Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for ఫిబ్రవరి, 2008

ఏమిటి ఈ  స్లీపింగ్ పిల్ కథ? ఇందులో ఏమి చెప్పాను? ఎలా చెప్పాను? ఎందుకు చెప్పాను? అన్న వివరణల్లోకి వెళ్ళే ముందు …..
నిజానికి ఓ రచయిత తన అభిప్రాయాలేమిటో పూర్తిగా కథలోనే చెప్పగలగాలి. అప్పుడే కథా రచన టెక్నిక్కు  అలవడినట్టు. వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటే రచయిత తన అభిప్రాయాన్ని కథలో సరిగ్గ చెప్పి వుండకపోవడం లేదా చెప్పలేకపోవడం ఒక కారణం.రచయిత చెప్పినది పాఠకులకు అర్ధం కాకపోవడం వెనుక పాఠకుడి అవగాహనా లోపం కూడా కొంత వుంటుంది అని నేను అనుకుంటాను. కాబట్టే ఇందులో నా వంతు పాత్రగా నేను రాసిన కథ మీదవున్న వ్యాఖ్యలకు నా వివరణ రాయాలనిపించింది.

కథ బావుంది అన్న వాళ్ళకు , అర్ధం చేసుకున్నవాళ్ళకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమి రాయక్కరలేదు. మిగతా వ్యాఖ్యల గురించే ఈ సమాధానం.

ఈ కథలో ప్రధానంగా నేను చర్చించాలనుకున్న విషయం ‘వైవాహిక అత్యాచారం’ గురించి. వివాహ వ్యవస్థ చాటున జరిగే ఈ అత్యాచారం గురించి దాదాపుగ ప్రతి ఒక్క స్త్రీకి తెలిసే వుంటుంది.నేను కావలని పనిగట్టుకొని ఎవరిని విలన్ గా చూపించే ప్రయత్నం చేయలేదు. అలా ఎవరికైనా అనిపిస్తే ఆ రకంగా ప్రవర్తించే మగవాళ్ళు, అలాంటి భావజాలంలోని విలనీతనం అది.దాంపత్యంలోని ప్రేమ, అనురాగం, దగ్గరితనం లాంటివి ఎలా వుందలో, లేదా ఎలా వుంటే బావుంటుందో చెప్పాలనుకున్న కథ కాదు కాబట్టి అవేమి ఇందులో చర్చించలేదు.

మారిటల్ రేప్ నేరమని, అందుకు పాల్పడిన జీవితభాగస్వామి ని చట్టబద్దంగా శిక్షించవచ్చన్న చట్టాలు కూడా వచ్చాయి.కాని ఆచరణలో అదెంత చట్టుబండలైందో అందరికీ తెలిసిన విషయమే. సంసారం గుట్టు, వ్యాధి రట్టు అన్నట్టు ఇలాంటి విషయాల గురించి బయటకు  చెప్పుకోలేని వ్యవస్థ మనది. దాన్ని గురించి మాట్లడటమే టాబూ మనకు.ఇలా జరగడం సహజమేలే అని సర్దుకునే వళ్ళే తరతరాలుగా. అలంటిదే నా తులసమ్మ పాత్ర. ఆమె తన బాధను అన్నేళ్ళు మౌనంగా అనుభవించింది.ఎవరితో చెప్పుకోకుండానే. తన కూతురికి ఇలాంటి బాధలేమైనా వున్నయేమో అడగాలని, మాట్లాడలని అనుకోవడమే మార్పులోని తొలి అడుగు.

స్త్రీ శరీరం ఆస్తిలాగ వాడుకోవడం లోని బాధని చెప్పే ప్రయత్నం చేశాను. తులసమ్మ ఈ విషయాల గురించి కూతురితో మాట్లాడగలిగితే ఆ కూతురు తన కూతురితొ మాట్లాదుతుంది.ఈ మాట్లాడుకోవడం వెనుక కొన్నేళ్ళ వేదన వుంది. అది చెప్పడం మాత్రమే ఈ కథ వుద్దేశం.
ప్రపంచంలోని స్త్రీలందరు తులసమ్మలని, మగవారంతా పరంధమయ్యలని ఎవరైనా అనుకుంటే అది వాల్ల తప్పు. నేను అల జనరలైజ్ చేసి చెప్పలేదు.
ఈనాడులో ఈ కథ ప్రచురితమైన ఒకటి, రెందు రోజులకు వసుంధరలో ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మీరే ఇక్కడ చదవండి.

చిట్టి తల్లులూ..చిక్కులొద్దు!

”పదహారేళ్లలోపు అమ్మాయితో ఆమె ఇష్టప్రకారమే శారీరకంగా కలిసినా.. అది అత్యాచారం కిందే లెక్క… చివరకు భర్తయినా సరే ఇలాంటి చర్యను శిక్షార్హంగా పరిగణించాలి”అని న్యాయకమిషన్ ఇటీవల విస్పష్ట ప్రతిపాదనలు చేసింది. భర్త బలవంతపు సంభోగానికి పాల్పడటంతో తీవ్రరక్తస్రావం జరిగి మరణించిన ఫూల్మునీ అనే అమ్మాయి కేసును ఉదాహరణగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషన్ సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించింది. పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయాన్నీ సేకరించింది. సంబంధిత చట్టాల్లోని బలహీనమైన అంశాలను తొలగించే దిశగా చర్యలు తప్పనిసరి అభిప్రాయపడింది. ఎన్ని చట్టాలుచేసినా..సిఫారసులు గుప్పించినా..చివరకు బాధితులు అమ్మాయిలే. ఒక్క ఫూల్మునీయే కాదు..కనిపించకుండా చీకట్లోనే మగ్గిపోతున్న అమ్మాయిలెందరో…ఈ వయసు అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్న అబ్బాయిలకూ కమిషన్ సిఫారసు గట్టిహెచ్చరికే. ప్రేమలు.. డేటింగ్‌ల మోజులో అమాయకంగా చిక్కుకుంటే ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ…. పరిణితితో యోచించమంటున్నారు నిపుణులు. సాటి యువతరం ప్రతినిధులదీ అదే సలహా…. ‘

ప్రకటనలు

Read Full Post »

స్లీపింగ్ పిల్

ఒంటిమీద ఏదో పాకినట్టనిపించి గబుక్కున మెలకువ వచ్చింది తులశమ్మకు. పరిచితమైన స్పర్శే కానీ… గొంగళిపురుగును తలపిస్తోంది. చటుక్కున ఆ చేతిని విసురుగా తోసేసి, ”ఏమిటిది, ఎన్నిసార్లు చెప్పాను… ఇవన్నీ వద్దని. నాకు నిద్రొస్తోంది” అంది ఒకింత విసుగ్గా.
”ఏం నేనేమైనా కానిపని చేశానా? రాకూడని వాళ్ల పక్కలోకి వచ్చానా? రోజూ జరిగేదానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తావు? పక్కలోకి వెుగుడు కాకపోతే ఎవడొస్తాడు?” అన్నాడు కోపం, అసహనం కలగలిసిన గొంతుతో పరంధామయ్య.
(మరింత…)

Read Full Post »

మాట ఎప్పుడూ అంతే
చెప్పిన మాట వినదు

మాట కత్తిరిస్తుంది
బంధాల్ని, బంధనాల్ని
మాట కలుపుతుంది
మనుష్యుల్ని, మనసుల్ని

మరణానికి ముందో, వెనుకో
ఓ మాట మాట్లాడవూ?

ఫ్రేమకు ముందో, మోసం తర్వాతో
ఓ మాట మాట్లాడవూ?

వర్ణక్షరాలతో కాదు

వొంటి మీద గాయాలతో
నెత్తురోడుతున్న మనసుతో
మాట్లాడవా

రక్తస్రావం గురించో
మనస్తాపం గురించొ
మాట్లాడవా?
***

దాక్కుంటున్నవా? దాచుకుంటున్నవా?
ఏదో ఒకటి చెప్పు
ఎగతాళైన తాళి గురించో
ఓడిపోయిన అమ్మతనం గురించో

మూసిన బాధల గుప్పెట్లొంచి
రంగురంగుల సీతకోకచిలుకల్ని
ఇక ఎగరేయి

Read Full Post »

బిల్కీస్ బానొ.

 గోద్రా  దుర్ఘటన అనంతరం గుజరాత్లో జరిగిన మతకల్లోలాల నరమేధంలో మోడీ మార్క్ హిందుత్వానికి బలైపోయిన మన తోటి బెహన్.

బిల్కీస్ బానో జీవితం రాత్రికి రాత్రి ఎలా చిధ్రమైపోయిందో చెప్పటానికి యే బాష సరిపోదు. నిఘంటువు లోని యే పదాలు పనికిరావు. ఎందుకంటే స్త్రీల శరీరలపై జరిగే హింస వ్యక్తీకరణకు అక్షరాల్లేవు. పదాల్లేవు. వాక్యాల్లేవు. బిల్కీస్ బానో ఇవాళ కేవలం ఓ గుజరాతీ ముస్లిం మహిళ మాత్రమే కాదు. అది నేనో, మీరో, మన పక్కింటి అమ్మాయో కావచ్చు. 2002 మార్చి 3 న ఆమెపై సామూహిక అత్యాచరం జరిగేవరకు ఆమెకున్నది ఒకే ఒక్క ఐడెంటిటి. అది రంధికపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిగ మాత్రమే.ఆ గ్రామానికి చెందిన హిందువులు, ముస్లింలు ఇద్దరికీ కూడ ఆ అమ్మయి ఆ వూరిపిల్ల. అంతే. అప్పుడామెకు గోద్రా ముస్లింలు కూద ఔట్ సైడర్స్ మాత్రమే. హిందు, ముస్లింల సంబంధ బాందవ్యాలు, సాంఘిక-రాజకీయ అంశాలు ఇవేమి తెలియని, తెలుసుకోవల్సిన అవసరం లేని అతి సాధారణ గ్రుహిణి. (మరింత…)

Read Full Post »