Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for జూలై, 2008

చాలా చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ నా బ్లాగులో ఈ టపా రాస్తున్నాను. నా కుడిచేయి యే
పని చేయనివ్వకపొవడమే టపాలు రాయకపోవడానికి కారణం.రెగ్యులర్ గా కాకపోయినప్పటికి అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన టపాలు చదువుతూనే వున్నాను.

కొన్ని టపాలకు స్పందించాలని అనిపించినప్పటికి ఒక అరగంట కంప్యూటర్ మీద పని చేయడం వల్ల తర్వాత వచ్చే నొప్పికి భయపడి వూరుకున్నాను. ఆ నొప్పిని కూడా పక్కన పెట్టించి నా చేత ఈ టపా రాయిస్తున్న ముఖ్యమైన అంశాలు ఏమిటంటె…

బ్లాగులోకంలో చాలా మంది అభిమానాల్ని సంపాదించుకున్న ‘మనసులోని మాట ‘సుజాత రాసిన జర్నలిస్టు ఉద్యోగం టపాలు, ఆ టపాలకు వచ్చిన కామెంట్స్ లోని అభిప్రాయాలు నన్ను ఎక్కువగ అలోచింపచేసాయి. నా చేత మళ్ళీ ఈ టపా రాసేలా చేసాయి.

 

అసలు బ్లాగు అంటే ఏమిటి?దాని ఉద్దేశం, టపాలు, వాటిలోని డెమొక్రసీ, వాడవలసిన భాష, సమాధానాలు చెప్పాల్సిన పద్ధతి వీటన్నింటిమీద నాకు బోలెడన్ని సందేహాలు వచ్చాయి.

అవి పంచుకోవడమే ఈ టపా వుద్దేశము.నా సందేహాలకు తోటి బ్లాగర్ల నుండి వారి వారి అభిప్రాయాల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ చర్చ సంచలనాల కోసమో, ఎవరినో దుమ్మెత్తిపోయాడానికో మాత్రం కాదని దయచేసి అర్ధం చేసుకోండి. ప్రజాస్వామ్యయుతమైన చర్చలకు బ్లాగుల్ని ఒక వేదికగా చేసుకుందాము వీలైతే.

బ్లాగు అనేది ఒక పర్సనల్ డైరీ లాగానో, ఒక జర్నల్ లాగానో మొదలైనప్పటికి అది కేవలం అక్కడికే పరిమితం కాలేదు. దాని వుద్దేశం, పరిధి మరింత విశాలమయ్యాయి.ఇప్పుడు అది ఒక సొంత పత్రిక లాగా తయారైంది. ఇది శుభ పరిణామమేనని నేను అనుకుంటున్నాను.

అయితే సొంత పత్రిక అయినంతమాత్రాన మనిస్టమొచ్చినవి మనం రాసుకోవచ్చా? బూతులు, శ్రుంగారం లాంటివి ఏవైనా సరే.కూడలి లో స్థానం కల్పించరు కాబట్టి అలాంటివి రాయడం మానుకోవాలా? లేక అది మన వ్యక్తిగత సంస్కారం కూడా అయి వుండాలా?

 
అసలు బ్లాగరిజం అంటే ఏమిటి? వాటికి  నియమ నిబంధనలు వున్నాయా? భాష విషయంలోనైనా, భావం విషయంలోనైనా? వుంటే అవి ఏమిటి?

మన భావాలు, అభిప్రాయాలు అందర్ని వొప్పించేవిగా, మెప్పించేవిగా వుండనక్కరలేదని తెలుసు కాని అవి వాస్తవాలైనా అయి వుండాలా? అక్కర్లేదా?

ఉదాహరణకి ఒక మతం మీద రాస్తున్న రాతలు చూద్దాము. ఒక మతం గురించి ఒక బ్లాగరు రాస్తున్న రాతలు , విషయాలు అసత్యాలు, అసంబద్దమని మనకు తెలుసు కాబట్టి ఒకసారి ఆ బ్లాగుకి వెళ్ళి మనం ఏమనుకుంటున్నామో చెపుతాము. వినకపోతే, అర్దం చేసుకోకపోతే మర్యాదగ పక్కకు తప్పుకుంటాము. మనకిస్టం లేని బ్లాగులకు వెళ్ళకపోవడమే పరిష్కరమా? ఇంకా ఏమైనా పద్దతి  వుందా? ఒక బ్లాగులో రాసినవి వాస్తవాలు కాకపోతె, మనకు నచ్చకపోతే కామెంట్స్ రాయాల? వద్దా? రాస్తే వాళ్ళు వేయకపోతే మనం ఏమైన చేయగలమా? అసలు ఏమైన చేయలా? మిన్నకుండాల? వాస్తవాలు మనకు తెలిస్తె చాలా? అందరికి చెప్పాలా? ఇలంటి పరిస్థితుల్లొ బ్లగెర్ కి వున్న హక్కులు ఏమిటి? వ్యాఖ్యాతలకున్న హక్కులు ఏమిటి?

ఇదొక ఉదాహరణ మాత్రమే. ‘మనసులోని మాట ‘ సుజాత రాసిన ‘ నా జర్నలిస్టు ఉద్యోగం -మూడు భాగాలు ‘ టపాలు చదివాక నాకు అభ్యంతరకరం అనిపించినవి నా కామెంటుగా నా పేరుతోనే జూలై 17 లేదా 18 పంపాను. నా కామెంట్ ప్రచురితం కాలేదు. పైగా మూడో భాగం టపా మాయమైంది. ఎందుకో వివరణ లేదు. తర్వాత సెలవులు అనే టపా రాసింది. నా పాత  కామెంట్ ఏమైందని అక్కడ కూడా ఒక కామెంట్ పెట్టాను. నా కామెంట్లు రావడం లేదు కాని మిగత వారి కామెంట్స్ వస్తున్నాయి అని. ఆశ్చర్యంగా అది కూడా ప్రచురితం కాలేదు.

మూడో భాగం టపా ఎందుకు తీసెసారు? నా కామెంటు ఎందుకు వేయలెదు అని అడిగే హక్కు నాకు వుంటుందా? వుండదా?  బ్లాగుల్లొ పొలిటికల్లి కరెక్ట్ భాష వాడక్కరలెదు అన్నది కొందరి బ్లాగర్ల అభిప్రాయమా? లేక తెలుగు బ్లాగుల లక్షణమా?

తెలుగు బ్లాగులు చేస్తున్న సేవ గురించి పత్రికల్లో ముఖచిత్ర కధనాలు వస్తె తెగ మురిసిపోయిన అభిమానిగా నాకొచ్హిన ఈ సందేహాల్ని  ఎవరైనా తీరిస్తే వారికి ధన్యవాదాలు. నన్ను నేను సరిదిద్దుకుంటాను.

ప్రకటనలు

Read Full Post »