తూర్పు-పడమర
కొత్త ఇంటికి రండి !
నేను ఇల్లు మారుతున్నాను.  కొత్త ఇంటి అడ్రెస్ ఇక్కడ.
మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!
http://sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=40556&Categoryid=1&subcatid=3
అజర్ నఫిసీ – ఇరాన్ కు  చెందిన అంతర్జాతీయ రచయిత్రి. ఆమె రాసిన  Reading Lolita in Tehran అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా గుర్తింపు పొందింది. ఆమె కలం నుంచి తాజాగా వెలువడ్డ  Things I Have Been Silent About ఇరాన్ లో పుట్టి పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన జ్ఞాపకాల దొంతర. ఇది కేవలం నఫిసీ వ్యక్తిగత జీవితం మాత్రమో,  ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర మాత్రమో కాదు. ఇరాన్ దేశపు రాజకీయ విప్లవ చరిత్ర, నఫిసీ కుటుంబ చరిత్ర, ఆమె తల్లితండ్రుల వ్యక్తిగత సంఘర్షణల   నేపథ్యాలు  అన్నీ కలగలసిపోయిన  మెమొరీస్. మనం సమాజంలోని వ్యక్తులుగా, కుటుంబంలోనూ, రాజకీయ జీవనంలోనూ, సాహిత్యంలోనూ ఎలాంటి విషయాల్ని బైటకు వెల్లడి చేయకుండా నిశ్శబ్దంగా లోపల్లోపలే దాచుకుంటామో బహిరంగంగా ప్రకటించింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా.కుటుంబంలోని రహస్యాల పట్ల ఓ  కూతురి మౌన వేదన, ఓ నవయవ్వనవతిగా సాహిత్యం లోని సెన్సువాలిటి పవర్ ని కనుగొన్న వైనం, ఓ దేశపు స్వాతంత్ర్యం కోసం ఓ కుటుంబం చెల్లించిన మూల్యం ఇవన్నీ మనకు ఈ పుస్తకం చదవటం ద్వారా అర్ధమవుతాయి.
” చాలా మంది మగవాళ్ళు పరాయి స్త్రీల ప్రాపకం కోసం తమ భార్యల్ని మోసం చేస్తారు. కానీ మా నాన్న సంతోషకరమైన కుటుంబ జీవనం కోసం మా అమ్మ ని మోసం చేశాడు” అంటూ ఈ పుస్తకాన్ని మొదలు పెడుతుంది నఫిసీ. “ఆయన కోసం నేను బాధ పడ్డాను. ఒక రకం గా ఆయన జీవితంలోని ఖాళీల్ని నింపటం అనే బాధ్యతను నాకు నేనే తీసుకున్నాను. నేను ఆయన కవితలు సేకరించాను. ఆయన వాగ్దానాల్ని విన్నాను. మొదట మా అమ్మ కోసం, తర్వాత ఆయన ప్రేమలో పడ్డ స్త్రీల కోసం సరైన బహుమతుల ఎంపికలో ఆయనకు సహకరించాను.” అంటూ చెప్పుకొస్తుంది నఫిసీ ఈ పుస్తక ప్రారంభంలో.
అద్భుతమైన కధకురాలు చెప్పిన అందమైన జ్ఞాపకాలు ఈ పుస్తకం. అవి మనసుని  మెలిపెట్టి బాధపెట్టే  జ్ఞాపకాలు. నఫిసీ ఈ పుస్తకంలో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తామో చెప్పటమే కాకుండా మనం ఎందుకు వివిధ దేశాల చరిత్ర చదవటం అవసరమో వివరిస్తుంది. ఏ దేశ చరిత్ర తెలియాలన్నా ముందు ఆ దేశ సాహిత్యం చదవటం ముఖ్యమంటుంది అజర్ నఫిసీ. నఫిసీ తల్లి మేధావే కాదు, చాలా కాంప్లికేటెడ్ కూడా. ఆమె తన కలల్లో తనకంటూ ఓ సృజనాత్మక సాహిత్య లోకాన్ని సృష్టించుకొని అందులో బతికింది. ఆమె చెప్పిన కథలు, ఆమె కథనం  ఇవన్నీ నఫిసీ కి క్రమంగా అర్ధమవటం వల్ల ఆ కథనాల్లో  దాగి వున్న తన తల్లికి సంబంధించిన అసలు విషయాన్ని అవగతం చేసుకోగలిగింది.
నఫిసీ తండ్రి మరో రకమైన ‘ నేరేటివ్స్ ‘ వైపు మళ్ళాడు. ఇరాన్ దేశ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన  సంప్రదాయ కథలు  ‘ షానామే’,( Shahnameh- పర్షియన్ రాజుల గురించిన పుస్తకం) వైపు మొగ్గు చూపి తన పిల్లలను పసితనం నుండి ఆ కథల ద్వారా మంత్రముగ్ధుల్ని చేసేవాడు. నఫిసీ తండ్రి ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకొని, వారితో సంబంధాలు పెట్టుకోవడం గమనించినా, పసితనం నుంచి నఫిసీ ఈ రహస్యాలన్నింటినీ తల్లి దగ్గర నుంచి దాచిపెట్టింది. ఈ ప్రభావం వల్ల నఫిసీ తర్వాతర్వాత రాజకీయ, సాంస్కృతిక , సామాజిక, వ్యక్తిగత విషయాల్లో కూడా అన్యాయాల్ని ఎలా మౌనంగా ఎదిరించకుండా  వుండిపోయిందో పాఠకులకు అర్ధమవుతుంది.
ఈ పుస్తకం బలమైన చారిత్రక అక్షర చిత్రం– ఒక కుటుంబంలోని మార్పు, ఒక దేశంలోని రాజకీయ వ్యవస్థ  మార్పు –రెండూ ఎలా కలగలిసి వుంటాయో ఈ ‘ మెమోయర్ ‘ ద్వారా మనం అర్ధం చేసుకోవచ్చు. నఫిసీకి ఇష్టమైన ఇరాన్, మనందరం కూడా ప్రేమించే ఇరాన్ క్రమేపీ ఒక మతపరమైన నిరంకుశ, నియంతృత్వ పాలనలోకి ఎలా మళ్ళిందో మనకు తేటతెల్లంగా అర్ధమవుతుంది. ఇరాన్ లో స్త్రీలకున్న ఛాయిస్ లపై చాలా లోతైన, వ్యక్తిగత విశ్లేషణ చేసింది నఫిసీ ఈ పుస్తకం ద్వారా. వీటి ద్వారా నఫిసీ భిన్నమైన జీవితాన్ని ఎన్నుకోవటానికి ఎలా వుత్తేజపరిచిందో చెపుతుంది. ఓ స్త్రీ ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు ఇవి. వ్యక్తిగత, కుటుంబ, కల్లోలిత మాతృభూమి జ్ఞాపకాలివి.
కథలు  చెప్పటం ఆ కుటుంబంలో అందరికీ వెన్నతో పెట్టిన విద్య. నఫిసీ తల్లి తన అసంతృప్తులను తప్పించుకోవటానికి తన వూహా ప్రపంచాన్ని వాస్తవిక ప్రపంచంగా పిల్లలకు కథలుగా చెప్పేది. నఫిసీ తండ్రి ఇరాన్ దేశ రాజుల చరిత్రను, పర్షియను సాహిత్యాన్ని పిల్లలకు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కథలుగా చెప్పెవాడు.నఫిసీ తల్లి కథలు  రాయదు కానీ, తన గత జీవితాన్ని కథలుగా మలిచి పిల్లలకు చెప్పేది. ప్రతి కథ చివర్లో ఆమె ఇలా ముగించేది ” అయితే నేనొక్క మాట కూడా అనలేదు. నిశ్శబ్దంగా వుండిపోయాను” అని. నఫిసీ తల్లి నిజంగానే బలంగా నమ్మేది ” తనెప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పలేదని”. అయితే తనదైన శైలిలో ఆమె ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితంలోని గత స్మృతుల గురించే పిల్లలతో మాట్లాడేది. వ్యక్తిగత విషయాలు బైటకు వెల్లడి చేయకపోవటమనేది ఇరానీ సంస్కృతిలో ఒక ముఖ్యమైన అంశం. నఫిసీ తల్లి ఎప్పుడూ అంటుండేదట ..” మన మురికి దుస్తుల్ని మనం బైట ఆరెయ్యం” అని. పైగా వ్యక్తిగత జీవితాలనేవి అల్పమైన విషయాలతో కూడుకొని వుంటాయి. వాటి గురించి రాసుకునేంత ఏముంటాయి? అందరికీ ఉపయోగపడే జీవిత చరిత్రలు   ముఖ్యమైనవని   నఫిసీ తల్లి అభిప్రాయం. అయితే నఫిసీ కి తెలుసు ఇక ఎప్పటికీ తాను నిశ్శబ్దంగా వుండకూడదని…అందుకే తన గురించి, తన తల్లితండ్రుల గురించి, తన కుటుంబాన్ని గురించి, తన దేశాన్ని గురించి, ఇరాన్ రాజకీయ వ్యవస్థ గురించి అన్నింటి గురించి బాహాటంగా ఈ పుస్తకం లో మాట్లాడేసింది.
అందుకే నఫిసీ అంటుంది ” మనం నిశ్శబ్దంగా వుంటున్నామనుకుంటాం కానీ నిజంగా వుండం. ఎలాగంటే ఏదొ ఒక రకంగా మనకేం జరిగిందో అన్న దాని బట్టి మనమెలా మారామో, మనమెలా రూపుదిద్దుకున్నామో అన్నది మనం ఏదో ఒక రకంగా వ్యక్తీకరిస్తూనే వుంటాము” అని.
నఫిసీ తండ్రి పర్షియన్ సాహిత్యంలోని సంప్రదాయ కావ్యాల ద్వారా ఆ దేశ చరిత్రను తన పిల్లలకు కథల రూపంలో అందించాడు. ఆ సాహిత్యం ద్వారానే వాళ్ళకు ఇరాన్ దేశ చరిత్ర గురించి అర్ధమైంది.  అందుకే నఫిసీ అంటుంది పిరదౌసినీ మర్చిపోవడమంటే ఇరాన్ ని నిర్లక్ష్యం చేయడం అని. ఇటీవల ఆస్టిన్ లో యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ వారు అజర్ నఫిసీ తో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ఇదే మాట చెప్పింది. మన దేశ సాహిత్యకారుల్ని గుర్తుంచుకోవడం, వారి రచనల్ని మననం చేసుకోవడమంటే మాతృ దేశం పట్ల మనకున్న భక్తిప్రపత్తులను పరిపుష్టం చేసుకోవడమే అంటుంది నఫిసీ తన ప్రసంగంలో, తన పుస్తకంలో, తన మాటల్లో…
ఈ పుస్తకాన్ని ఒక రాజకీయ లేదా సాంఘిక కామెంటరీ లాగానో, లేదా ఉపయోగపడే జీవిత చరిత్ర లాగానో వుండాలని నఫిసీ కోరుకోలేదు. ఆమె ఒక కుటుంబ కథ చెప్పాలనుకున్నది. ఆ కథ ద్వారా ఇరాన్ రాజకీయ, సాంస్కృతిక చరిత్ర తెలియ చెప్పాలన్నది ఆమె వుద్దేశ్యం. అది ఖచ్చితం గా నూటికి నూరుపాళ్ళు నెరవేరింది. ఇరాన్ వున్నంత కాలం చరిత్ర, సాహిత్యం రెండూ అజర్ నఫిసీ ని మర్చిపోవు. మర్చిపోలేవు.
కల్పనారెంటాల
కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!
కవి చలం…వజీర్ రెహ్మాన్ అద్దంలో…!
మీకు బాగా నచ్చిన కవి ఎవరూ? అంటే కవిత్వ అభిమానులు, ప్రేమికులు ఎవరైనా ఠక్కున కనీసం ఓ పదిపేర్లు చెప్పగలరు . ఆ పదిపేర్లు ఫలానా వారివే అయివుండనక్కరలేదు. ఎందుకంటే అది వారి వారి అభిరుచిని బట్టి వుంటుంది కాబట్టి. నేను చెప్పే పది పేర్లలో తప్పనిసరిగా వుండే రెండు పేర్లు –ఒకటి చలం, రెండోది వజీర్ రహ్మాన్. చలం కవా? అని ఇప్పటికీ కొందరు అశ్చర్యపోతుంటారని నాకు తెలుసు. ఆ మాటకొస్తే మీరు కవి అని వజీర్ రహ్మాన్ చెప్పేటప్పటికి చలమే బోలెడంత ఆశ్చర్యపోయారు.
చలం వచనం కవితాత్మకం అని వేరే చెప్పక్కరలేదు. మొదటి సారి చదివిన కొత్త పాఠకుడు కూడా వెంటనే చలం కవితాత్మకతని గుర్తు పడతాడు. అసాధారణమయిన మ్యూజింగ్స్ మొదలుకొని సాధారణమయిన గల్పికలూ, వ్యాసాల్లో కూడా చలం కవి అనుకోడానికి తగినన్ని దాఖలాలు దొరుకుతాయి. అవి కాక, శ్రీ శ్రీ, పఠాభి లాంటి కవుల గురించి చలం రాసిన వాక్యాల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. కవుల మీద గొప్ప ప్రేమా, తీవ్రమయిన కోపం – రెండూ కనిపిస్తాయి.ఎంతో మంది కవులే అనువాదం చేసినప్పటికీ, టాగూర్ గీతాంజలి చలం అనువాదంలోనే చదవాలని అనిపిస్తుంది. అదీ చలం వచనం ప్రత్యేకత.
చలం ది కవిత్వం లో కూడా భిన్నమైన దారే. సామన్యంగా ఆధునిక తెలుగు కవులు అనేకమంది కవిత్వాన్ని వచనంలో రాస్తారు. కానీ వచనంలో కవిత్వం రాయడం చలం ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను గుర్తు పట్టి ప్రత్యేకంగా కవిగా చలాన్ని పరిచయం చేసిన హృదయమున్న వ్యక్తి వజీర్ రహ్మాన్.
చలం శతజయంతి సందర్భం గా 1994 లో శతజయంతి సంఘం వారు వేసిన ఈ పుస్తకం అపురూపమైంది. ఎందుకంటే చలం కవిత్వంతో పాటు చలం వి వివిధ దశల్లో తీసిన అపురూప ఛాయాచిత్రాలున్న పుస్తకం ఇది. అంటే కవితలతో ఫోటో ఆల్బం అన్న మాట.
చలం కవిత్వ నిషాకి మచ్చుకి కొన్ని పంక్తులు…
‘వానరాత్రి ‘ లో ఏమంటారో చూడండి…
ప్రపంచాన్ని తుడిచేద్దామన్నట్లు వీస్తోంది గాలి/నల్లని రాత్రి ఇంకా నల్లని
మబ్బు వస్త్రాలు కప్పుకుని ఏడుస్తోంది/
హోరుమని అరుస్తో వాన/తలుపులు మూసి దీపం వెలిగించుకున్న/వాన లోపలికి వస్తానని పంతం పట్టి
తలుపు మీద ఈడ్చి కొడుతోంది–/తెరవమని/కొంచం మర్చిపోతుంది,
మళ్ళీ నేను గ్యాపకం వొస్తాను గావును/దబదబా బాదుతుంది;
నా విరహ బాధని ఈ రాత్రిలో కలిపెయ్యలేను?
చదువుకుని ఆ అనుభూతిని స్వానుభవిచటం తప్ప వివరణలు, వ్యుత్పత్తి అర్ధాలు అక్కర్లేని, సూటిగా మాట్లాడే కవిత్వం చలానిది.
ప్రేయసి అన్వేషణ గురించి ఏ రాసుకున్నారో చూడండి…
నీవు రావు/నన్ను పోనీవు!
మరల్చి మత్తెక్కించి/స్వప్నాలతో లాలించి/మధురగానాలతో వూగించి/ప్రపంచానికి వ్యర్ధుణ్ణి చేసావు!/
అనాదిగా విన్న నీ పిలుపు/స్వప్నంలో అనుభవించిన /నీ కుంతల కొనల స్పర్స/
ఏ యుగాల ఆవలి తీరానో/ సం యోగమనే వాగ్దానం /
ఇంతే నాకు/మిగిలిన ఆశలు!/ప్రియా!/
యోగులు హృదయంతో / వెలిగించుకునే కాంతి- నీ చిరునవ్వు;/
నాకెట్లా దొరుకుతుంది?
మల్లెపూల గురించి చలం తమకం చదవండి…
అర్ధరాత్రులు విచ్చి/ జుట్టు పరిమళంతో కలిసి/ నిద్ర లేపి/ రక్తాన్ని చిందులు తొక్కించే మల్లెపూలు/
సన్నని వెన్నెట్లో/ ప్రియురాలి నుదుటి కన్నా తెల్లగా/ ఏమి చెయ్యలో తెలీని ఆనందంతో/గుండె పట్టి చీలికలు చేశే మల్లెపూలు/
తెల్లరకట్ట లేచి చూసినా/ఇంకా కొత్త పరిమళాలతో /రాత్రి జ్ఞాపకాలతో/ప్రశ్నించే మల్లెపూలు/
అలిసి నిద్రించే రసికత్వానికి/జీవనమిచ్చే ఉదయపు పూలు/ రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా/అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు! మల్లెపూలు!!
చలం ‘ విరహం’ అనుభూతించండి…
ప్రియుడి రత్యాలింగనం తర్వాత/సంతుష్టి చెందిన ముఖం వలె/గాలిలోని కొత్తని చల్లదనం/
శరీరం మీద తగిలి/హృదయంలోకి దూసుకుపోతోంది/
నిద్ర కమ్మిన కన్ను వలె/వొక్క నక్షత్రం మెరుస్తోంది/
ఈ గోలలొ గాలిలో, పాపం/ఏదో పిట్ట లేచి అరుస్తోంది/చప్పున గాలి ఆగింది/
నది కూడా నిశ్శబ్దమైంది చచ్చిపోయినట్లు/చీకటి నిశ్శబ్దం/నువ్వే లేవు!
చలం కవిత్వాన్ని గురించి మనం ఆస్వాదించి ఆనందించటం సరే. ఆయనే ఏం చెప్పుకున్నారో చూడండి ‘ చలం రాయని “పీఠిక” లో…
వజీర్ రహ్మాన్ గారికి,
మీరు పంపిన గీతలు, ఆ selections అన్నీ కూడా చాలా బావున్నాయి. కొన్ని ఎక్కడివో నేను గుర్తించలేకపోయినాను.
మొదట అవేవో మీరు రాశారనుకున్నాను. ఎవరీ గొప్ప కవి? అని ఆశ్చర్యపడ్డాను. కొంచం దూరం చదివితే గాని, అవి నేను రాసినవని తెలీలేదు. చదువుతున్న కొద్దీ ఇంత గొప్ప కవిత్వం నేనేనా రాశింది అని ఆశ్చర్యపడ్డాను.
ఆ గీతాలు ఎవరివైనా కానీ, అట్లాంటివి ఏ సహృదయుడైనా ఆరాధించవలసిన విలువ గలవి. కాని ఇన్నేళ్ళూ ఎవడు చూశాడు? వాటి రచయతే గుర్తించలేదు వాటి విలువని- ఇన్నేళ్ళకు మీరు జన్మించి, గుర్తించి, సేకరించి, ఎత్తిచూపిందాకా!
తనలో కవిత్వమున్నదని తెలుగువాడు చలానికే తెలీదు.
మల్లెపూల పైన నేను రాసిన Musings కవిత్వంతోనూ, తత్త్వంతోనూ కూడినవని నాకు తెలుసు. ఎవరైన ఇంకొకరు గుర్తిస్తారెమోనని ఆశించేవాణ్ణి. Musings లో మెచ్చుకునేవాళ్ళలో ఒక్కరూ వాటిని ప్రత్యేకంగా మాట్లాడలేదు.ఒక్క రుక్మిణీనాధ శాస్త్రి గారు ఒకసారి passing గా ” చాలా కవిత్వముందండీ; ” అన్నారు, మరి నా హృదయం మీ ఒక్కరికే తెలీడం ఎట్లా జరిగింది?
-చలం
చలం కవిత్వం గురించి వజీర్ రెహ్మాన్ ఇలా అన్నారు:
‘చలాన్ని త్రావి
నిషాలో వున్నాన్నేను-
ముట్టకు
మెరుపై జ్వలిస్తాను!
తట్టకు
ఉరుమై ధ్వనిస్తాను ‘
-వజీర్ రహ్మాన్
ఔను చలం ! ఔను సుమా,
ఔను నిజం నీవన్నది;
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, చలం !
(శ్రీశ్రీ కృతి, శృతి లో)
అగాధం లోంచి బైలుదేరే
నల్లని అలలు మొహాన కొట్టి,
ఉక్కిరి బిక్కిరై,
తుఫాను హోరు చెవుల్లో గింగురుమని,
నమ్మిన కాళ్ళ కింద భూమి దొలుచుకుపోతో వుంటే
ఆ చెలమే నయమని
పరిగెత్తి వస్తా ‘రన్నాడు
చెలం.
‘ అవును,
చెలం వచనాన్ని గీతాలుగా కత్తిరించి
వొడ్డించుకుంటారు కూడా ‘
అన్నాడు వజీర్ రహ్మాన్, వెనక.
విన్న మిత్రులు కాచుక్కూచున్నారు.
ప్రధ్వానం వినబడకపోగా చివరికి రహ్మానే తెగించి
తెలుగు వాంగ్మయాన్ని చెలం గీతాలతో వూగించే
బాధ్యత స్వీకరించాడు.
ఫలితం గా ఈ సమర్పణ.
కవితా ధ్వజాన్ని చేదాల్చి
పాతగోరీల కేసి మొహాలు తిప్పుకుని కూచున్న
వాంగ్మయ పీఠాధిపతుల
నడ్డి విరగ్గొట్టాల్సిన చెలం,
ఎంచాతనో విరమించుకుని;
కృష్ణశాస్త్రిని క్షమించి,
శ్రీశ్రీ ని ఆశీర్వదించి,
వెనక్కి మరలి వచనంలోకి వెళ్ళిపోయాడు.
అంచాతనే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ బ్రతికి వున్నారు,
నేటికీ మనలో
చెలం
తెలుగులో ‘ కవిత్వం ‘ పేరుతో
ఏమీ వ్రాయ
నిరాకరించడం,
వీరిద్దరనీ రక్షించే ఆలోచనో,
లేక తన వచనానికే గోలెత్తిన తెలుగు దేశం
కవిత్వానికి తట్టుకోలేదనో–
తెలీదు.
చెలానికి సంబంధించిన చాలవిషయాలకి మల్లే
ఇదీ ఇంకా అజ్ఞాతంగానే వుండిపోయింది.
ఐనా,
కవిత్వమనే పేరుతో గాకపోయినా, రాసిన వచనమే
చాలు,
చెలాన్ని ‘ మహాకవి ‘ గా
పరిగణించేందుకు.
(కాని,
చెలం గారూ,
ఠాకూర్ అన్నట్లు–
you live alone and unrecompensed
because
they are afraid of
your great worth!)
—వజీర్ రహ్మాన్
చలం కవిత్వమంతా ఆయన అంతరంగ చిత్రాలు –వాటికి బాహ్య రూపాన్ని చిత్రించే ఛాయాచిత్రాలు –రెంటి ఆత్మల్ని అందిపట్టుకొని మనకందించిన సహృదయుడు వజీర్ రహ్మాన్. వజీర్ రహ్మాన్ కవిత్వం గురించి మారో సారి మాట్లాడుకుందాం…
తెలుగు కథాచర్చ -రెండవ భాగం
తెలుగు కథాచర్చ -రెండవ భాగం
కథావిమర్శ (చర్చ) – రెండోభాగం : వ్యాఖ్యలూ, విమర్శలూ, సంపాదకులధోరణిలో మార్పులు
ఈ చర్చ మొదటి భాగం ఇక్కడ.
కల్పనః మాలతిగారు, క్రితంసారి మనం కధలగురించి మాట్లాడుకున్నప్పుడు మంచి కధలగురించి తర్వాత మాట్లాడాలనుకున్నాము కదా! అసలు మంచికథ అంటే ఏమిటి? ఎలా నిర్ణయిస్తాం ఏది మంచికథో?
మాలతిః ఏమో మరి. కొన్నాళ్లపాటు నేను కూడా చాలామంది విమర్శకులలాగే, ప్రారంభం, ముగింపూ, సన్నివేశాలూ, సంఘర్షణలూ, పాత్రపోషణ అంటూ కొన్ని కొలమానాలు అవసరం అనుకున్నాను కానీ, ఆలోచించినకొద్దీ అలాటి కొలతల్లో ఇమడకపోయినా, పాఠకుల ఆదరణ పొందినరచనలు కనిపిస్తున్నాయి. అలా చూసినప్పుడు, మనం కథని ఇలా ఒక చట్రంలో బిగించడం రచయితలభావుకతకి ప్రతిబంధకం అనిపిస్తోంది. అంచేత మంచికథ ఏదీ అనడం కంటే నేను ఎందుకు రాస్తున్నాను అంటే చెప్పగలనేమో. మరి నీ అభిప్రాయంలో మంచి కథ అంటే ఎలా వుండాలి?
కల్పనః ఏది మంచికధగా గుర్తించబడుతోంది? లేదా పాఠకులదృష్టిలో ఏది మంచికధ? అనేది ఒక ప్రశ్న అయితే, రచయితదృష్టిలో, సంపాదకులదృష్టిలో మంచికధ అనుకున్నది పాఠకులకు మంచి కధ అవుతోందా, లేదా? అనేది ఇంకో ప్రశ్న. మీరు చెప్పిన కొలమానాలు అవసరమే. అయితే అవి మాత్రమే కధ కాదు. ఇంతకుముందు మనం చాట్‌లో చెప్పుకున్నట్టు ఈనాటి కధాస్వరూపం మారింది అని నేననుకుంటున్నాను. అందుకే narratives కూడా కధలవుతున్నాయి. వీటినన్నింటిని గుర్తించి, అర్ధం చేసుకున్న అవగాహనతో మాత్రమే మనం మంచికధ అంటే ఏమిటి అని మాట్లాడుకోవాలంటాను నేను. మీరేమంటారు? అసలు మీరెందుకు కధలు రాస్తారో చెప్పండి పోనీ.
మాలతిః ఎందుకు రాస్తున్నానంటే, మనకి తోచిన ఆలోచనలు అభివ్యక్తం చెయ్యడం, పక్కవారితో చెప్పుకోవడం మానవనైజం కనక. మనం గమనించినవిషయం – అందరికీ తెలిసినదే అయినా ఎవరూ పట్టించుకోనివిషయం అయినప్పుడూ, ఎవరూ గమనించలేదు – అదేలే నాకు తెలిసినంతలో – అనిపించినప్పుడు రాయాలనిపిస్తుంది నాకు.
ఉదాహరణకి, ఈమధ్య పొద్దు.నెట్‌లో ప్రచురించిన “నాకోసం” కధ చూడు. ఈరోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా వుంది. దానికోసం పడేపాట్లు చాలా కథల్లో వస్తున్నాయి. అయితే మేథస్సు వుండి కూడా ఒకరకమైన స్వోత్కర్షతో, సీరియస్‌గా ఉద్యోగాన్యేషణ చెయ్యనివాళ్లు కూడా వుంటారన్నది అందులో ఒక అంశం. ఇది అమెరికాలోనేనా కావచ్చు. ఇండియాలోనేనా కావచ్చు. రెండోది, ఈనాటి స్త్రీలు విద్యమూలంగా ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం సంతరించుకున్నవారు. స్త్రీలకి గల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం సంసారంలో కలతలకీ, ఈతి బాధలకీ కారణమవుతున్నాయి అన్నది రెండో అంశం. ఎవరు ఎవరికోసం ఏమిటి త్యాగం చేస్తున్నారన్నది ఇదమిత్థమని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ప్రాథమికంగా పాఠకులు గమనించవలసినవి ఈరెండు అంశాలూ నాకథలో. ఈ యువతీ, యువకుల మనస్తత్త్వాలు పాఠకులముందు పెట్టడమే ఈకథలో నేను చెయ్యదలుచుకున్నది. మొదటి డ్రాఫ్టులో ఇందులో సగమే రాసేను. కొందరు స్నేహితులకి చూపించి, వాళ్ల సలహాలు విని, మరికొన్ని సన్నివేశాలు చేర్చి మరింత వివరించడానికి ప్రయత్నించేను. దీనిమీద వచ్చినవ్యాఖ్యలగురించి తరవాత మాటాడుకుందాం.
నువ్వు నీకథ, అయిదోగోడ తీసుకుంటే, అందులో నువ్వు కూడా ఇలాగే చేస్తున్నట్టు అనిపించింది నాకు. నువ్వే ఆతరవాతిటపాలో రాసినట్టు, వయసుమళ్లినమగవాడు మళ్లీ పెళ్లి చేసుకోడంమీద చాలా కథలే వచ్చాయి కానీ వయసు మళ్లినస్త్రీ పునర్వివాహం చేసుకోడంమీద కథలు రాలేదు. అంచేత అది తప్పకుండా రాయవలసినకథ అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు?
నువ్వు కథలు రాయడం మొదలుపెట్టినప్పటికీ, ఇప్పటికీ ఏమయినా తేడా వుందా? ఈనాటి విమర్శనాపద్ధతులగురించి నీ అభిప్రాయం ఏమిటి? ఇజాలు ప్రాతిపదికగా మంచికథ రాయడం సాధ్యం కాదా? మరోలా అడగాలంటే, చిన్నకథల్లో సిద్ధాంతపరంగా చర్చ చొప్పించి ఒప్పించడం సాధ్యమే అంటావా?
కల్పనః నా కధలు ప్రధాన అలోచనా స్రవంతిని ప్రశ్నించటం వల్ల కొంత భిన్నంగా కనిపించవచ్చు. చాలామందికి నా కధలు నచ్చకపోవచ్చు, నేను తీసుకునే ఇతివృత్తాల వల్ల. అయితే ఇలా ప్రశ్నించే కధల్ని ఏదో ఒక ” ఇజం” ముద్ర వేసి వాటికి సాహిత్య విలువ లేదని చెప్పేయటం తెలుగు నాట కొందరు విమర్శకులకు, ఇప్పుడు కొత్తగా కొందరు బ్లాగ్ పాఠకులకు అలవాటైపోయింది. అసలు “ఇజాలు” మనుషులకోసం పుట్టాయా? లేక మనుషులు “ఇజాల”కోసం పుట్టారా? ఒక కధలో “ఇజం” వుంది అని ముద్ర వేసి వెలి వేసేవారు, మౌనంగా కూడా తిరస్కరించేవారు, ఫలానాచోట మీరు “ఇజం” మాట్లాడారు, లేదా కధలో బలవంతంగా చొప్పించారు అని చూపిస్తే, నిజంగా ఏ రచయత అయినా అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ తప్పును దిద్దుకునే అవకాశం వుంటుంది.
Marital rape గురించి మాట్లాడటం ఇజమా? ఒక స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవడం అంత సులభం కాదు. దానిచుట్టూ బోలెడన్ని మనకే తెలియని myths వున్నయని చెప్పటం ఇజమా?
కాలం ముందుకెళ్ళింది అని జబ్బలు చరుచుకునే కుహనా మేధావులకు కూడా తెలుసు ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలంటే, ఆ పెళ్ళి చుట్టూ అల్లుకొని వున్న అనేకానేకా గృహ, శారీరక, సామాజిక హింసలు. జీవితం వాదన కాదు. కాని కొన్ని సమస్యలు చెప్పేటప్పుడు కధలో పాత్రలమధ్య వాదనద్వారా ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. అది కధనశైలికి నష్టము అయితే కావచ్చు గాక, కాని ఒక అంశం గురించి, అందులో వుండే బాధ గురించి ఎక్కువ అర్ధం అవటానికి అవకాశం వుంటుంది. మీరు చెప్పిన ద్వని, వక్రోక్తి లాంటి వాటితో నేటి తరం స్త్రీలు పడే ఇబ్బందులమీద కధ రాసి మెప్పించటం ఆసాధ్యమేమి కాదు కాని నాకు ఇష్టం లేదు. స్వేచ్చగా open గా మాట్లాడతాయి నా పాత్రలు.
ఇవే కధలు ఒక పురుషుడు రాస్తే, దానికి వచ్చే response ఖచ్చితంగా భిన్నంగా వుంటుందని నేను చెప్పగలను.
ఒక ఏడాదిక్రితం అనుకుంటాను. ఇక్కడే బ్లాగ్ లో ఒక కధ చదివాను. నాకు ఆ బ్లాగుపేరు కాని, రచయితపేరు కాని గుర్తు లేవు. వుంటే తప్పక చెప్పేదాన్ని. ఆ ఇతివృత్తం అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని ఒక చిన్న జోకు గా ఒక సినిమాలో వాడటం వల్ల.
ఇండియాలో వున్న ఒక అమ్మాయి గ్రీన్ కార్డ్ కోసం అది వున్న అబ్బాయిని పెళ్ళి చేసుకొని అమెరికా రాగానే విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కధ అందరికీ నచ్చింది. దానిగురించి రచయిత చెప్పిన వివరణ ఏమిటంటే అలాంటి సంఘటనలు జరిగినట్టు ఆయనకు తెలుసట. నిజానికి అలాంటివి ఎన్నివేలల్లో ఒకటో, రెండో జరగవచ్చు. కాని కధద్వారా చాలామందికి తెలిసేలా ఆ రచయిత ప్రయత్నించారు. ఆ కధకి అర్ధం అమెరికాకు వచ్చే ఆడవాళ్ళంతా అలా చేస్తున్నరనా? లేక ఆయన ఇలాంటి కధలద్వారా స్త్రీలను కించపరుస్తున్నారనా? దీనికి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. నాకు గుర్తు వున్నంతవరకు నేను తప్ప ఆ కధ ఇతివృత్తం గురించి వేరెవ్వరు మాట్లాడలేదు అక్కడ.
అలాగే, ఎవరో ఒకావిడను భర్త ప్రతి రోజు పెట్టే శారీరక హింస గురించి మనం ఒక కధ రాస్తే, ఇలా జరగదు, ఇవి feminism కధలు, అంటూ అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తుంటే అలాంటివాళ్ళకు ఏమి సమాధానం చెప్తాము? మాకు తెలిసిన ఒకావిడకు ఇలా జరిగింది, అది నేను కధ గా రాశాను అని సాక్ష్యం చూపించాలా?
కాబట్టి కధలంటే జీవితాలే. అయితే కొన్ని సంఘటనలు కధలరూపం గా వచ్చినప్పుడు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఒక రచయతగా నాకర్తవ్యం నేను రాయాలనుకున్నది రాసుకుంటూ పోవడమే. ఎక్కడో ఒకచోట నాకధలతో relate చేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ personal letters రాసే పాఠకులు వుంటూనే వున్నారు. వాళ్ళ కోసమే ఆ కధలు.
ఇవి బ్లాగుల్లో నా కధల అనుభవాలు. మరి మీ కధల్ని పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు?
మాలతిః పైన చెప్పేను కదా ఏ కథకయినా పాఠకులు వుంటూనే వున్నారు. అయితే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రధానాంశానికి సంబంధం లేకుండా వుంటున్నాయి. ఉదాహరణకి ఒక వ్యాఖ్యాత నా కథ “నీకోసం”లో నేను stay-at-home dadsని తక్కువగా మాట్లాడేనన్నారు. నిజానికి వాళ్లు పిల్లలని చూసుకోడమో, మరేదో పని ఇంట్లో వుండి చేయగలిగినది చేస్తారు అని స్పష్టంగానే రాసేను. ఆవ్యాఖ్యాత కాస్త శ్రమపడి కథ సరిగ్గా చదివి వుంటే ఆవ్యాఖ్యానం చేసి వుండేవాడు కాదు. ఇలాటి వ్యాఖ్యానాలకి ఏం సమాధానం చెప్తాం? అలాగే మరో వ్యాఖ్య కూడాను. నేను స్త్రీలు నిర్వహించే గృహకృత్యాలని తక్కువ చేసి మాటాడేనన్నారు. కథలో ఆవాక్యం సందర్భం చూడు. అది ధరణి ఆలోచన. ఒకసందర్భంలో ఒకసామెత మనసులోకి రావడం వేరు. రచయిత లేక కథకుడు కేటగారికల్‌గా తనఅభిప్రాయాలు కథలో చొప్పించడం వేరు. ఈధోరణి – పాత్రచేత అనిపించిన మాటని రచయితఅభిప్రాయంగా గుర్తించడం నాకు మొదట అసందర్భంగా కనిపించింది. ఇలాటివి చాలా వ్యాఖ్యలు చూసేక, నాకు తోచింది ఏమిటంటే, నాకథ ఆధారంగా పాఠకులు వాళ్లకి తోచిన ఆలోచనలు వాళ్లు చెప్తున్నారని. నేను చెప్పనివిషయాలు పాఠకులకి స్ఫురిస్తే, వాళ్లు మరోకథ రాస్తున్నారనుకుంటాను. బహుశా, నాకథకి అది మరో ప్రయోజనమేమో.
మరోలా చెప్పాలంటే నాకు వ్యాఖ్యలు మూడురకాలుగా కనిపిస్తున్నాయి.
1. “అలా ఎవరూ మాటాడరు” అలా ఎవరూ చెయ్యరు” అనేవి ఒక రకం. ఇలాటివ్యాఖ్యానాలు చేసేవారు తమకి తెలిసినలోకమే తప్ప అంతకుమించి ఇంకా ప్రపంచం వుందనీ, కొన్ని కోట్లప్రజలు వున్నారనీ, వాళ్లు వేరేవిధంగా ప్రవర్తించవచ్చనీ అంగీకరించలేరు. అలా అంగీకరించడానికి openmindedness కావాలి. దీన్నే “willing suspension of disbelief” అన్నాడు Wordsworth. ఆయన కవిత్వం విషయంలో అన్నా కథకి కూడా కొంతవరకూ అది అవసరమనే నేను అనుకుంటాను. అంటే మన నమ్మకాల్ని, మనకి పరిచయమయిన ప్రపంచాన్నీ కాస్సేపు పక్కన పెట్టేసి, కథలో లీనమయిపోవాలి. కథ చదువుతున్నంతసేపూ ఆకథే మొత్తం ప్రపంచం. అప్పుడే, పాత్రలూ, సంఘటనలూ అర్థం అవుతాయి.
అంతేగానీ, ఎవరో “అలా జరగదు” “మనుషులు అలా వుండరు” అన్నారని నేను వాళ్లకి ఋజువులూ, సాక్ష్యాలూ చూపించి వాళ్లని నమ్మించాలనుకోను. పాఠకులు తమఇళ్లలో ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని తమనమ్మకాలతో రోజులు గడుపుకుంటాం అంటే నేనెవర్ని కాదనడానికి. నేను మాత్రం, నాదృష్టిలోకి వచ్చినవి, నేను రాయాలనుకున్నవి రాసుకుంటాను.
కల్పనః ఇలాటిపాఠకులు కథలలో ఏమిటి ఆశిస్తారంటారు? నేననుకుంటాను, పాఠకులు తమ అభిప్రాయాలకు దగ్గరగా వున్న కధల్ని రచయతలనుండి ఆశిస్తారు. అలా కాకుండా మనం భిన్నంగా చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు.
మాలతిః నిజమే. నేనూ అలాగే అనుకుంటున్నాను. బహుశా తమకి తెలిసినవీ, తమ నమ్మకాలని ధృవపరిచేవి అయితేనే చదివి ఆనందించగలరేమో వారు.
2. ఇక రెండోరకం వ్యాఖ్యాతలు మనకథలోనుండి మరోకోణం లాగుతారు. కథలో ఏదో ఒక అంశమో, వాక్యమో తీసుకుని ఆలోచిస్తూ ఆ ఆలోచనవెంట మరోవైపుకి పోతారు tangentially. ఇలా చెయ్యడంవల్ల నేను కథలో అనుకోని కోణాలు ప్రదర్శితమవుతాయి. ఆ అంశాలు కథలో కలపడానికి అవకాశం లేకపోవచ్చు కానీ, కొత్తవిషయాలు తెలియడం జరుగుతుంది. ఇది కూడా బ్లాగుల్లో మాత్రమే జరుగుతోంది కానీ సాంప్రదాయకంగా విమర్శలు చేస్తున్నప్పుడు కనిపించదు.
3. మూడో రకం వ్యాఖ్యానాలు కథని విశ్లేషిస్తూ చేసినవి. కథలో ప్రధానాంశం, శైలీ, శిల్పంమీద చేసిన వ్యాఖ్యానాలు. ఉదాహరణకి నాకథమీద “ఆకథలో సింప్లిసిటీ లేదు. లోతు లేదు” అన్నవ్యాఖ్య తీసుకో.
ఈమధ్య “లోతు లేదు” అన్నమాట తరుచూ వింటున్నాను. కథలో లోతు ఎలా వస్తుంది అని చాలా ఆలోచించేను. సీదాగా “ధరణి దినకర్‌ని ఉద్యోగం చూసుకోమంది. అతను చూసుకోలేదు.” అంటూ ఏకోన్ముఖంగా కథ చెప్పుకుపోవడం ఒక పద్ధతి. రెండోపద్ధతిలో ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించేడు అని మాత్రమే కాక, అలా ఎందుకు ప్రవర్తించేడు, తన ప్రవర్తనని ఎలా సమర్థించుకుంటాడు, ఆ ప్రవర్తన ఎదటివారికి ఎలా కనిపిస్తుంది, వారికి కలిగిన అభిప్రాయానికి వెనక వారి సమర్థన ఏమిటి – ఇలా విస్తరించుకుపోవడమే కథలో “లోతు” అని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా విస్తరించినప్పుడు కొంత అయోమయానికి ఆస్కారం వుంది కానీ సింప్లిసిటీ సాధ్యం కాదు. నామటుకు నాకు ఆరెండూ పరస్పర విరుద్ధం అనిపిస్తోంది.
కల్పనః మీరు మొదటినుంచి కధారచయిత్రి అయినప్పటికి, బ్లాగ్‌ కోసం నిరంతరం కొత్తగా కూడా కధలు, చిన్న చిన్న స్కెచెస్ లాంటివి, సాహిత్య విమర్శలాంటివి రాస్తున్నారు కాబట్టి మీకు ఈ పాఠకులకామెంట్లు, వారిధోరణి బాగా అర్ధమైనట్టు వుంది. పాఠకులగురించి మీ విశ్లేషణ బావుంది.
అయితే నాకు మాత్రం బ్లాగ్ పాఠకులధోరణి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే, నేను నాబ్లాగుకోసమంటూ, బ్లాగ్ పాఠకుల కోసమంటూ ఏమీ రాయలేదు. నేను వేరే పత్రికలకోసం ఇంతకుముందు రాసినవి, ప్రచురితమైనవి ఇక్కడ నాబ్లాగ్‌లో పెట్టుకుంటున్నాను.
మాలతిః ఈనాటిసంపాదకులధోరణిలో మార్పు వచ్చింది కదా. నీ అనుభవంలో ఆమార్పువల్ల లాభనష్టాలు ఏమిటంటావు?
కల్పనః సంపాదకుల ధోరణి అంటే పండితారాధ్యుల, పురాణం, నార్ల, పొత్తూరి, ఏబికే, దీక్షితులు, రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, వేమూరి బలరాం, కనకాంబరరాజు ఇంతమందిగురించి నాకు అంతో, ఇంతో బాగానే తెలుసు. అంటే వ్యక్తిగతంగా తెలియటం కాదు, సంపాదకులుగా వారి వారి పధ్ధతులగురించి. కధల ఎంపిక గురించి నాకన్న మీరే ఎక్కువ వివరాలు చెప్పగలరు.
మాలతిః లేదులే. ఏవో ఒకటి రెండు పేర్లు విన్నవే అయినా వారిగురించి నేను చెప్పగలిగినది అట్టే లేదు. నాఅనుభవం చెప్తాను. నాచిన్నతనంలో సంపాదకులు వ్యక్తిగతంగా పరిచయం వున్నరచయితలకి సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆరోజుల్లో గోరాశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు, పురాణం వంటి పత్రికాసంపాదకులు ఏవో చిన్న చిన్న సూచనలు చేసేరనుకుంటాను. కానీ, నాకు అలాటి పరిచయాలు లేవు కనక నాకథలు అంగీకరించడమో, అంగీకరింపబడకపోవడమో మాత్రమే జరిగేది. అంతే.
నాకు తెలిసి, సంపాదకులు, అదీ నెట్ పత్రికలే విస్తృతంగా సూచనలు ఇవ్వడం ఇప్పుడే మొదలయింది. ఒకొక్కప్పుడు మంచి తప్పులే ఎత్తి చూపుతున్నారు. నా “పెంపకం”కథలో ఒకే పాత్రకి రెండు పేర్లు పెట్టేను పొరపాటున. అలాగే, “నాకోసం” కథలో దినకర్ ఉద్యోగంవిషయంలో టైమ్‌లైను సరిగ్గా చూసుకోలేదు. ఇలాటివి ఎత్తి చూపితే సంతోషంగా అంగీకరిస్తాను. ఇవి factual errors కనక. కానీ, కథలో సన్నివేశాలూ, శైలీ మార్చమనడం, ఎంత మర్యాదగా చెప్పినా ఉచితం కాదనే నానమ్మకం. రచయితలే అలాటి కోణాలగురించి అడిగితే అది వేరే దారి.
నాకు మరొక సందేహం కూడా వస్తోంది. సంపాదకులు ఒక కథమీద సూచనలు ఇస్తున్నప్పుడు వారు తమ పాఠకులని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారా, లేక, తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారా? అని. ఇలా తాము సంస్కరణలు సూచించి, అలా సరిదిద్దబడినకథని పాఠకులు ఇతోధికంగా ఆదరిస్తున్నట్టు దాఖలాలు ఏమైనా వున్నాయా?
ఈమధ్య “మంచికథలు రావడంలేదు” అన్న అభియోగం తరుచూ వింటున్నాం. మరి సంపాదకులు ఇలా పూనుకుని కథలు సరిదిద్దడంమూలంగా కథల్లో వాసి ఏమైనా పెరిగిందా?
నేను కూడా సంపాదకురాలినే కనక, నేను ఏం చేస్తున్నానో చెప్తాను. తూలికకి వచ్చిన అనువాదాలు చూసినప్పుడు రెండు అంశాలు చూస్తాను.
(1) కథాంశం నా సైటుపాలసీకి అనుగుణంగా వుందా, లేదా?
(2) అందులో భాష మనసంస్కృతి తెలియనివారికి అర్థం అయేలా వుందా, లేదా? అని. లేకపోతే ఒకటో రెండో పేరాల్లో నేను కొంత మార్చి చూపిస్తాను ఎలా వుంటే బాగుంటుందనుకుంటున్నానో. అయినా అది వేరే ప్లాట్‌ఫారం కనక నా పాలసీ ఇక్కడ పనికిరాదేమో.
సరే, కల్పనా, ఇలా మాటాడుతూంటే, మనకి అర్థమవుతున్నది మంచి కథ అన్న పదానికి నిర్దుష్టమయిన ఒక నిర్వచనం లేదనే. పాఠకులు ఎంతమంది వున్నారో అన్ని నిర్వచనాలు. ఇక్కడ పాఠకులంటే చదివేవారందరూ, రచయితలూ, సంపాదకులతో సహా. ఇప్పటికే చాలా పెద్ద చాటు అయిపోయింది. ఈనాటికి సరిపెడదాం. ఇంక ఇది చదివిన పాఠకులు ఏమంటారో చూద్దాం..
http://pustakam.net/?p=1460
తానే ఒక తిలక్ అయిపోయిన వైదేహి కి !
వెన్నెల, జలపాతాలు, ప్రకృతి సౌందర్యం వీటిని ఇష్టపడి ప్రేమించని వారెవరు? ఆరాధించనివారెవ్వరు? అయితే అందరూ చేయలేని పని ఒకటుంది. అది వెన్నెలని కవిత్వం గా, కవిత్వాన్ని వెన్నెల గా మార్చగలగటం. ఆ ఆల్కెమి తెల్సిన మంచి కవుల్లో వైదేహి ఒకరు.  ఇప్పటికే చాలా మంది ఇటీవల వైదేహి కవిత్వాన్ని సమీక్షించారు. అవి నేను కూడా చదివాను. అయితే అవేమి ఇప్పుడు నేను వైదేహి కవిత్వాన్ని గురించి రాస్తున్నప్పుడు నాకు గుర్తు లేవు. ఇప్పుడు నేను రాస్తున్న ఈ నాలుగు మాటలు కూడా ఎవరికీ గుర్తుండవు. ఎందుకంటే అప్పటికే అందరి మనస్సుల్లో వైదేహి  కవిత్వం గుర్తుండిపోయింది కాబట్టి. ఈ కారణం చేతనే నాకు కవిత్వాన్ని సమీక్షించుకోవటం ఒక్కోసారి అనవసరమనిపిస్తుంది. కవిత్వం ప్రధానం గా అనుభూతి ప్రక్రియ. ఆ అనుభూతిని అనుభవించటమే తప్ప ఇంకేమి చేసినా ఆ సహజ సౌందర్యం ముందు నిలబడవు.
అందుకనే వైదేహి ఏం చేసిందంటే తిలక్ ని, అతని కవిత్వాన్ని, ఆ కవిత్వం లోని వెన్నెల సొబగులని, సౌందర్య జలపాతపు వొంపు సొంపుల్ని తన మనసు లోతుల్లోకి వొంపేసుకుంది. తనూ, తిలక్ ఇక ఒకటై పోయారు. తానే ఒక తిలకై పోయారు. ఇక మనమేం  మాట్లడతాము? ఒక్క తన కవిత్వపు నిషాలో మత్తెక్కి పోవటం తప్ప. ఎంత అందంగా అనుభూతించగలిగింది, ఎంత బాగా అక్షరీకరించగలిగింది అని తన్మయత్వంతో మురిసిపోవటం తప్ప. తన కవిత్వం చదివిన తర్వాత ఇప్పటి దాకా ఏమీ రాయకుండా నేను చేసింది అదే.
(మనందరికీ ఇష్టమైన ఇస్మాయిల్ గారి అవార్డ్ ని అందుకుటున్న మన వైదేహి కి ప్రేమతో, స్నేహంతో ఈ నాలుగు వాన చినుకుల్లాంటి మాటలు)
తెలుగు కథాచర్చ -మొదటి భాగం
తెలుగు కధల గురించి నిడదవోలు మాలతి గారితో నా చాట్ ‘పుస్తకం ‘ లో ఇప్పటికే ప్రచురితమైంది. అది మళ్ళీ ఇక్కడ రెండు భాగాల్లో…
కథావిమర్శ (చర్చ)-మొదటిభాగం: రచయితలూ, పాఠకులూ
(ఈ చర్చ ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లు అయిన నిడదవోలు మాలతి గారికీ, కల్పన రెంటాల గారికీ మధ్య జరిగింది. పుస్తకం.నెట్ కోసం అడగ్గానే ఒప్పుకుని ఈ చర్చ జరిపినందుకు వారిద్దరికీ మా తరపున ధన్యవాదాలు. ఈ చర్చ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం – “రచయితలూ,పాఠకులూ” ఇప్పుడు వేస్తున్నాము. రెండో భాగం త్వరలో. – పుస్తకం.నెట్)
మాలతిః కల్పనా, అసలు రచయిత, నువ్వే అనుకో, కథ కానీ కవిత కానీ నీకోసం రాసుకుంటావా, పాఠకులని దృష్టిలో పెట్టుకుని రాస్తావా?
కల్పన: మాలతిగారు, నేనైతే మొదట నాకోసమే రాసుకుంటాను. అయితే అది ప్రచురణకు పంపితే మాత్రం తప్పకుండా పాఠకులగురించి కూడా ఆలోచిస్తాను. వాళ్ళు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని.
మాలతిః నేను నాకు ఏదో రాయాలన్న తపన కలగడంచేత రాస్తాను. మరి “పాఠకులకోసం” అన్నది కనీసం నావిషయంలో, పూర్వం లేదు. ఇప్పుడు బ్లాగు మొదలుపెట్టినతరవాత, కొందరు పాఠకులు తప్పనిసరిగా మనసులో మెదులుతున్నారు. ప్రచురణకి పనికివస్తుందా రాదా అన్నఆలోచన లేదనే అంటాను నాకైతే. బహుశా వాళ్లు ప్రచురించకపోతే నేనే ప్రచురించుకుంటాను అన్న ధీమా కావచ్చు. ప్రతి కథకీ కొందరు పాఠకులు వుండకపోరు అని కూడా నానమ్మకం. మరి కవితలు కూడా అంతేనా నీవిషయంలో?
కల్పన: కొంతలో కొంత, కథ వేరు, కవిత వేరు అనుకుంటాను. కవిత మాత్రం ఎప్పుడూ మొదట మనకోసమే రాసుకుంటాము. కధ మాత్రం ప్రధానంగా సమాజం నుంచి పుడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది చదివినవాళ్లకు ఈకధ ఏమనిపిస్తుంది? ఎలా అర్ధం చేసుకుంటారు? లాంటివి తెలిసి కాని, తెలియకుండానే కాని ఆలోచిస్తామని నేను అనుకుంటాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కధ రాసేటప్పుడు నేను రచయతని. నా కధను నేనే విమర్శించుకునేటప్పుడు నేనే విమర్శకురాలిని. ఆ తర్వాత నేనే పాఠకురాలినైతే ఈ కధ ఎలా అనిపిస్తుంది అని కూడా ఆలోచిస్తాను. మూడు చోట్లా సంతృప్తి కలగటం అనేది వుండకపోవచ్చు. అలాంటప్పుడు నేను రచయత పాత్రకే కట్టుబడి అవసరమైనమార్పులు చేసుకుంటాను. కధ రాసేటప్పుడు నాపాత్ర అదే. అసలు రాజాస్థానాలు, పత్రికలూ, ప్రచురణలు, బ్లాగులు లేనప్పుడు రచయితలు ఎలా ఆలోచించి వుండేవారనుకుంటున్నారు?
మాలతి: మంచి ప్రశ్నే. నువ్వన్నట్టు కథ వేరూ, కవిత్వం వేరూ అంటే వాటిని వేరేరకంగా ఆలోచించాలి. ఉదా. వేమన … అలాకాక, కథలు పెద్దవాళ్లు పిల్లలకి లోకరీతి నేర్పడానికి మొదలుపెట్టేరేమో. అంటే అవే ఆనాటి వ్యక్తివికాసంపాఠాలు అన్నమాట. మరి పాఠకులకోసమే అనుకుంటే, నువ్వు నీకథలని వాళ్ల అభిప్రాయాలకి అనుగుణంగా మారుస్తావా?
కల్పనః వేమన అయినా సుమతీశతకకారుడైనా తమకోసం మాత్రమే రాసుకుని వుంటారని నేననుకోను. లోకానికి చెప్పటంకోసం కూడా రాసి వుంటారు.. అది కూడా ఎవరోఒకరికి చదివి వినిపించటం, అలా మౌఖికంగా సాహిత్య ప్రచారం ఆ రోజుల్లో జరిగేది కాబట్టి పాపం వాళ్లకు పాఠకుల కామెంట్లగొడవ లేదేమో. అలాగే కధ ప్రయోజనం మొదటినుంచి కూడా సమాజం పోకడల్ని చెప్పటమో, నీతిని బోధించటమో అయివుండవచ్చు. ఆరోజుల్లో అది పర్సనల్ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు కధ స్వరూపం, ప్రయోజనం కూడా మారాయి కదా. మరి కథగురించి మన ఆలోచనలు మారాల్సిన పని లేదా?
మాలతి: కథప్రయోజనం ఎలా మారిందంటావు? స్వరూపం మారినట్టు కనిపించినా అది పైపైమార్పే అంటాన్నేను. ఆరోజుల్లోనూ ఈరీోజుల్లోనూ కూడా కథకుడు తనభాషలో తనధోరణిలో చెప్పడమే కదా. ఎటోచ్చీ, సంపాదకులూ, ప్రచురణకర్తలూ లేనిరోజుల్లో నిబంధనలు కూడా లేవు. అంచేత రచయితకి ఎక్కువ స్వేచ్ఛ వుండేది అప్పట్లో.
కల్పన: ఇదివరకు కధకి సామాజికప్రయోజనమే మొదటిలక్ష్యం, బహుశా అదొక్కటే లక్ష్యం కూడా అయివుండవచ్చు. అప్పుడు కూడా అది రచయతని బట్టే వుంటుందనుకుంటాను.. అయితే కాలానుగుణంగా అది ఎంతో కొంత మారింది. ముఖ్యంగా అస్తిత్వచైతన్యం వచ్చాకా.
మాలతి : అస్తిత్వం, చైతన్యం ఒక భావన. దానిఆంతర్యం కూడా వ్యక్తివికాసమే కదా.
కల్పన: అస్తిత్వం, చైతన్యం ఇవి వ్యక్తిత్వవికాసంలో భాగమే.. అయితే వ్యక్తీకరణలో తేడా వుంటుంది కదా! స్త్రీలు, దళుతులు, ముస్లిమ్‌లు తమబాధల్ని, తమగాధల్ని చెప్పుకుంటున్నప్పుడు అందరికీ నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళవేదనని చెప్పితీరతారు. చెప్పితీరాలి. మొదటినుంచి సాహిత్య ప్రయోజనమ్ సామాజికప్రయోజనమే అయినా రచయితలు సామాజికప్రయోజనం కోసమ్ రాసినా, వాళ్ళ ఇష్టాఇష్టాలు, వాళ్ళ స్వేచ్ఛ అంతర్లీనంగానైనా వాడుకునేవారు.
మాలతి : మరొకమాట అడుగుతాను. నువ్వు కథ రాసినప్పుడు కొందరయినా అఫెండ్ అవుతారేమో అనుకుని మార్పులు ఏమైనా చేస్తావా, నీకు ఏం రాయాలని వుందో అదే యథాతథంగా రాస్తావా?
కల్పన: ఎవరో బాధపడతారని నేను కధ మార్చిన సందర్భాలు లేవు కాని మధ్యతరగతినుండి రావడంవల్లనేమో మొదట నాకు నా కుటుంబసభ్యులు మాత్రం గుర్తు వస్తారు. మా అన్నయ్యలు, తమ్ముడు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ఈ కధ చదివి ఎలా మాట్లాడతారో మాత్రం నాకు ఠక్కున తెలిసిపోతుంది. అదొకరకమైన అప్రకటిత censorship. ఈ సెన్సార్ షిప్ కుటుంబం ఒక్క దాని నుంచే కాకుండా సామాజికంగా కూడా వుంటుంది. స్త్రీలుగా ఎలాంటి విషయాలగురించి రాయవచ్చు, రాయకూడదు, ఏవిధంగా వ్యక్తీకరించవచ్చు లాంటివి. మొదట్లో అది నామీద చాలా ప్రభావం చూపించేది. చాలా విషయాలు రాయడానికి సంకోచించేదాన్ని. క్రమేపి దాన్ని అధిగమించాననే అనుకుంటున్నాను. ఆరకంగా కొన్ని మార్పులు రాసేటప్పుడో, ఆ తర్వాతో మనం తెలిసి కాని, తెలియకుండానో కాని చేసేస్తుంటాము. అది ఇతివృత్తాన్ని, రచయితనిబట్టి కూడా వుంటుంది.
మాలతి: నా అభిప్రాయం కూడా అదే. చెప్పేతీరులో మార్పు వుంటుందేమో కానీ ప్రాథమికంగా చెప్పదలుచుకున్నవిషయంలో మార్పు వుండదనే అనుకుంటాను. పైగా నువ్వన్నట్టు కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఈకథని ఎలా స్వీకరిస్తారన్న ఆలోచన నాక్కూడా కొంతవరకూ ఉండొచ్చు. గట్టిగా చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే నిజజీవితంలోమాటాడినప్పుడు తూచి మాటాడినట్టే రాసినప్పుడు కూడానేమో. నాకు మరో సందేహం. రచయిత తనకథని మరొకరికథ విమర్శిస్తున్నంత నిష్పాక్షికంగా విమర్శించుకోగలడా అని.
కల్పన: నేను అయితే నో అనే సమాధానమిస్తాను. ఎవరికధగురించి వాళ్ళకు తెలిసినట్టుగా వేరేవాళ్లకధగురించి తెలియదు. మీకధ నాకు నాస్థాయినిబట్టి అర్ధమవుతుంది. నాకు మీకధ అర్ధమ్ చేసుకునే స్థాయి లేకపోతే నాకు ఆకధ అర్ధంకాదు. అందుకని కూడా పాఠకులు వివిధస్థాయిల్లో వుంటారు కాబట్టి వాళ్ళందరికి అర్ధమయ్యేలా, లేదా వాళ్ళందరిమెప్పుకోసం కధ రాయాలని యే రచయితా ప్రయత్నించరు.
మాలతి: నామటుకు నేను నాకథ పదే పదే చదువుకుంటాను. అది ఇప్పుడు వచ్చిన అలవాటేలే. పూర్వం రాసింది రాసినట్టు పంపేయడమే. ఇప్పుడు చదువుకోడం వచ్చేక, అలా చదువుకుంటున్నప్పుడు ఎక్కడ బాగులేదు. ఎక్కడ మరింత స్పష్టం చెయ్యాలి అన్నఆలోచనలు వస్తున్నాయి. నేనంటున్నది అది కూడా ఒకరకంగా స్వవిమర్శే కదా. అస్సలు బాగులేదు అనుకుని పక్కన పెట్టేసేవి కూడా వుంటాయి. నువ్వు స్థాయి అంటున్నావు. నేను అనుభవాలూ, పరిస్థితులూ, వారి ఆలోచనాధోరణిలో గల పరిమితులు అనుకుంటాను. అంతేనా?
కల్పన: మీరన్న అనుభవాలు, పరిస్థితులు, అవగాహన, వీటినే నేను స్థాయి అన్నాను. తక్కువ, ఎక్కువ అన్న వుద్దేశంతో మాత్రం కాదు. మీరు మీకోసమే కధ రాస్తాను అన్నారు. కాని బ్లాగులో రాయడం మొదలుపెట్టాక మీరు కధ రాసేటప్పుడు అంతకుముందు కధకి పాఠకులవ్యాఖ్యలు ఏదో ఒకరకంగా మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి అని నేననుకుంటాను. అలా మీకు తెలిసి మీకధలో మీకు మీరుగా ఏం మార్పులు చేసారు? అలా మార్పులు చెయడంవల్ల మీకధ మంచి మార్పుకి గురైందా? లేక వాళ్ళవల్ల మీకధ మీరు అనుకున్న విధంగా కాకుండా మరో రకంగా రాయాల్సి వచ్చిందా? అసలు ఈకధల్లో వస్తున్న మార్పులకు పాఠకులు ఎంతవరకు కారణం? అని మీరనుకుంటున్నారు?
మాలతి: అమ్మో, పెద్ద ప్రశ్న వేసేవు. నేను బ్లాగు మొదలు పెట్టింతరవాత జరిగిందేమిటంటే – ఏదో పాతతరం రచయిత్రి అని కాకుండా, ఈనాటియువత నాకథలని ఆదరించడం. వాళ్లు రాసే వ్యాఖ్యలనిబట్టి కొంతవరకూ నేను చెప్పేతీరులో మార్పు వచ్చింది. వైదేహీ, రాధిక ఈమాటే అన్నారు. నేను కావాలని పనికట్టుకు చేసింది సంస్కృతసమాసాలూ, అవీ కాస్త తగ్గించడం  . అందువల్ల నాకథ మెరుగుపడిందా అంటే చెప్పడం కష్టం. ఈపాఠకులు వేరు. నిజానికి మంచి ఉదాహరణ నా ఉసుపోక కతలు చూడు. బ్లాగుపాఠకులు విశేషంగా ఆదరించారు ఆశీర్షికని. అదే ఆంధ్రాలో ఒక ప్రచురణకర్తకి మాఅన్నయ్య చూపిస్తే, అందులో హాస్యం లేదండీ అన్నారుట. అంటే వారిదృష్టిలో ప్రింటుపుస్తకాలు చదివే పాఠకులని ఆకర్షించగల హాస్యం కాదనే కదా. ఈనాడు కథల్లో వస్తున్నమార్పులకి ఎక్కువగా బాధ్యులు ఇంగ్లీషుపుస్తకాలు చదివి ఆ ఒరవడిలో ఆలోచించే పాఠకులు. వీరిలో కొందరికి అసహనంపాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది ఒకొకప్పుడు. వెనక ఒకసారి ఒక పాఠకుడు “మాకు అర్థంఅయేలా రాయండి చదువుతాం”, అన్నారు నాకథగురించి. ఇలాటి వ్యాఖ్యలు చేసి పాఠకులు నారచనావిధానంలో మార్పు తేలేరు. నిజానికి నారచనావిధానంలో, నాశైలిలో మార్పులు ఏమైనా వుంటే, దానికి కారణం నా వ్యక్తిగతపరిస్థితులూ, నాచుట్టూ వున్న పరిస్థితులే అని చెప్పాలి.
కల్పన: అంటే మీభాషలో మార్పు వచ్చింది అంటారు. మీరు చెప్పేది పాఠకులకు అర్థం కావాలంటే వాళ్ళకు ఎలా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పాలి అంటారు. మీదగ్గర పాతతరానికి సంబంధించిన మంచి భాష,నుడికారం వున్నాయి. కాని, అవి వీళ్ళకు పెద్దగా అర్థం కాదు కాబట్టి వాళ్ళకోసం మీరు అందరికి అర్ధమయ్యే భాష రాయాల్సివచ్చింది. మీ కొత్త కధ ’నీ కోసం’ లో కూడా చాలా మంచి పదాలున్నాయి ఈనాటితరంవాళ్లకు తెలిసే అవకాశం లేనివి. ఔద్ధత్యంలాంటివి.
పాఠకులు మీరచనావిధానంలో మార్పు తేలేరు అని మీరు స్పష్టం చేయటం నాకు నచ్చింది. అయితే మీరు ఇక్కడ ప్రధానంగా బ్లాగ్ పాఠకుల గురించి మాట్లాడుతున్నరనుకోండి. అయినా ఇంతకుముందు భారతి టైం నుంచి మొన్న మొన్నటి అంధ్రజ్యోతి లాంటి వారపత్రికల్లో కధల ప్రచురణవరకు తీసుకొని చూస్తే, చాలా తేడా తెలుస్తుంది. భారతి లాంటి పత్రికల్లో కధ ప్రచురించటమంటేనే అది మంచి కధ అని గుర్తింపు. అలాగే అందులో రాసే రచయితలకు ఒక గుర్తింపు, ఒక స్థాయి వుండేది. క్లుప్తం గా చెప్పాలంటే ఇదివరకు పత్రికల్లో ఎంపిక స్థాయి ఆరకంగా వుండేది. పాఠకులఆలోచనలు కూడా భిన్నంగా వుండేవి. అలాగే వారు చదివిన కధలమీద నచ్చినా, నచ్చకపోయినా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు. అంటే కధగురించి ఆలోచించి ఏది బాగుందో, ఏది బాగులేదో ఉత్తరాలు రాసేవారు. ఇలాంటి లేఖలద్వారా కాని, లేదా రచయితలు ఒకరికొకరు రాసుకోవడంద్వారా తమ రచనలమీద అభిప్రాయాలు తెలుసుకోగలిగేవారు. కాని ఇప్పుడు ఈ బ్లాగులవల్ల పాఠకులు ఏమనుకుంటున్నారో, మనకు తెల్లారేసరికి తెలిసిపోతోంది. పత్రికల్లోకంటే బ్లాగులద్వారా ఎక్కువమంది పాఠకులకు మనం చేరుకోగలగటం మాత్రం శుభపరిణామమే.
మాలతిః “పెద్దగా అర్థం కాదు” అనడంలేదు నేను. వారిదృష్టిని అట్టే ఆకట్టుకోదు అనుకుంటాను. ఈనాటిపాఠకులు instant lifeకి అలవాటు పడ్డవారు. ఆలోచించుకునే ఓపిక లేక, ప్రతిదీ స్పష్టంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు అందించమంటారు. అంచేత పూర్వం మనకథల్లో వున్న ధ్వనీ, వక్రోక్తీ ఇప్పటికథలలో కనిపించదు. ఒకవేళ నాలాటివాళ్లం రాసినా, పాఠకులు వెంటనే ఇది నాకు అర్థం కాలేదు, అంటూ వ్యాఖ్యలు కురిపించేస్తారు. పైగా ఇంగ్లీషుమాటలవాడకం మరోబాధ. చాలామందికి అదే “కంఫర్టబుల్‌గా” వుంటుంది ☺. నేను మాత్రం తెలుగుకథ అంటే తెలుగు నుడికారం వెదజల్లేదే అనుకుంటాను. రచయితలు పాఠకులవ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకోవాలంటే, మరి వారు కథని జాగ్రత్తగా చదివి తమఅభిప్రాయాలు రాయాలని రచయితలు ఆశించడంలో తప్పు లేదు కదా. ఏమంటావు?
కల్పన: ధ్వని, వక్రోక్తి ఇవి ఈనాటి కధల్లో వినిపించవు, కనిపించవు. ఆమాటకొస్తే అసలు అవి ఎలా వాడాలో కూడా నాలాంటి వర్ధమానరచయితలకి తెలియదు. మీకాలపు రచయితలు అలాంటివాటితో ఈనాటి కధలు రాయడం మా అదృష్టం అనుకుంటాను. మీకధా రచన, నైపుణ్యం, భాష మాకు కూడా కాస్త ఇలా ఒక చేత్తో ధారపోయవచ్చు కదా. కాస్త జాగ్రత్తగా కధ చదివి, ఆ పైన ఆలోచించి కామెంట్ పెట్టండి అని అంటే అర్ధం చేసుకునే సహృదయత ఈనాటి బ్లాగ్ పాఠకులకు వుందంటారా?
మాలతి: చేత్తో ధారపోయవచ్చు కదా – హాహా. మంచి జోకే. తాతకి దగ్గులు నేర్పడం అంటే ఇదే.
పాఠకులవ్యాఖ్యలవిషయం – అదే నేను కూడా అంటున్నది. పూర్తిగా కథ చదివి, ఆలోచించి రాసే వ్యాఖ్యలని రచయితలు తప్పకుండా గణనలోకి తీసుకుంటారు. “రచయితలు మెప్పు అయితేనే గ్రహిస్తారు కానీ తప్పులు చూపితే ఒప్పుకోరు” అన్నమాట నేను అంగీకరించను. వ్యాఖ్యలు కథలో వస్తువుకో, శైలికో సంబంధించినవి అయితే రచయితకి తనకథని మరోసారి తరిచి చూసుకోడానికి ఆవకాశం వుంటుంది. అంతే కానీ “ఇలాటిపాత్రలు వుండరు”, “ఇలాటి సంఘటనలు జరగవు,” “ఎవరూ ఇలా మాట్లాడరు” అంటే దానికి ఏముంది జవాబు చెప్పడానికి. రచయిత అలాటి పాత్రో, సంఘటనో చూసినందువల్లనే కదా రాసింది.
కల్పన: ఒక కధ చదివాక, పట్టుమని ఎవరైనా పది నిమషాలైనా ఏమిటి ఇందులో చెప్పింది? చెప్పాలనుకుంది? అని ఎవరైనా ఆలోచిస్తారంటారా? వూరికే నాసందేహం అది. ఎందుకంటే నేను చదవగానే కామెంట్ పెట్టలేను. ఆలోచించాకా పెడదాము అనుకుంటాను. ఈలోగా మర్చిపోతాను కూడా చాలాసార్లు. అలా జరుగుతుందనే తొందర్లో అలా వెంటనే కామెంట్ పెట్టెస్తారేమో?
మాలతి: అలా అనిపించడంలో తప్పులేదు. ఆలోచించి వ్యాఖ్యలు పెట్టేవారికోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. లేకపోతే బాగుందనో, పరవాలేదనో సరిపెట్టేసినా ఫరవాలేదు. కానీ సగం సగం చదివి, వ్యాఖ్యలు రాసేస్తే ఏం చెయ్యడం? తప్పనిసరిగా నేను కథలో ఫలానా చోట చూడండి మీకు సమాధానం కనిపిస్తుంది అని చెప్పాలి. అసలు పాఠకులకి ఎందుకింత తొందర? ఇక్కడే బ్లాగులోకంలో పాఠకులధోరణి వేరుగా కనిపిస్తున్నది. రచయిత రాసింది అర్థం చేసుకుందాం అన్నతపన కంటే తమకి తెలిసింది చెప్పాలన్న తపన ఎక్కువేమో అనుకుంటున్నాను నేను. నాచిన్నతనంలో మేం రచయిత ఏం చెప్పేడు అన్న దృష్టితో చదివేవాళ్లం. కొత్తవిషయం తెలిస్తే ఓహో అలాగా అనుకునేవాళ్లం. లేకపోతే, సరే అని మరోకథకి తరలిపోయేవాళ్లం. ఈనాటి మీడియా సౌకర్యంవల్ల క్షణాలమీద ప్రశ్నలు గుప్పించేయడం జరుగుతోంది. రెండోది వస్తున్న కథలసంఖ్య కూడాను. వారానికి కొన్నివందలకథలు విడుదల అవుతుంటే, అందులో పదోవంతయినా చదివి ఆలోచించుకునే తీరికేదీ?
కల్పన: కాబట్టి ఎక్కువ కధలు రావడం ఒకందుకు మంచిది, ఒకందుకు చెరుపు చేస్తోందన్న మాట.
మాలతిః అలాగే వుంది చూస్తుంటే. కనీసం పాఠకులకి ఆలోచించుకునే వ్యవధి లేకుండా చేస్తున్నాయి అనాలి. ఆదృష్టితో చూస్తే, నాకు మరొకసందేహం వస్తోంది. కథలకి సాంఘికప్రయోజనం వుండాలి అనుకుంటే, గబగబ క్షణాలమీద చదివి పక్కన పెట్టేస్తే మనం ఆశించిన సాంఘికప్రయోజం ఎలా సాధ్యం? పాఠకులు ఆలోచించుకోడం, విశ్లేషించుకోడం, తమ జీవితాలకి అన్వయించుకోడం – ఇవన్నీ టైము వుంటేనే కదా సాధ్యం.
అసలు ఎలాటి కథలు వస్తున్నాయి, ఏవి “మంచికథలు” అని ఎవరు నిర్ణయిస్తున్నారు అన్నవిషయం వివరంగా మరోసారి చర్చించాలి మనం..
(సశేషం)
http://pustakam.net/?p=1456
నా రహస్య వాన ఇంగ్లీష్ లో…
నా కవిత రహస్య వాన కు pavada blogger crazyfinger అనువాదం చేసారు. నా రహస్య వన కవిత నా బ్లాగ్ లొనే వుంది. ఇంగ్లిష్ అనువాదం ఇక్కడ చూడండి.
http://www.pavada.in/2009/10/rahasya-vaana-by-kalpana-rentala-english-version.html
సారీ వసంతా!
బాలగోపాల్ కన్నుమూత–ఒక నమ్మలేని నిజం. మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించి ఇక సెలవంటూ చెరగని సంతకం పెట్టి వెళ్ళిపోయిన ఆత్మీయ మిత్రుడు బాలగోపాల్ మరణం సామాజికం గా ఒక పెద్ద లోటే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు, అఫ్సర్ కి  ఒక పెద్ద షాక్.
బాలగోపాల్ సహచరి వసంత నాకున్న మంచి స్నేహితుల్లో ఒకరు. విజయవాడ నుంచో, అనంతపురం నుంచో హైదరాబాద్  వెళితే మా మకాం వసంత ఇంట్లోనే. అప్పుడు బాలగోపాల్ తో ఎన్నో వ్యక్తిగత జ్ఞాపకాలు. బాలగోపాల్ ఉద్యమ జీవితం గురించి, పీడిత ప్రజల పట్ల ఆయన నిబధ్ధత గురించి పత్రికల్లో వివరంగా వ్యాసాలు వచ్చాయి. కాబట్టి ప్రత్యేకంగా నేనిక్కడ మళ్ళీ రాయనక్కరలేదు. నాకు బాలగోపాల్  కుటుంబంతో వున్న వ్యక్తిగత జ్ఞాపకాలు కొన్ని పంచుకోవటం నాకు దుఖ్ఖోపశాంతి.
నాకు, వసంత ల మధ్య స్నేహం ఎన్నో ఏళ్ళది. ఇన్నేళ్ళ స్నేహంలో ఎన్నొ మరణ వార్తల్ని ఇద్దరం కలిసి పంచుకున్నాము. మా సహచర జర్నలిస్టు మిత్రులు అర్ధాంతరం గా కన్ను మూసినప్పుడు ఎన్నో సార్లు కలిసి బాధపడ్డాము. అలాంటిది ఇప్పుడు తనకే ఒక దుఖ్ఖం వచ్చినప్పుడు నేను తన దగ్గర లేకపోవటం, ఇంత దూరం నుంచి కేవలం ఫొను లో నాలుగు పొడిపొడి మాటలు మాట్లాడటం కూడా సాధ్యపడలేదు. సహచరుడ్ని  పోగొట్టుకున్న స్నేహితురాలిని పొదివి పట్టుకోవాలని ఎవరికి వుండదు? వాళ్ళ అబ్బాయి అజుబా  ఇంటర్ చదువుతున్నా, వాడిలోని ఆ పసితనపు ఛాయలు  ఈ దుఖ్ఖాన్ని ఎలా తట్టుకుంటాయా అని మా ఆవేదన.
మంచి సంప్రదాయ పండిత వంశంలో పుట్టి కూడా, ఆ వారసత్వాన్ని, ఆ ఛాందస భావాల్ని వదిలించుకొని ఆశయాల్ని, ఆదర్శాల్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన మనీషి మన బాలగోపాల్.బాలగోపాల్ కి తన వ్యక్తిగత జీవితమంటే లెక్క లేదు, తనకేమైనా పర్వాలేదు, తాను నమ్మిన సిధ్ధాంతం, తననే నమ్ముకున్న బాధితులే ఆయనకు ముఖ్యం. అప్పటి స్పీకర్ బాలయోగి విమాన ప్రమాదం లో మరణించినప్పుడు మేమంతా వసంత ఇంట్లో మాట్లాడుకుంటున్నాము. ఆ సమయంలో పొరపాటున నా మాటల్లో బాలయోగి అనబోయి బాలగోపాల్ అని వచ్చేసింది. వెంటనే సారి చెప్పి సరిదిద్దుకున్నాను.అయితే అప్పుడు బాలగోపాల్ అన్న మాట ఏమిటో తెలుసా…సారి ఎందుకు? నన్ను కూడా ఎప్పుడో ఒకప్పుడు చంపేస్తారని నాకు తెలుసు అని తాపీగా, నిశ్చింతగా అనేసారు. ఆ మాట విని నేను దిగ్భ్రాంతి చెందాను. ఆయనకు మరణం అంటే లెక్కలేనిది అని చాలా మాములుగా ఎందరి గురించో అనేస్తుంటాము. కాని నిజానికి ఆ సందర్భం వస్తే ప్రతి ఒక్కరు ఎంతో కొంత జంకుతారు. కాని ఆ రోజు ఆయన నాతో అన్నట్లు గానే నిర్భయం గా , కష్టసుఖాల్లో తనతో కలిసి నడిచిన తన సహచరి వసంతకి , తను అమితంగా ప్రేమించే కొడుకు అజుబా కి ఏమి చెప్పకుండానే వెళ్ళిపోయారు.
మిమ్మల్నే   నమ్ముకున్న  మీ కుటుంబ సభ్యులు, బాధిత  ప్రజానీకం  ఏమైపోతారిప్పుడు బాలగోపాల్? మా జ్ఞాపకాల్లో మీరిప్పుడు  ఇంకా అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఆవేశం గా మానవ హక్కుల గురించి ప్రసంగిస్తున్నట్లే వుంది. మీ ప్రసంగాల్లో మీరు వాడే బాష ( వైమనస్కం) లాంటి పదాల మీద నేనింకా మీ ఇంట్లో జోకులేసి మాట్లాడుతున్నట్లే వుంది. మేమేమంటున్నా మీరు  పట్టించుకోనట్లు చిరునవ్వుతో అజుబా గాడి చేత హొం వర్క్ చేయిస్తున్న దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది. హోం వర్క్ అంటే ఒకటి చెప్పాలనిపిస్తోంది. సాధారణం గా బాలాగోపాల్ ఏ వీకెండ్ హైదరాబాద్ లో వుండరు.ఆ మాటకొస్తే అసలు ఆయన్ ఇంట్లో వుండేదే తక్కువ. కుటుంబం కోసం, వ్యక్తిగత సుఖసంతోషాల కోసం ఆయన వెచ్చించే సమయం చాల తక్కువ అన్నది ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.  వీకెండ్, సెలవు రోజుల్లోనే కాదు, విడిరోజుల్లో కూడా ఆయన కోసం వచ్చే మనుషులతో , ఫోన్లతో బిజీ బిజీ గా వుంటారు. అంత బిజిలో కూడా ఆయన తప్పకుండా చేసే పనులు నాకు తెలిసినవి రెండు. ఒకటి పొద్దుట నిద్ర లేవగానే వసంత కి కాఫి పెట్టి ఇవ్వటం, రెండొది అజుబాకి తనే లెక్కలు మొదలైన హొం వర్క్ చేయించటం. ఎంత మేధావి ఇంట్లొ, బయటా ఎంత సామాన్యం గా వుంటారు అని నాలాంటి వారెందరో ఆశ్చర్యపోతారు ఆయనను చూసి.
మొన్నామధ్య నేను, వసంత ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఈ సారి మేము ఇండియా వస్తే ఏమేమి  చేయాలో ప్లాన్లు వేసుకున్నాము. కొత్త కొత్త ప్లేసెస్ వెళ్ళి చూద్దామని, అలాగే ఈ సారి వాళ్ళ ఇంట్లో నాకొచ్చిన శాఖాహరపు వంటలు చేసి పెట్టాలని వంతులు వేసుకున్నాము. ఈ సారి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు నిరంతర చైతన్య స్రవంతి లా అటు ఇటు క్షణం కూర్చోకుండా తిరిగే బాలగోపాల్ ఇక వుండడని మనసు కి సర్ది చెప్పుకోవాలి. నిలువెత్తు పుస్తకాల మధ్య , నిరంతరం ఎవరి ఒకరితో సంభాషించే ఆ మనిషి లేకుండా ఆ కుర్చీ ఆయన కోసం ఎదురుచూస్తూ వుంటుంది కాబోలు….
వసంతా! ఇప్పుడు ఈ క్షణంలో మేము హైదరాబాద్ లో మీ ఇంట్లో నీ పక్కన వుండాల్సిన వాళ్ళం ఇక్కడ ఆస్టిన్ లోనో, డల్లాస్ లోనో బాలగోపాల్ సంతాపసభ పెట్టగలమా అన్న ఆలోచనల్లో వున్నాము. ఎవరి మరణ వార్త విన్నా నీకు ఫోన్ చేసి మాట్లాడే నేను ఇప్పుడు మాత్రం ఈ సమయంలో నీకు ఫోన్ చేయలేక, ఫోన్ చేయకుండా వుండలేక అస్థిమితంగా వున్నాను.సారీ వసంతా!.
‘ మాయా ‘ దీపశిఖ!
సాక్షి పత్రికలో ఆగస్ట్ 17 న ప్రచురితమైన ఈ వ్యాసం తాలూకు లింక్
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209Categoryid=1subcatid=3
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=34209&Categoryid=1&subcatid=3
పుస్తకాలంటే కొన్ని అక్షరాలు, పదాలు, వాక్యాల సంపుటి కాదు. జీవితాన్ని అల్లికబట్టి చూపించే అద్దాలు. రచయతలంటే, మనం ఎక్కడో దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచక నిలబడిపోతే, మనకు దిశానిర్దేశం చేసే దీపస్థంభాలు. ఇది అక్షర సత్యమని నిరూపించే రచయతల్లో  ఒకరు మాయా ఏంజలో! ఆమె ఫలానా అంటూ ఎలాంటి  ప్రత్యేక పరిచయం చేయనక్కరలేని విశ్వవిఖ్యాత కవయిత్రి, రచయత్రి,నాటకకర్త,  puliTzer Prize finalist. ఆమెను పాతికడుగుల  దూరం నుంచి చూస్తే, సూది పడితే వినపడేంత నిశ్శబ్దంలో ఆమె మాటలు వింటే , ఆమె వాక్ప్రవాహం ముందు మంత్రముగ్ధులైతే ఎలా వుంటుందో అది స్వానుభవంలోకి రావటం నా అదృష్టం.
అది ఒక అక్టోబర్ ఆకురాలు సాయంకాలం. ఆస్టిన్ లోని యూనివర్శిటి ఆఫ్ టెక్సాస్ లోని  టెక్సాస్ యూనియన్ బాల్ రూం లో ఆమె విశేష ఉపన్యాసం ఏర్పాటైంది.గత నలభై ఏళ్లలో మాయ UT కి వచ్చి ప్రసంగించడం ఇది నాలుగో సారి. open to all అయినా రద్దీ వల్ల అతి కొద్ది మందికి లభించే ఫ్రీ పాస్ లు సంపాదించి అఫ్సర్, నేనూ  మాయా ఏంజలో ప్రసంగానికి వెళ్ళాము. ఫ్రీ పాస్ లతో వెళ్ళినా గంట ముందు వెళ్ళి క్యూ లో నిల్చోవాల్సి వచ్చింది. అక్కడ క్యూ లో నిలబడ్డ అందరి మొహాల్లో ఒక ఉద్విగ్నత కనిపిస్తొంది. నా ముందు నిలబడ్డ  ఒక ఆఫ్రో -అమెరికన్ స్టూడెంట్  ” మీరు ఆమె పుస్తకాలన్నీ చదివారా?” అంటూ పలకరించింది. ఒక్కోసారి ఒక్కో పుస్తకం మనం చదివినప్పటి కన్నా ఆ తర్వాతెప్పుడో జీవితంలో ఏదొ ఒక సందర్భంలో కానీ  అర్ధమైనట్టు అనిపించదని చెపితే పెద్దగా నవ్వేసింది.
యు.టి. టెక్సాస్ యూనియన్ 75 వ వార్షికోత్సవాల సందర్భంగా విశిష్ట వ్యక్తుల ప్రసంగాల్లో భాగంగా మాయా ఏంజలో ప్రసంగం ఏర్పాటైంది. ఆమె వేదిక మీదకు వచ్చినప్పుడు, ప్రసంగించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కూడా  ప్రేక్షకులంతా గౌరవపురస్కారంగా లేచి నిలబడి standing Ovation ఇచ్చారు.దాదాపుగా 70 ఏళ్ళు నిండవస్తున్నా  ఆమె కంఠ స్వరంలో కాని, ఆమె మాటల్లో కాని, ఆమె భావాల్లో కాని ఎక్కడా అణుమాత్రమైనా వృధ్ధాప్యపు ఛాయలు కాని, ఒక్క నిరాశాపూరిత ఆలోచన కాని కనిపించలేదు. ఆమె తన ప్రసంగం ” మీరెప్పుడైనా ఇంద్రధనస్సుని చూసారా?” అంటూ మొదలుపెట్టింది. ఒకొక్కరి జీవితంలో ఎన్నెన్ని ఇంద్రధనస్సులుంటాయో, వాటిని ఎలా కాపాడుకొవాలో, వాటి వెంట ఎలా ప్రయాణించాలో ఆమె తన జీవితం నుంచి కొన్ని కొన్ని సంఘటనలు ఉదహరిస్తూ చెప్పుకొచ్చింది.తన జీవితంలో తల్లి, తమ్ముడు, మామయ్య, తన కొడుకు వీళ్ళంతా రకరకాల జీవితపు దశల్లో ఎలా ఇంద్ర ధనస్సులై కొత్త ఆశల్ని, కొత్త కలల్ని మోసుకొచ్చారో చెపుతుంటే ప్రేక్షకులంతా  పసిపాపలై  ఆ ఏడురంగుల  అనుభూతుల వెంట ప్రయాణించారు.
బాలికగా వున్నపుడే, తల్లి బాయ్ ఫ్రెండ్ వల్ల రేప్ కు గురి కావటం, ఆ తర్వాత పోలిసులు వచ్చి ఆ రేపిస్ట్ హత్యకు గురైన సంఘటన చెప్పినప్పుడు తానెంత భయంకరమైన సంఘర్షణకు గురై, ఆ క్షణం  నుంచి ఆరేళ్ళపాటు ఒక్క మాట కూడా మాట్లడలేక గొంతు మూగబొయిందో ఆమె మాటల్లో వింటున్నప్పుడు కళ్ళు చెమర్చని ప్రేక్షకులు లేరేమో. ఆ మౌనం తోనే మాయా ఏంజలో  స్కూల్ కెళ్ళింది. ఎవ్వరితో మాట్లాడలేని మాయా లైబ్రరిలో వున్న ప్రతి ఒక్క పుస్తకం చదివేసింది. అలాంటి దశలో ఆమెకు దొరికిన ఆలంబన ‘ కవిత్వం ‘. అంతే ఆమె ఆ కవిత్వపు ప్రేమలో పడిపోయింది. కవిత్వం నా sanity ని కాపాడింది అని మాయా ఏంజలో చెప్పినప్పుడు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. తనకు పదకొండేళ్ళప్పుడు తాను షేక్ స్పియర్  రచనల్ని చదివి  అది రాసింది సౌత్ లో రేప్ కు గురైన ఒక నల్ల అమ్మాయి అని ఎంత గట్టిగా నమ్మిందో చెప్పినప్పుడు సభలో నవ్వులు విరిసాయి.
జీవితంలో ఎన్ని రకాల వొడిదుడుకులొచ్చినా సరె, కవిత్వాన్ని, రచనని మాత్రం తానెలా వొదిలిపెట్టలేదొ,అదే తనకొక ‘ ఔట్ లెట్ ‘ ఎలా అయిందన్న విషయాన్ని ఆమె చెప్పినప్పుడు చిన్నచిన్న వాటికే మనం ‘ రైటర్స్ బ్లాక్  ’ అనుకోవడం ఎంత అసంబద్ధమో తెలిసివచ్చి తలదించుకోవాల్సి వచ్చింది. మాయా ఏంజలో తన కొత్త పుస్తకం Letters To My Daughter నుంచి ఒక చిన్న చాప్టర్, అలాగే తన కవిత ఒకటి  చదివి వినిపించటం వల్ల ఆమె చేసింది ఒక ప్రసంగం లా కాక ఓ అద్భుత performance అనుభూతిని మిగిల్చింది. అయితే నా చేతిలో వున్న ఎంపి3 ప్లేయర్ సరిగ్గ చార్జ్ కాకపోవటం వల్ల, ఆమె మాటల్ని మళ్ళీ మళ్ళీ వినటానికి వీలుగా ఆమె ప్రసంగాన్ని రికార్డ్ చేసుకోలేకపోవడం ఒక దురదృష్టం గా ఇప్పటికీ భావిస్తాను. ఆమెను చూసి, ఆమె ప్రసంగం విన్న స్పూర్తి నాలో నిద్రాణమై వున్న కవితాశక్తిని మళ్ళీ మేల్కొలిపింది.
మాయా ఏంజలో అంటే  వర్తమాన సాహిత్యంలో ఒక తిరుగులేని స్వరం. గత ఏప్రిల్ లో మాయా  70 వ పుట్టినరోజు సందర్భంగా ఓప్రా  షో లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఓప్రా అడిగింది ” వయస్సు మీదపడటం గురించి ఏమనుకుంటున్నారని?”. అప్పుడు మాయా ఇచ్చిన సమధానం— ” ఏమి జరిగినా సరే, అదెంతో  చెడుగా ఇవాళ కనిపిస్తున్నా సరె, జీవితం ముందుకే సాగిపోతుంది. రేపు ఎప్పుడూ బాగుంటుందన్నది  నేను నేర్చుకున్న పాఠం”
మాయా ఏంజలో మిగతా రచనల్లాగే ఆమె కొత్త పుస్తకం ” లెటర్స్ టు మై డాటర్” కూడా మనమెవ్వరం కూడా మర్చిపోలేని పుస్తకం. ఈ పుస్తకంలో జీవితం, నమ్మకం, మాత్రుత్వం, కరుణ, మానవత్వానికి సంబంధించిన విషయాల మీద 28 చిన్న వ్యాసాలు, కొన్ని కవితలు వున్నాయి. మనం ఆ పుస్తకం నుండి  ఎంతో ప్రేమను పొందుతాము. జీవన సూత్రాల్ని, పాఠాల్ని నేర్చుకో గలుగుతాము. అందుకే అది ఒక్కసారి మాత్రమే చదివి పక్కనపెట్టేసే పుస్తకం కాదు. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ, ఇతరులతో పంచుకోవాల్సిన   పుస్తకం. అందులో ఆమె ఇలా అంటారు ” నేను ఒక పిల్లవాడికి జన్మనిచ్చాను. కాని నాకు వేలవేలమంది కూతుర్లున్నారు. నువ్వు నలుపో, తెలుపో, యూదువో, ముస్లిమో, ఏషియనో, స్పానిష్ మాట్లాడుతావో,లేదా నేటివ్ అమెరికన్ వో. నువ్వు లావుగా వుంటావో, సన్నగా వుంటావో, అందంగానో, లేక మాములుగా వుంటావో, నువ్వు గే లేదా స్ట్రైట్, చదువుకున్నావో లేదా నిరక్షరాస్యురాలివో, కాని నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. ఇదిగో మీ అందరికి నేనిది సమర్పిస్తున్నాను ” అంటారు. ఆమె ప్రేమను, ఆమె అందించిన కానుకల్ని అందుకున్న మనం ఎంతో అదృష్టవంతులం. ఆ పుస్తకం చదువుతున్నంత సేపు ఎవరికి వారం మనం ఆమె కూతురైనట్టు, మనం మన తల్లితో మాట్లాడుతున్నట్టు అనుభూతి చెందుతాము. జీవితంలో ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి అనుబంధాల్లోనైనా మనం నిజాయితీతో ఎందుకుండాలో, ఎలా వుండాలో ఒక తల్లిగా ఆమె తన అనుభవాల నుండి చెప్పే మాటలు మనందరికీ ఇవాళ పనికొచ్చే పాఠాలు.
మనలాంటి వాళ్ళందరికి మాయా ఏంజలో ఎప్పటికీ ఆరిపోని  ఒక దీపస్థంభం! ఆ వెలుతురు ముందు మనమంతా మిణుగురులమే!
కల్పనారెంటాల
ఓప్రా ఇంటర్వ్యూ లో మాయా ఏంజలో తాను నేర్చుకున్న విషయాల గురించి చెప్పిన ఆణిముత్యాలాంటి మాటలు…
” మీ తల్లితండ్రులతో మీ అనుబంధం ఎలాంటిదైనా మీ జీవితం నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు వాళ్ళను ఎంతలా కోల్పొయినది అనుభవంలోకి వస్తుందనేది నేను నేర్చుకున్నాను”.
” జీవనం కోసం సంపాదించుకోవటం, ఒక జీవితాన్ని తీర్చిదిద్దటం  ఒకటి కాదని నేను నేర్చుకున్నాను”.
” జీవితం ఒక్కోసారి నీకు రెండో అవకాశం ఇస్తుందని నేను నేర్చుకున్నాను”.
” ఎప్పుడైనా సరే నేను మనస్పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే , దాదాపుగా అది సరైన నిర్ణయమైనట్టు నేను నేర్చుకున్నాను”.
” ప్రతిరోజు బయటకెళ్ళి ఎవర్నో ఒకరిని చేరుకొని , ఎవరినో ఒకరిని తాకండి. ఒక వెచ్చటి కౌగిలింత, లేద వీపు మీద ఒక స్నేహపూరిత చరుపు లాంటివాటిని అందరూ ఇష్టపడతారని నేను నేర్చుకున్నాను”.
” నేను నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా వున్నాయన్న సంగతి నేను నేర్చుకున్నాను”.
” ఇతరులతో నువ్వేమి చెప్పావో వాళ్ళు మర్చిపోతారు. ఇతరులకు నువ్వేమి చేసావో కూడా వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు వాళ్ళను  ఎలా ఫీల్ అయ్యేలా చేసావో మాత్రం వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరన్న సంగతి నేను నేర్చుకున్నాను”.
తిరిగి రాని నాన్న కోసం
1995 జూలై 18 వ తేది మా నాన్న గారు కన్ను మూసినా, ఇప్పటికీ ఆయన లేరని తెలిసి చెమర్చే కళ్ళతొ, ఆర్ధ్రమైన హృదయంతో అప్పుడప్పుడో రాసుకున్న ఈ కవిత మా నాన్న గారి గుర్తుగా , నివాళిగా….
నాన్నా!
మనం మాట్లాడుకోని క్షణం వుందా?
కలయికల్లేవనే గానీ
మనల్ని కలపని క్షణం వుందా?
నీ చరమ సంధ్య వాకిట
నా అడుగులు చప్పుళ్ళు లేవనే గానీ
ఏదో ఒక చివరంటే
నేనొక దగ్ధమైన అడవినవుతాను
చివరి మాటా
చివరి చూపు
చివరి స్పర్శా
అసలెక్కడా వుండకూడనుకుంటాను
నాన్నా!
నీ రెప్పల కింద వొణికిపోయిన
చిట్టచివరి అశ్రువును నేనేనా?
మూయలేక కాలం చేతుల్లో మూతబడిన
నీ కళ్ళ కింద దాచిపెట్టిన
అసంపూర్తి కలను నేనేనా?
ఆ చివరి శయ్య మీద
రాలిన దేహాన్ని నేనేనా?
ఎప్పుడో చీకటి బిందువైన నువ్వు
ఇప్పుడు చెట్టంత వెలిగిన నేను
నువ్వు వెనక్కూ, నేను ముందుకు కాలంతో నడిచివస్తున్నప్పుడు
నీ చిటికినవేలు
ఎప్పుడెలా జారిపోయిందో గుర్తే లేదు
నువ్వు నిల్చున్న తీరాన్ని వదిలి
ఈ నౌక దిక్కులన్నీ చుట్టుకుంది
ఇప్పుడు ఈ కల్లోల సముద్రమే
నీ చిటికెన వేలుగా మారింది
నీ కలలన్నీ నిజమే కాని
ఎప్పటికి నిజం కావు
నువ్వు చెమట చుక్కలతో కట్టిన గూడు
ఇప్పుడేమో వొట్టి మోడు
రెక్కలెలా వుంటాయో తెలీకుండానే
కనుపాపలు ఎగిరిపోయాయి
శూన్యాన్ని రెపరెపలాడిస్తున్న దిగులు గూడులో
గాలిదీపమై మిగిలాను
నిజమే నాన్నా! నీ కలలన్నీ అబధ్ధాలే
ఎప్పటికీ శాంతించని యుధ్ధాలే
ఆయుధాల్లేవు
రణరంగమూ లేదు
కలానికి నిజానికి మధ్య సంధి పొసగదు
నడి సముద్రంలో నువ్వు
మరణానికి వీలునామా రాస్తావు
దూరంగా వెలుగుతున్న సంధ్య వొడిలో
తెల్లరే విచ్చుకునే  నీ సూర్య నేత్రం కోసం
నేను చీకటి పహారాలోకెళ్తాను
రెండు దిక్కుల మధ్య ప్రయాణం
ఎంత దూరమో, అంత దగ్గర!