Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for జనవరి, 2008

flower2.jpg 

స్నానం
దేహం మీంచి జారిపోయే నీటి బిందువులుflower1.jpgflower1.jpg
జ్ఞాపకం ఘనీభవించి దేహమైంది

నువ్ చేసిన గాయస్రావం రాత్రి

నీకోసం
విచ్చుకున్న పెదవి
పొగడపూల పరిమళంతో

నా నడుంగీత మీంచి
నువ్వలా నడిచివస్తుంటావా
ఒక్క క్షణం చూద్దును  కదా
అరవిరిసిన నవ్వై నా వొళ్ళో వుంతావు

ప్రాణమా
ఎదురుగ వుంది
దేహమా
ఇక్కడే వుంది
మరి కలయిక….
నిలువెత్తు పూలచెట్టులా నేను
రాత్రి కౌగిలిలో నలిగి
రాలిపడ్డ జ్ఞాపకాల పూలు

ప్రకటనలు

Read Full Post »

rainrain1.jpgrain.jpgrain.jpgఆ వానచుక్కల అడుగుల చప్పుడు
కళ్ళకు వినిపిస్తునే వుంది

ఆ గాలి కిటికీ మూతపడుతున్న శబ్దం
చెవులకు కనిపిస్తునే వుంది

ఆత్మీయ అశాంతి
చెక్కిలిని ముద్దాడుతునే వుంది (మరింత…)

Read Full Post »

విస్మృతి

నిద్ర నాకు గాయాన్ని కానుక చేసింది
గాయం నాకు రాత్రిని కానుక చేసింది
ఈ రాత్రినేం చేసుకొను?
ఈ చీకటిని ఎలా మూటకట్టుకోను?
(మరింత…)

ప్రకటనలు

Read Full Post »

గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!!

వాళ్ల బతుకులు ఎప్పుడెలా ఆరంభమయ్యాయో
ఎక్కడ ఎప్పుడెలా అంతమయ్యాయో
ఒక్క సాక్ష్యమూ దొరకదు
ఒక్క మాటా వినిపించదు
ఒక్క కాలిజాడా మిగలదు (మరింత…)

ప్రకటనలు

Read Full Post »

‘కనిపించే పదం’ – కల్పన రెంటాల తో ముఖాముఖి

– హిమబిందు

తనను ‘కనిపించే పదం’గా ప్రకటించుకున్న కల్పన రెంటాల, నిజానికి ‘వినిపించే బలమైన స్వరం’ కూడా. అచ్చం ఆమె కవితలలాగే… ఆమె మాట, భావాలు, వాటిని ప్రకటించే తీరు చాలా ‘ఇంటెన్సివ్’గా…నిలదీయటాకి ఏ మాత్రం భయపడని విధంగా వుంటాయి. అజంతా అవార్డు గ్రహీత అయిన కల్పన, స్త్రీ వాద కథ, సాహిత్య విమర్శలే కాకుండా పలు అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రాసి, ఇప్పుడున్న కొద్ది మంది సాహిత్య విమర్శకులలో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. ఇండియా-పాకిస్తాన్ కవయిత్రుల కవితల్ని ‘ఆమె పాట’ కాలమ్ కింద అనువాదం చేశారు. స్త్రీల స్వరాలు ఏ స్థాయిలో ఉన్నా ఆలకించాలని, గొంతు దాటి రాని ఆలాపనలను సైతం పసిగట్టి వినిపించాలని తపన పడే ఆమెతో చిన్న సంభాషణ…
(మరింత…)

ప్రకటనలు

Read Full Post »

పాపికొండలు ఓ చిన్ననాటి పలవరింత. నెమలికన్నులాంటి ఓ పులకరింత. తొలిప్రేమలాంటి ఓ కలవరింత, పాపికొండల్ని చూసిరావడం ఇంకా చాలా మందికి ఓ తీరని కోరిక.చాలా చాలా రోజుల తరువాత ఆప్తమిత్రులతో ఓ మూడు రోజులు కలిసి గడపడమంటే ఎన్నటికీ మరువలేని జ్ఞాపకం. ఆ మధుర జ్ఞాపకానికి ప్రాణం పోసి మా అందరి మనసులు దోచిన కొండవీటి దొంగ సత్యవతికి అభినందనలు. హైదరాబాద్లో బైలుదేరిన దగ్గర్నుంచి తిరిగి ఇంటికి చేరేవరకూ ఎక్కడా ఏ చిన్న పొరపాటు దొర్లకుండా, ఎవరికీ ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసిన సత్యవతికి, భూమిక బృందానికి కృతజ్ఞతలు. (మరింత…)
ప్రకటనలు

Read Full Post »

Her Story Begins:
*
మెలకువలో జననం
స్వప్నంలో మరణం
నడుమ నెత్తుటిని పులుముకున్న రంగుల ప్రపంచం (మరింత…)

ప్రకటనలు

Read Full Post »

Older Posts »