఉద్భవించిన ఘోష. అంతేతప్ప మిమ్మల్ని “ఆరితేరిన విమర్శకుల” లిస్టులో చేర్చి ఒక బ్రాండ్ చేసి నిర్ణయించెయ్యడం నా ఉద్దేశం అసలుకాదు. బ్లాగుల్లో పాఠకులేతప్ప ఆరితేరిన విమర్శకులు (పెద్దగా) లేకపోవడం నిజంగా నాకొక పెద్ద రిలీఫ్.
సాహిత్యాన్ని democratize చెయ్యడంలో వెబ్ ప్రపంచం పాత్ర చాలా ఉందని నమ్ముతాను. ప్రజాస్వామ్యంలో ఉన్న బేధాభిప్రాయాలను సహృదయంతో ఆహ్వానించాలనే భావాలను బలంగా విశ్వసిస్తాను. అలాంటిది మీ అభిప్రాయాల్ని కించపరచగలనా!
మహేష్ గారు,
మీరు నన్ను వ్యక్తిగతంగా విమర్శించారని నేననలేదు. మీరన్న శైలిగురించి, కథనం గురించి నేను కూడా మాట్లాడేను. నాలా అలా మాట్లాడినవాళ్ళందరి గురించీ మీరన్న విషయాలు సమంజసం కాదని నేనన్నాను. నేను మీరన్న self professed critics కోవకి చెందకపోతే, వారెవరో మీరు వివరిస్తే బావుంటుంది. మరీ ముఖ్యంగా, వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరమేవిటో కూడా చెపితే బావుంటుంది. అలా చెయ్యకపోతే, మీరు ముందు ప్రస్తావించిన విషయాలు నాకు వర్తిస్తాయన్న ఉద్దేశంలోనే మీరు రాసేరని, నేను దాన్ని నిలదీసేసరికి మీరు మాటమార్చి నా గురించి కాదంటున్నారనీ ఒక అభిప్రాయం (అపోహ?) నాకు మిగిలిపోతుంది.
సాహిత్యాన్ని democratize చెయ్యాలన్న మీ ఆలోచనని నేను గౌరవిస్తాను (అంగీకరిస్తానని చెప్పలేను). అయితే మీకు నచ్చని విమర్శ చేసేవాళ్ళందరినీ dictatorsగా భావించడాన్ని నేను అంగీకరించలేను, గౌరవించలేను.
@కామేశ్వర రావు: మడత కాజాలాగా మడిచి మాట్లాడటం నా పద్ధతి కాదు. ఒకవేళ మీ అభిప్రాయాలతో విభేధిస్తే మీతోనే వాదించే “తెలివి” నాకుందని నమ్ముతాను. అంతేతప్ప “మాటమార్చి” అతితెలివి చూపించాల్సిన అవసరం ఈ విషయంలో ఏ ముంటుంది చెప్పండి?
నా బాధకు కొంత నేపధ్యం ఉంది. హఠాత్తుగా భావన గారి వ్యాఖ్య చూసేసరికీ ఆపుకోలేక ఆ ఘోషంగా బయటికొచ్చింది.ఈ విషయం గురించి గత రెండు నెలలుగా నేను నాబ్లాగులో రాస్తూనే ఉన్నాను. ఈ క్రింది లంకెలను చూడండి.
http://parnashaala.blogspot.com/2009/04/blog-post_12.html
http://parnashaala.blogspot.com/2009/04/blog-post_5541.html
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_09.html
ప్రత్యేకించి మీ అభిప్రాయాన్ని కించపరిచే ఉద్దేశం నాకు అస్సలు లేదు.
కల్పన,
ముందుగా అభినందనలు. ఈ కథాంశం బావుంది. ఓకే. కాని నాకు కొన్ని సందేహాలు. శారద చేసిన పని తప్పు అని చూపించడానికి ఆర్తి ఆలోచనల్లో పుణ్యవతి వగైరా ఉదాహరణలు అవసరమా.. పాతికేళ్లు కలిసి కాపురం చేసిన భర్త చనిపోతే దు@ఖం ఉంటుంది. అతను శత్రువేమీ కాడు .పీడా విరగడైంది అనుకోవడానికి. కాని భర్త చనిపోయిన నెలకే తోడు కావాలని ప్రకటన ఇచ్చే ధైర్యం కల శారద .. తన అభిరుచులను కొంతవరకైనా భర్త ఉన్నప్పుడు సాధించుకోవడానికి తెగించలేదా. భర్తే పెద్ద అడ్డుగోడగా ఉన్నాడా? అడ్డు తొలగిందని అంత తొందరగా నిర్ణయం తీసుకుందంటే ??? ఇది ఏ చీరో, గొలుసో కొనుక్కోవడం కాదు. వెంటనే నిర్ణయం తీసుకోవడానికి. జీవితం. ఆలోచించి నిర్ణయం తీసుకొవాల్సి ఉంటుందిగా. ఈ తెగింపు ముందే ఎందుకు కలగలేదు శారదకు. అలాగే తోడు కోరుకోవడానికి శారద ఇచ్చిన కారణాలు కూడా అంతగా నప్పలేదు అని నాకనిపించింది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూ వల్ల మంచివాడు, తన ఆలోచనలకు తగినవాడు అని అతని మాటలవల్లే తెలుస్తుంది కాని అది నిజం కాదని తర్వాత తెలిస్తే. అప్పుడు ఏం చేస్తుంది??
Congratulations kalpana!
Without dissecting through the anatomy of the story and discussing its merits to win a prize, I like the way you shed light on an important social issue. The story is thought-provoking and its success lies exactly in the same.
Looking forward to more from your pen.
http://parnashaala.blogspot.com/2009/06/blog-post_10.html
నాదో కథ లాంటి కథ.
నేను వ్రాసిన కథలోని డైలాగ్ ఇది “మగవాడు తన కంటే 25 ఏళ్ళు చిన్నదైన స్త్రీని పెళ్ళి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కానీ చాలా మంది మగవాళ్ళు తమ కంటే వయసులో పెద్దైన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి సంకోచిస్తారు”.
http://viplavatarangam.net/2009/06/13/25
అభినందనలు కల్పన గారు…
నాకైతే కధ, కధనం రెండూ నచ్చాయి..
అప్పటివరకూ ఒక మూసలో సాగిపోతున్న కధ, చివరికి పాత్ర రచయితని ప్రశ్నించడంతో ముగుస్తుంది.. హిపోక్రసీ ని బాగా వ్యక్తీకరించారు..
భావన గారన్నట్లు, ఎంత అభ్యుదవవాదులైనా, దానికి ఇంకేదో విలువలు ఇవ్వాలని ప్రయత్నిస్తాం…
ఇక శారద గురించి — ఆవిడ ప్రవర్తన అసహజంగా ఉండచ్చు.. కనీసం ఆవిడ పిల్లలకి కూడా తెలియదా అంటే తెలియకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ.. సంసారంలో ఉన్నప్పుడు, నచ్చినా నచ్చకపోయినా భర్త మాటలకే ఒప్పుకోవాలి.. అలాగని భర్త అహంకారంతో ఉండక్కర్లేదు.. ఒక చిన్న ఉదాహరణ – ఆయనకి ఎరుపు రంగు చీరంటే ఇష్టం.. ఆవిడకి ఊదా రంగు చీరంటే ఇష్టం.. కానీ ఆయన కోసం ఈవిడ ఎప్పుడూ ఎరుపు రంగు చీరే కట్టుకుంటూ ఉంటుంది, కానీ మనసులో తనకిష్టమైనవి చేయలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది.. పిల్లలకి, చుట్టాలకి ఈ సంగతులన్నీ తెలియవు, అర్ధం కావు.. ఒక వేళ ఈ విషయం భర్త కి చెప్పినా కూడా అర్ధం చేసుకోలేడు.. ఇలాంటివి రోజు వారీ జీవితంలో చాలా ఉంటాయి.. దాని వల్ల అలా అసంతృప్తి గూడు కట్టుకుని ఉండచ్చు.. మరి అంత విషయన్ని కేవలం ఒక అరగంటలో ఎలా చెప్పింది అంటే కధా గమనం కోసం అలా చూపించి ఉండచ్చు..
అభినందనలు కల్పన గారు,
కధ, శారద రచయితను ప్రశ్నించడము బాగుంది, తనని అలాగే వదిలేయమని శ్రీవిద్య గారికి చెప్పండి…మీరు చెబితే వింటుందేమో..:-) నిజం గా చాలా బాగుంది.
భర్త మంచివాడు కాకపోతే అతనితో పాతికేళ్ళు కాపురం చెయ్యాల్సిన అవసరం లేదు. అందుకే “వెన్నెల దారి” కథలో హీరోయిన్ తన మొదటి భర్తని వదిలేసి మరిదితో వెళ్ళిపోతున్నట్టు చూపించాను. http://viplavatarangam.net/2009/06/17/33 ఈ కథని కూడా సంప్రదాయవాదులు అంగీకరించకపోవచ్చు. హీరోయిన్ మామ త్రినాధ రావు కారెక్టర్ సమాజంలో పరువుగల మనుషులలాగ నటిస్తూ వ్యక్తిగత జీవితంలో నీతికి విలువ ఇవ్వని హిపోక్రైట్ల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
ఏ వయసు స్త్రీ అయినా భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవచ్చు. మొదటి భర్త మంచివాడైనా సరే రెండవ పెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇది స్త్రీ హక్కులకి సంబంధించిన విషయం. ఈ కథలో మొదటి భర్త వల్ల సుఖం లేని స్త్రీ రెండవ పెళ్ళి చేసుకుంటున్నట్టు చూపించడం జరిగింది. నేను నా భార్యని ప్రేమగానే చూసుకుంటాను. ఒకవేళ నేను అర్థాంతరంగా చనిపోయినా నా భార్యకి ఆమెతో ప్రేమగా ఉండే వ్యక్తి ఉండాలి. నేనేమీ అర్థాంతరంగా పోవాలనుకోవడం లేదు కానీ ఒకవేళ పోతే నా భార్య ఒంటరి స్త్రీగా మారకూడదు కదా. మొదటి భర్త భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నా భార్యకి భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకునే హక్కు ఉండాలి.
Enthamandi mee kadha gurinchi aalochistunnaru, vislesistunnaru ante, meeru rachanalu baaga cheyagalaru ani naa abhipraayam. Keep writing..
అడ్డుగోడలు దాటలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వ్యాసం చదవండి: http://telugu.stalin-mao.net/2009/06/27/479
[...] http://kalpanarentala.wordpress.com/2009/06/09/150 [...]
Thats an interesting story.
ఒక చిన్న ఉదాహరణ – ఆయనకి ఎరుపు రంగు చీరంటే ఇష్టం.. ఆవిడకి ఊదా రంగు చీరంటే ఇష్టం.. కానీ ఆయన కోసం ఈవిడ ఎప్పుడూ ఎరుపు రంగు చీరే కట్టుకుంటూ ఉంటుంది, కానీ మనసులో తనకిష్టమైనవి చేయలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది.
ani medha gaaru said
aayanakosam ani manaspoorthiga chesinapudu chesinappudu ika badha emee vundavu . edo namkevaste ayte everytime hubby kosam kattukodu………………….
భర్త మంచివాడైనా అతను చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకోవచ్చు. ఈ హక్కు స్త్రీలకి ఉంది. పోయిన మనిషి గురించి జీవితాంతం బాధ పడుతూ ఉండలేము. భర్త చనిపోయినా స్త్రీ జీవితాంతం బాధ పడుతూ ఉండలేదు. కనుక స్త్రీకి భర్త చనిపోయిన తరువాత రెండవ పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించే హక్కు ఉంది. ఈ విషయం నేను రివ్యూ పార్ట్ 1లో వ్రాసాను. http://sahityaavalokanam.net/?p=70
ఆడవాళ్ళు తమ ప్రోబ్లంస్ గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదు. అయినా రంధ్రాన్వేషుల లాగ చిన్న విషయాల పై కూడా విమర్శలు ఏమిటి?