నేనొక వరూధినిని
భీతహరిణేక్షణను, తిరస్క్రుతను
వలచిన నేరానికి
దగాపడ్డ వెలయాలిని!
హిమవత్పర్వత సాక్షిగా
దక్కింది నిర్నిద్ర వేదనే!
వలచి వచ్చిన వనితల్ని
మోసగించే మాయప్రవరుల వారసులే మనువులు!
*****
నేనొక శకుంతలను!శాపగ్రస్తను!
ఓ మగవాడి అవ్యక్త స్మ్రుతిని!
నేను మినహా అన్ని గుర్తున్న అతను
అతను వినా మరేమి గుర్తు లేని నేను
ఇద్దరి నిరవధిక సుఖవారాశికి
మనఃప్రక్రుతే మౌనసాక్షి!
అభిజ్ఞానం తప్ప మగని ఆదరణ పొందలేనిదాన్ని!
******
నేను పంచభర్త్రుక ద్రౌపదిని
అర్జునుణ్ణి వలచి అయిదు ముక్కలైనదాన్ని
మగవాడి మాయాజూదంలో ఓ పణాన్ని
నిండు కొలువులో నిలువెత్తు పరాభవం
ఇల్లాలితనమే లేదన్న ధర్మసూనుడు
వంతుల కాపురానికి మిగిలింది
జీవన నటనా విషాదం!
*****
నేను యయాతి పుత్రికను మాధవిని
దురహంకార పురుషజాతి ఆస్తిని
నియోగినిని!నిలువెత్తు సౌందర్యరాశిని!
నలుగురితో సంసారం
నాకు మాత్రం నగుబాటు కాదట
నాది క్షాత్రధర్మమట
నాలుగు పసిమొక్కల క్షేత్రధర్మమట
నిత్య యవ్వనకన్యనట
అకటా!
మగువ మనసు తెలియని వీరా
మహరాజులు!మహర్షులు!మగవారు!
*****
కనుదోయిపై కలల నీలి నీడలు
కాలం చెప్పిన కధల్లో
అందరూ దుఃఖభాగినులే
ఈ స్త్రీపర్వమంతా దుఃఖస్మ్రుతుల దొంతర!
****
ఇప్పుడు నేను మానవిని
అవ్యక్తనూ, పరిత్యక్తనూ కాను
అయోనిజనో, అహల్యనో కాబోను
వంచిత శకుంతల వారసురాలిని అసలే కాను
స్త్రీత్వపు కొలమానం గానే మిగలనింక
నేను అపరాజితను
కనిపించని సంకెళ్ళను ఛేదించే కాళిని
సస్యక్షేత్రాన్నే కాదు, యుద్ధ క్షేత్రాన్ని
సిగ్గుతో చీలిపోయిన భూమిని నేనే
నెర్రెలు విచ్చిన నేలను విశాలమైన బాహువులతో కప్పే ఆకాశాన్ని నేనే!
ఎంత బాగా నచ్చిందో చెప్పలేనండి.అద్బుథమైన పదాలు అంతే మంచి భావం.I really liked it.
Thanks Kranthi
సెబాసు.
చాలా బాగా రాశారు.
మీరు కనక లేఖిని వాడుతున్నట్టైతే, భర్తృక, స్మృతి రాయాలంటే R వాడొచ్చు.
Thaanks kottapaaLi. alaanti akshara doshalu panti kinda raLLala addupadutuntaayi. correct chestanu.
ముగించిన విధానం చాలా బావుందండీ!
భాగుంది కల్పనా, మళ్లీ నీకవితలు కనిపిస్తున్నందకు సంతోషం. నాకెప్పుడూ నీ ఇమేజరీ నచ్చుతుంది.
అభినందనలు.
Thaanks Nishigandha, Malathi gaaru.