బ్లాగ్ ల్లోనూ వున్నారు జ్వాలాముఖులు!
నా కధ ను , ఇతివృత్తాన్ని, ఒక రచయత గా నేను చెప్పదల్చుకున్న విషయాన్ని అర్ధం చేసుకున్న వారందరికి కృతజ్ఞతలు. అర్ధం కాని వారికి, కధ నచ్చని వారికి కూడా ధన్యవాదాలు. మీ అభిప్రాయాల్ని మీరు నిక్కచ్చిగా చెప్పినందుకు. ఇలాంటి కధల్ని అర్ధం చేసుకోవాటానికి తెలుగు భాష ఒక్కటే వస్తె చాలాదేమో. కధలోని పాత్రల సంఘర్షణల్ని ( నేను చెప్పినా, చెప్పకపోయినా, చెప్పలేకపోయినా) అర్ధం చేసుకునే హ్రుదయం కూడా వుండాలని నేను గట్టిగా నమ్ముతున్నాను.
దాదాపు పదిహేనేళ్ళ క్రితం ‘నీలిమేఘలు ‘ స్త్రీవాద సంకలనం వచ్చేనాటికి జరిగిన వాదోపవాదాలు, గొడవలు, బహిరంగ సవాళ్ళు అందరికి కాకపోయినా చాలా మందికి గుర్తుండే వుంటాయి.
జ్వాలముఖి లాంటి పెద్దమనిషి స్త్రీవాద కవితలు ‘ నీలీ కవితలని, బూతు రాతలని , వొళ్ళు బలిసిన రాతలని రాసేసారు.
కాలం ఇంకొంచెం ముందుకెళ్ళినా అలాంటి జ్వాలాముఖులు వుంటూనె వున్నారు.
వైవాహిక అత్యాచారం (marital rape ) గురించో, స్త్రీలు రెండో పెళ్ళీ చేసుకోవడం గురించి మాట్లాడటం కూడా అశ్లీల కధలని నాకు ఇంతవరకు తెలియలేదు. నా అయిదో గోడ లొ శారద ఒకవేళ శారీరక వాంచల కోసమే పెళ్ళి చేసుకోవాలనుకుందనుకోండి. అప్పుడు ఈ కధ porno site లో పెట్టుకోవాల్సిన కధ అన్న మాట. అంతేనా ? ఒక మగవాడు వాంచల కోసం పెళ్ళి చేసుకుంటె సహజం, పదహరేళ్ళకే కొరికలు ఆపుకోలేక ఏవెవో చేస్తే అది మగటిమి, ఒక స్త్రీ యే వయస్సు అయినా కోరికలతో వుండటం,, పోనీ కోరికలతోనే పెళ్ళి చేసుకోవాలనుకోవడం అశ్లీల కధ…. పాఠకుడు తనకు నచ్చినది, తను మెచ్చిన అభిప్రాయాల్ని రచయత నుండి expect చేస్తాడు. ‘ఇలాంటీ’ అభిరుచి, అభిప్రాయాలు, కధాసమీక్ష చేసే పాఠకులు వుండటం ఎవరికి నష్టం? సాహిత్యానికా? రచయతలకా? లేక పాఠకులకేనా?
బ్లాగ్ ల్లోనూ వున్నారు జ్వాలాముఖులు!
జూన్ 17, 2009 kalpanarentala చే
ఎవరికీ నష్టం ఉండదు. అందరికీ మంచి టైంపాస్!!
రచయిత ఉద్దేశించినట్లే అందరు పాఠకులూ అర్థం చేసుకోవాలని కోరుకోవడం బహుశా మితిమీరిన ఆశావాహక దృక్పధం అనిపించుకుంటుంది.
రాసిన వెంఠనే రచన రచయితను మీరి స్వతంత్ర్య ప్రతిపత్తిని సంతరించుకుంటుంది. ఒకసారి పాఠకుడి చేతుల్లోకి వెళ్ళిన తరువాత తన మనఃస్థితిని బట్టి, పూర్వజ్ఞానాన్ని బట్టి కొత్త అర్థాల్ని సంతరించుకుంటుంది. దీన్నే reader centric interpretation అంటారు.
ప్రతిపాఠకుడి “స్థాయీ” రచయిత స్థాయి కాబఖ్ఖరలేదు. రచయిత ఆశించిన స్థాయిలోనే పాఠకుడు రసస్పందన చెందనవసరమూ లేదు. కాకపోతే ఈ writer’s anxiety తగ్గించడానికి ఒక text ని intended form లో చదవడానికి కొంత “EDUCATION”(what ever it means) అవసరం అనేది చాలా మంది అంగీకరించే విషయం. సినిమా విషయంలో కూడా ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది.
ఇక స్త్రీవాద సాహిత్యం గురించి. ఒక బలమైన గోడను కూల్చడానికి పెద్ధ విస్ఫోటమే కావాలి. “నీలిమేఘాలు” అలాంటి ఒక ప్రయత్నం. ఎలాగూ accepted norms ని defy చెయ్యడానికి పుట్టిన సాహిత్యం కాబట్టి ధిక్కారస్వరాన్ని “షాకింగ్” గా చెప్పడానికి కొన్ని విప్లవాత్మక పోకడలు పోయింది. అప్పట్లో వాటిని నిర్వచింపగలిగే literary tools లేవు, సైద్ధాంతిక జ్ఞానం అంతకన్నా లేదు. కాబట్టి, ఉన్న “విలువల” నేపధ్యంలోంచీ జ్వాలాముఖిలాంటి సాహితీవేత్తలు అలాంటి వ్యాఖ్యానాలు చేశారు.
కాలగమనంలో వాదోపవాదాల నేపధ్యంలో జ్వాలాముఖిలాంటి ఎందరో మారారు. కానీ ఇప్పటికీ జ్వాలాముఖులు ఖచ్చితంగా ఉన్నారు. రాబోయే కాలంలో ఉంటారుకూడా. అందుకే బహుశా “కథ వెనుక కథలు” అవసరం. అది సైద్ధాంతిక వివరణో లేక సామాజిక చిత్రపటమో నేపధ్యంగా పరిచయం చేస్తే పాఠకుడిలో empathy క్రమక్రమంగా వచ్చే అవకాశం ఉంది. అదే బహుశా అవసరమైన ఎడ్యుకేషన్ అనుకుంటాను.
స్త్రీవాదులని చెప్పుకునేవాళ్ళలోనే “శరీరసాహిత్యం” పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి.
వాంఛల సాహిత్యాన్ని విమర్శకులు సమదృష్టితో చూసిన దాఖలాలు తెలుగు సాహిత్యంలో తక్కువే. మన సంస్కృతిలో శరీరాల ప్రేమేతప్ప శరీరమంటే ప్రేమ లేదు. వాంఛల్ని విశృఖలత్వంగానే అర్థం చేసుకుంటాంతప్ప వాటి సహజరూపాల్ని అంగీకరించం. అది మన సామాజిక mind scape లో ఉన్న మతలబు. దానికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఘర్షణ తప్పదు. చలం ఇప్పటికీ ప్రశ్నింపబడుతూనే ఉన్నాడు. వోల్గా “(అ)నైతికత” పై ప్రశ్న చిహ్నం ఇప్పటికీ ఉంది. రంగనాయకమ్మ నిర్భయత్వం “పెళుసుగా” అనిపిస్తూనే ఉంది.
చివరిగా…”‘ఇలాంటీ’ అభిరుచి, అభిప్రాయాలు, కధాసమీక్ష చేసే పాఠకులు వుండటం ఎవరికి నష్టం? సాహిత్యానికా? రచయతలకా? లేక పాఠకులకేనా?” అంటే “మొత్తంగా సమాజానికి” అనేది నా సమాధానం అవుతుంది. Best that is thought and said is in literature అనే ఆలోచనను నేను నమ్ముతాను. ఆ మహత్తరమైన ఆలోచనలు సమాజానికి ఉపయోగపడకపోతే అది ఒకవైపు సాహిత్యానికీ మరొకవైపు సమాజానికీ రెంటికీ తీరని నష్టం.
‘ఇలాంటీ’ అభిరుచి, అభిప్రాయాలు, కధాసమీక్ష చేసే పాఠకులు వుండటం ఎవరికి నష్టం” ప్రచారం ఎవరు కావాలని కోరుకొంటున్నరో వాళ్లకి
)
జ్వాలాముఖి ఎంత భూస్వామ్య భావవాదో “జన సాహితితో మా విభేదాలు” పుస్తకంలో రంగనాయకమ్మ గారు వ్రాసారు.
నేను ఇంకో కథ వ్రాసాను: http://viplavatarangam.net/2009/06/17/33 ఇందులో అన్న క్రూర్ సింగ్, తమ్ముడు వీరేంద్ర సింగ్. ఈ కథలో హీరో క్రూర్ సింగ్ లాంటి తన అన్న చెర నుంచి చంద్రకాంత లాంటి తన వదినని విడిపించి పెళ్ళి చేసుకుంటాడు. మగ మృగాలకి క్రూర్ సింగే ఆదర్శ మూర్తి లాగ కనిపిస్తాడు.
వ్యభిచారం పేరుతో చిత్తూరు మురుగేశన్ నిజమైన బూతు వ్రాతలు వ్రాస్తున్నప్పుడు ఈ మగవాళ్ళు ఎందుకు విమర్శించలేదు? స్త్రీవాద కథలు మాత్రమే వీళ్ళకి బూతు లాగ కనిపిస్తాయి. నిజమైన బూతు వ్రాతలు మాత్రం బూతు లాగ కనిపించవు.
ఏమి రా ఈ దూల
@మార్తాండ:
ప్రతిచోటా చొరబడిపోయి అసలు విషయాన్ని పక్కదారి పట్టించటం ఆపు బాబూ. ఎవరూ పట్టించుకోకపోతేనే నీ మురుగేశన్ కనుమరుగైపోయాడనుకున్నావా?
@కల్పన:
సద్విమర్శల్ని పట్టించుకోండి. పిచ్చి రాతల్నీ, కూతల్నీ పట్టించుకుంటూ కూర్చుంటే ఎలా?
వ్యాసాన్ని పక్క దారి పట్టించాల్సిన అవసరం నాకు లేదు. జ్వాలాముఖి స్త్రీవాదాన్ని సామ్రాజ్యవాదుల కుట్రగా అభివర్ణించాడు, మరి అబ్రకదబ్ర గారు స్త్రీవాదాన్ని ఎవరి కుట్రగా అభివర్ణిస్తారో.
కల్పన గారి కథ చదివాను. మొన్నటి వరకు చలం గారిని దూషించిన మగ మృగాలు ఇప్పుడు వీరేశలింగం గారి సిద్ధాంతాలని కూడా దూషించే లెవెల్ కి దిగజారిపోయారు.